MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్

Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్

Who is Best PM of India: విద్యార్థుల హక్కులు, విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోసం పోరాడుతున్న సీజేపీ అభిజీత్ దీప్కే.. దేశంలో బెస్ట్ పీఎం, బెస్ట్ సీఎం ఎవరు అనేదానిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 25 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దేశంలో బెస్ట్ ప్రధాని ఆయనే.. అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
Image Credit : chatgpt

దేశంలో బెస్ట్ ప్రధాని ఆయనే.. అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

దేశంలో ఇప్పటివరకు పరిపాలించిన బెస్ట్ ప్రధానమంత్రి ఎవరనే ప్రశ్నపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూనే ఇప్పటివరకు దేశం చూసిన అత్యుత్తమ ప్రధాని అని ఆయన స్పష్టం చేశారు. ఒక మీడియాా ఛానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీజేపీ నాయకులు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ కూడా అభిజీత్ దీప్కే వ్యాఖ్యలతో ఏకీభవించారు. నెహ్రూ దేశంలోనే అత్యంత 'కూలెస్ట్' ప్రధాని అని దీప్కే అభివర్ణించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అత్యుత్తమ ముఖ్యమంత్రులు వీరే
Image Credit : Asianet News

అత్యుత్తమ ముఖ్యమంత్రులు వీరే

దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల గురించి అడిగిన ప్రశ్నకు అభిజీత్ దీప్కే ముగ్గురి పేర్లను ప్రస్తావించారు. తమిళనాడు మాజీ సీఎం ఎమ్‌కే స్టాలిన్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను ఆయన బెస్ట్ ముఖ్యమంత్రులుగా పేర్కొన్నారు.

స్టాలిన్ తమిళనాడు ఆర్థిక వ్యవస్థను ఎంతో మెరుగుపరిచారని కొనియాడారు. పినరయి విజయన్ కేరళ ఆరోగ్య రంగాన్ని అద్భుతమైన మోడల్‌గా తీర్చిదిద్దారని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో విద్యా వ్యవస్థ, వైద్య రంగాలలో గణనీయమైన మార్పులు తెచ్చారని ఆయన వివరించారు.

Related Articles

Related image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Related image2
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
34
సెప్టెంబర్ 5న సీజేపీ ఢిల్లీ మార్చ్
Image Credit : our own

సెప్టెంబర్ 5న సీజేపీ ఢిల్లీ మార్చ్

ఉపాధ్యాయుల దినోత్సవమైన సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలో భారీ మార్చ్ నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రకటించింది. జూలై 25న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పార్టీ ఆరోపించింది. ఈ మార్చ్‌ను ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువజన సంఘాలు, యువత ఈ శాంతియుత మార్చ్‌లో పాల్గొనాలని సీజేపీ పిలుపునిచ్చింది. నీట్ పరీక్షల వివాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలు, పోలీస్ చర్యల వల్ల బాధితులైన కుటుంబాలు ఈ మార్చ్‌కు నాయకత్వం వహిస్తాయని సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ తెలిపారు.

44
నెహ్రూ-రష్యా సంబంధాలపై బోరిస్ జాన్సన్ వ్యాఖ్యలు
Image Credit : Asianet News

నెహ్రూ-రష్యా సంబంధాలపై బోరిస్ జాన్సన్ వ్యాఖ్యలు

మరోవైపు, భారత్-రష్యా సంబంధాలపై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్'లో మాట్లాడిన ఆయన, జవహర్‌లాల్ నెహ్రూ, బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II మధ్య జరిగిన ఒక చరిత్రాత్మక సంభాషణను గుర్తుచేసుకున్నారు. 1952లో నెహ్రూ మహారాణితో మాట్లాడుతూ, "యువర్ మెజెస్ట్రీ, భారత్ ఎల్లప్పుడూ ప్రాథమికంగా రష్యా వైపే ఉంటుంది" అని చెప్పారని క్వీన్ ఎలిజబెత్ తనకు స్వయంగా చెప్పినట్లు జాన్సన్ వెల్లడించారు.

భారత్, అమెరికా, బ్రిటన్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరం అని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరాలో భారత్ వహించిన పాత్రను ఆయన ప్రశంసించారు. బ్రెగ్జిట్ తర్వాత భారత్-బ్రిటన్ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని కూడా ఆయన పేర్కొన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image2
Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
Recommended image3
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Related Stories
Recommended image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image2
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved