MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • LPG: మరో మూడు రోజులే టైముంది.. వెంటనే ఈ పనిచేయకపోతే మీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కట్ !

LPG: మరో మూడు రోజులే టైముంది.. వెంటనే ఈ పనిచేయకపోతే మీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కట్ !

LPG: గ్యాస్ ఏజెన్సీల వద్ద పెరుగుతున్న కస్టమర్ల రద్దీని తగ్గించేందుకు, అక్రమ కనెక్షన్లను అరికట్టేందుకు ఎల్పీజీ ఇ-కేవైసీ పూర్తి చేసుకునే చివరి తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం, చమురు విక్రయ సంస్థలు బిగ్ అప్డేట్ ఇచ్చాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 28 2026, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
LPG ఈకేవైసీ పూర్తి చేయడానికి చివరి ఛాన్స్
Image Credit : Getty

LPG ఈకేవైసీ పూర్తి చేయడానికి చివరి ఛాన్స్

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించారు. మరో మూడు రోజుల్లో మీరు ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్ కట్ అయ్యే అవకాశముంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీ ఎల్పీజీ కనెక్షన్ ఈకేవైసీ ఇంకా పూర్తి కాకపోతే, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. దీనివల్ల గ్యాస్ సిలిండర్ డెలివరీ, సబ్సిడీ పొందే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గడువులోగా ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది?
Image Credit : Getty

గడువులోగా ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది?

నిర్ణీత సమయంలోగా ఈకేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్ వెంటనే రద్దు కాదని అధికారులు స్పష్టం చేశారు. అయితే సిలిండర్ బుకింగ్, డెలివరీ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే మీకు అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ కావాల్సిన సమయంలో డెలివరీ ఆగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎల్పీజీ సబ్సిడీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కస్టమర్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు సిలిండర్ కోసం పూర్తి డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే త్వరితగతిన ఈకేవైసీ పూర్తి చేయాలి.

35
ఎల్పీజీ ఈకేవైసీ ఎందుకు అంత ముఖ్యం?
Image Credit : Getty

ఎల్పీజీ ఈకేవైసీ ఎందుకు అంత ముఖ్యం?

ఎల్పీజీ ఈకేవైసీ నిర్వహించడం వెనుక ప్రధాన ఉద్దేశం గ్యాస్ కనెక్షన్ అసలైన కస్టమర్ పేరిటే ఉందో లేదో నిర్ధారించడం. గృహ అవసరాల కోసం ఇచ్చే రాయితీ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడడమే దీని ముఖ్య లక్ష్యం. అలాగే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను చట్టవిరుద్ధంగా కమర్షియల్ అవసరాల కోసం వాడకుండా నిరోధించడానికి ప్రభుత్వం వినియోగదారుల వివరాలను వెరిఫై చేస్తోంది. బోగస్ కనెక్షన్లకు చెక్ పెట్టడం, సబ్సిడీ నేరుగా నిజమైన లబ్ధిదారుడికే అందేలా చేయడం దీని ద్వారా సాధ్యమవుతుంది.

45
ఇంట్లోనే ఉండి ఈకేవైసీ చేయడం ఎలా?
Image Credit : Getty

ఇంట్లోనే ఉండి ఈకేవైసీ చేయడం ఎలా?

ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి కస్టమర్లకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పని పూర్తి చేయడానికి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లేదా మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు.

• ఇండియన్ ఆయిల్ కస్టమర్లు: IndianOil ONE యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు.

• భారత్ గ్యాస్ కస్టమర్లు: Bharatgas మొబైల్ యాప్ ఉపయోగించి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

• హెచ్‌పి గ్యాస్ కస్టమర్లు: HP Gas కి సంబంధించిన యాప్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు.

55
మొబైల్ ఆధార్ లింకింగ్, ఆఫ్‌లైన్ విధానం
Image Credit : Getty

మొబైల్ ఆధార్ లింకింగ్, ఆఫ్‌లైన్ విధానం

ఆన్‌లైన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాలనుకునే వారికి ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ చాలా అవసరం. ఒకవేళ మీకు ఆన్‌లైన్ విధానం కష్టంగా అనిపిస్తే లేదా ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, నేరుగా మీ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కూడా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిలిండర్లు పొందడానికి వెంటనే మీ ఈకేవైసీని పూర్తి చేయండి. ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Recommended image2
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image3
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Related Stories
Recommended image1
Himalayan Snow Bombs: నేపాల్ విలయం కంటే పెద్ద ప్రమాదం.. భారత్‌లోని ఈ 6 రాష్ట్రాలు కొట్టుకుపోతాయా?
Recommended image2
USA Jobs: అమెరికాలో భారతీయులు ఎక్కువగా చేసే ఉద్యోగాలు ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved