- Home
- Telangana
- Viral Video: రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడు.. అంతలోనే దూసుకొచ్చిన ట్రైన్. చివరికి ఏమైందంటే
Viral Video: రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడు.. అంతలోనే దూసుకొచ్చిన ట్రైన్. చివరికి ఏమైందంటే
Viral Video: ఎలాగైనా పాపులర్ అవ్వాలి, భారీగా లైక్‌లు రావాలి. సోషల్ మీడియా వచ్చాక కొందరిలో ఇలాంటి ఆలోచణ పెరిగింది. ఇందుకోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియో రీల్స్ పిచ్చి ఎంత పీక్స్‌కి చేరిందో చెబుతోంది.

సోషల్ మీడియా కోసం ప్రాణాలకే ముప్పు
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి హద్దులు దాటుతోంది. లైక్స్, షేర్లు, వ్యూస్ కోసమే లక్ష్యంగా యువత ముందుకు వెళ్తోంది. క్షణాల్లో వైరల్ కావాలన్న ఆలోచనతో ప్రమాదకర పనులకూ వెనుకాడడం లేదు. ఒకప్పుడు టాలెంట్ చూపించడానికి ఉపయోగించిన సోషల్ మీడియా… ఇప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడే స్థాయికి చేరుతోంది.
వైరల్ అవ్వాలన్న తాపత్రయం… వివేకాన్ని మింగేస్తోంది
ఎలాగైనా ఫేమస్ అవ్వాలి అన్న మానసికత రోజురోజుకీ పెరుగుతోంది. ఆలోచనకు చోటు లేకుండా చేస్తున్న ఈ వైరల్ తాపత్రయం యువతను ప్రమాదాల వైపు నడిపిస్తోంది. సురక్షిత హద్దులు, చట్టాలు, ప్రాణాల విలువ అన్నవి క్షణిక వీడియో ముందు చిన్నవిగా మారిపోతున్నాయి. ఇది ట్రెండ్ కాదు… ఆందోళన కలిగించే పరిస్థితి.
రైల్వే ట్రాక్‌పై ప్రాణాలతో చెలగాటం
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఈ పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందో చూపిస్తోంది. ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై మోకాళ్లపై కూర్చుని వీడియో తీశాడు. అదే సమయంలో ఎదురుగా రైలు వేగంగా వస్తోంది. రైలు దగ్గరకు వచ్చాక కూడా ట్రాక్ వదలలేదు. చివరకు ఆ యువకుడి మీదుగా రైలు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు అతడికి ఏమీ కాలేదు. కానీ ఇది చూసినవారికి మాత్రం గుండె గుబురుపడింది.
నెటిజన్ల ఆగ్రహం…
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఒక్క సెకను ఆలస్యం అయినా ప్రాణాలు పోయేవి” “వైరల్ కోసం ఇంత రిస్క్ అవసరమా?” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తేలికగా తీసుకుంటే రేపు మరెందరో ఇదే దారిలో వెళ్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సజ్జనార్ హెచ్చరిక… ఇది సాహసం కాదు, మూర్ఖత్వం
ఈ వీడియోను సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందుకు ఆయన ఇచ్చిన క్యాప్షన్ మరింత గట్టిగా హెచ్చరిస్తోంది. “వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు.. అది పరాకాష్టకు చేరిన మూర్ఖత్వం. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.” ఈ మాటలు ఇప్పుడు ప్రతి యువకుడికి హెచ్చరికగా మారాలి. సోషల్ మీడియాలో వచ్చే క్షణిక ఫేమ్ కంటే ప్రాణాల విలువ ఎన్నో రెట్లు ఎక్కువ. ఒక వీడియో కోసం జీవితం పణంగా పెట్టడం ధైర్యం కానే కాదంటున్నారు.
వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు.. అది పరాకాష్టకు చేరిన మూర్ఖత్వం. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
Be Responsible, Not Reckless!#LifeIsPrecious#DontRiskYourLifepic.twitter.com/5GBZ2BdTcn— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 3, 2026

