MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • Rice Price Hike : బియ్యం ధరలు ఎందుకింతలా పెరుగుతున్నాయి?

Rice Price Hike : బియ్యం ధరలు ఎందుకింతలా పెరుగుతున్నాయి?

దేశంలో వరి అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ టాప్ లో ఉంటాయి. అలాంటి రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటడం ప్రజలను కంగారుపెడుతోంది. ఇందుకు కారణమేంటో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 24 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆకాన్నంటుతున్న బియ్యం ధరలు
Image Credit : Getty

ఆకాన్నంటుతున్న బియ్యం ధరలు

తెలుగు ప్రజల నిత్య జీవితంలో బియ్యం ఎంతో కీలకమైంది... ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోనే అన్నం ఎక్కువగా తింటారు. ఉదయం పూట తినే టిఫిన్ల నుండి రాత్రి భోజనం వరకు బియ్యంతో చేసిన పదార్థాలే ప్రధాన ఆహారంగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సన్నబియ్యం (Fine Quality Rice) ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలలో భారీగా మార్పులు రావడం వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రెండు నెలల్లోనే కిలో బియ్యంపై రూ. 10 నుండి 20 వరకు పెంపు
Image Credit : Getty

రెండు నెలల్లోనే కిలో బియ్యంపై రూ. 10 నుండి 20 వరకు పెంపు

మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే సామాన్యులను భయపెడుతున్నాయి. ఇప్పుడు బియ్యం ధరలు పెరుగుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలల క్రితం వరకు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 50 నుండి రూ. 55 వరకు లభించిన సన్నరకం బియ్యం, ప్రస్తుతం ఏకంగా రూ. 10 నుండి రూ. 20 వరకు పెరిగాయి. దీంతో ఇప్పుడు కిలో సన్నబియ్యం ధర రూ. 60 నుండి రూ. 70కి చేరింది. సోనా మసూరి, బీపీటీ, హెచ్‌ఎంటీ వంటి ప్రముఖ సన్న రకాల ధరలన్నీ దాదాపు ఇదే రీతిలో పెరిగాయి. 25 కిలోల బియ్యం బస్తాపై రూ. 250 నుండి రూ. 500 వరకు పెరిగినట్లు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు కూడా ధరల పెంపును ధ్రువీకరిస్తున్నారు.

Related Articles

Related image1
Over Cooked Rice: అన్నం మరీ మెత్తగా అయ్యిందా? మళ్లీ పొడి పొడిగా మార్చేయచ్చు..!
Related image2
Rice Weevils: ఈ సింపుల్ టిప్స్ తో బియ్యానికి పట్టిన పురుగులు మాయం!
34
ధరల పెంపునకు ప్రధాన కారణాలేంటి?
Image Credit : Gemini AI

ధరల పెంపునకు ప్రధాన కారణాలేంటి?

సన్నబియ్యం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని మిల్లుల యజమానులు, ధాన్యపు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

సన్నరకం ధాన్యం లభ్యత తగ్గడం : గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో సన్నరకం పంట దిగుబడి రాకపోవడం, మిల్లుల్లో నిల్వలు క్రమంగా తగ్గిపోవడంతో స్థానిక మార్కెట్లలో సన్నబియ్యానికి కొరత ఏర్పడింది.

పౌరసరఫరా శాఖ దగ్గరే భారీగా సరుకు : రైతుల నుండి ప్రభుత్వం సన్నరకం బియ్యంను భారీగా సేకరించింది. ప్రస్తుతం పౌరసరఫరా శాఖ వద్ద అవసరానికి మించిన బియ్యం ఉంది. ఇది కూడా బియ్యం ధరలు పెరగడానికి కారణం అయ్యింది.

పొరుగు రాష్ట్రాల నుండి విపరీతమైన డిమాండ్ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు సన్నబియ్యం భారీగా ఎగుమతి అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో సన్నబియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో అక్కడి వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించి ఇక్కడి నుండి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రభావం స్థానిక మార్కెట్లపై పడి ధరలు ఆకాశాన్నంటాయి.

44
సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం
Image Credit : ChatGPT

సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం

సాధారణంగా 4 నుంచి 5 మంది ఉన్న ఒక సగటు కుటుంబానికి నెలకు కనీసం 25 నుండి 40 కిలోల బియ్యం అవసరమవుతాయి. బియ్యం ధరలు కిలోపై రూ. 15 నుండి 20 వరకు పెరగడంతో ప్రతి కుటుంబంపై నెలకు రూ. 500 నుండి రూ. 800 వరకు అదనపు భారం పడుతోంది. కేవలం ఇళ్లలోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, కర్రీ పాయింట్లు నిర్వహించే వారిపై కూడా ఈ భారం స్పష్టంగా కనిపిస్తోంది. బియ్యం ధరలు పెరగడంతో రాబోయే రోజుల్లో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, రాబోయే కొత్త పంట చేతికి వచ్చే వరకు సన్నబియ్యం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైస్ మిల్లులలో నిల్వల కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడాలని, స్థానిక వినియోగదారులకు అందుబాటు ధరల్లో బియ్యం లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
LPG: ఇక‌పై ఇళ్ల‌లో గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపించ‌వా.? కేంద్రం కీల‌క అడుగులు
Recommended image3
పేదలకు ప్రభుత్వం శుభవార్త.. రూ.10 లక్షల కవరేజ్‌తో 1,800కు పైగా చికిత్సలు
Related Stories
Recommended image1
Over Cooked Rice: అన్నం మరీ మెత్తగా అయ్యిందా? మళ్లీ పొడి పొడిగా మార్చేయచ్చు..!
Recommended image2
Rice Weevils: ఈ సింపుల్ టిప్స్ తో బియ్యానికి పట్టిన పురుగులు మాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved