MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Koti : హైదరాబాద్ లోని కోఠి ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది? దీని అర్థమేంటి?

Koti : హైదరాబాద్ లోని కోఠి ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది? దీని అర్థమేంటి?

హైదరాబాద్ లోని ప్రముఖ మార్కెట్ ప్లేసెస్ లో కోఠి ఒకటి. ఈ ప్రాంతం స్ట్రీట్ మార్కెట్ కు చాలా ఫేమస్. అసలు కోఠి అంటే ఏమిటి? ఈ ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చింది?

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 28 2026, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ హిస్టరీ
Image Credit : Gemini AI

హైదరాబాద్ హిస్టరీ

Hyderabad : హైదరాబాద్ లో ఉండేవారికే కాదు తెలుగు ప్రజలందరికి కోఠి ప్రాంతం సుపరిచితమే. చాలామంది ఏదో ఒక సమయంలో ఈ ప్రాంతానికి వెళ్లివుంటారు... కళ్లారా చూడకున్న ఈ పేరు వినివుంటారు. నగర నడిబొడ్డున గల ఈ ప్రాంతం నుండి హైదరాబాద్ లోని ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చు. సరిగ్గా మహాత్మాగాంధీ బస్టాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు మధ్య మూసీ నది తీరంలో కోఠి ప్రాంతం ఉంటుంది. ఇది మంచి మార్కెట్ ప్లేస్... ఇక్కడ అత్యంత చౌక ధరలో వస్తువులు లభిస్తుంటారు.

అయితే చాలామంది కోఠికి వెళ్లివుంటారు, అక్కడ షాపింగ్ చేసివుంటారు... కొందరు నిత్యం ఆ ప్రాంతం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు... ఇలాంటివారిని 'కోఠి' అంటే అర్థమేంటో అడగండి? చాలామంది చెప్పలేరు. మరి కోఠి అంటే ఏమిటి? ఈ పేరు ఎలా వచ్చింది? దీని హిస్టరీ ఏమిటి? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోఠి అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

కోఠి అంటే ఏమిటి?

కోఠి ప్రాంతంలో మార్వాడీలు, గుజరాతీలు ఎక్కువగా ఉంటారు... కాబట్టి 'కోఠి' పదం ఏ రాజస్థానీ, గుజరాతీ పదమో అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది అచ్చమైన హైదరబాదీ పదం. ఉర్దూ లేదా హిందీలో పెద్దపెద్ద రాజమహల్ లాంటి భవనాలను కోఠి అంటారు. ఈ కోఠి అనే పదంనుండే కోట అనే పదం కూడా వచ్చింది. నిజాంల కాలంలో తెలంగాణలోనే కాదు యావత్ ఇండియాలోనే పెద్దదైన బ్రిటీష్ ప్యాలస్ మూసీ నది తీరంలో ఉండేది... దీనివల్లే ఈ ప్రాంతాన్ని కోఠి అంటారు.

35
కోఠికి ఆ పేరు ఎలా వచ్చింది?
Image Credit : Wikipedia

కోఠికి ఆ పేరు ఎలా వచ్చింది?

హైదరాబాద్ ప్రాంతాన్ని నిజాం రాజులు పాలించారు... వీళ్ళు బ్రిటీష్ పాలకుల కింద కాకుండా సర్వస్వతంత్రులుగా ఉన్నారని చాలామంది అనుకుంటారు. కానీ బ్రిటీష్ వాళ్ళు నేరుగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోకున్నా వారి కనుసన్నల్లోనే ఇక్కడ పాలన సాగిందని చరిత్ర చెబుతోంది. బ్రిటీష్ ప్రతినిధిగా నిజాం రాజ్యంలో ఓ అధికారి (రెసిడెంట్) ఉండేవాడు... ఇలా జేమ్స్ అక్లిక్ క్రిక్ ప్యాట్రిక్ ఇక్కడ పనిచేశారు.

రెసిడెంట్ క్రిక్ ప్యాట్రిక్ తన పాలనాసౌలభ్యం కోసం మూసీ తీరంలో ఓ పెద్ద ప్యాలస్ కట్టుకున్నాడు... 64 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. నిజాం రాజులు కట్టించుకున్న రాజభవనాల కంటే ఈ బ్రిటీష్ అధికారి కట్టించుకున్న ప్యాలస్ పెద్దది. ఈ భవనం కలిగిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని కోఠి అనేవారు... ఇదే పేరు తర్వాత కూడా స్థిరపడిపోయింది.

45
హైదరాబాద్ లో ఇంతపెద్ద ప్యాలస్ ఎందుకు కట్టారు?
Image Credit : Wikipedia

హైదరాబాద్ లో ఇంతపెద్ద ప్యాలస్ ఎందుకు కట్టారు?

ఆనాటి బ్రిటీష్ పాలకులకు భారతీయులంటే చాలా చిన్నచూపు ఉండేది.. బానిసలుగా భావించేవారు. చివరకు ఇక్కడి రాజులను కూడా అలాగే చూసేవారు. అందుకే అపర కుభేరులైన నిజాం రాజుల కంటే తామే గొప్పవారిమి అని చెప్పుకోడానికి క్రిక్ ప్యాట్రిక్ కోఠిలో ఓ పెద్ద ప్యాలస్ కట్టించుకున్నారని చారిత్రకారులు చెబుతారు. నిజాం సర్వస్వతంత్రుడు కాదు తమ సామంతుడు మాత్రమే... అతడు తమ కిందే ఉన్నాడని చెప్పడానికి ఈ ప్యాలస్ కట్టించుకున్నాడట... అంటే హైదరాబాద్ సంస్థానంలో నిజాంకంటే తానే శక్తివంతుడిని అని ఈ భవనం ద్వారా క్రిక్ ప్యాట్రిక్ చెప్పదల్చుకున్నాడు.

ఇటలీలోని పలెడియన్ ప్యాలస్ మాదిరిగా ఈ హైదరాబాద్ రెసిడెన్స్ ను భారీతనం ఉట్టిపడేలా నిర్మించారు.. అమెరికా దేశాధ్యక్షుడి భవనం వైట్ హౌస్ కంటే పెద్దదని చెబుతారు. బ్రిటీష్ పాలకులు చెన్నై, కలకత్తా వంటి నగరాల్లో నిర్మించుకున్న భవనాల కంటే ఇది పెద్దది. దేశంలోని అనేక రాజభవనాలు, కోటల కంటే ఈ హైదరాబాద్ రెసిడెన్స్ హౌస్ పెద్దదిగా ఉండేదట.

55
నేటి కోఠి ఉమెన్స్ కాలేజీయే ఆనాటి బ్రిటీష్ రెనిడెన్సీ
Image Credit : Getty

నేటి కోఠి ఉమెన్స్ కాలేజీయే ఆనాటి బ్రిటీష్ రెనిడెన్సీ

బ్రిటీష్ రెసిడెన్సిగా కొనసాగిన భవనం ప్రస్తుతం విద్యాలయంగా మారింది. నిజాం లొంగుబాటు తర్వాత 1949 లో ఈ భవనం ప్రభుత్వ చేతుల్లోకి వచ్చింది... దీన్ని ఆనాటి పాలకులు ఉమెన్స్ కాలేజీగా తర్వాత కొంతభాగాన్ని మెడికల్ కాలేజీగా మార్చారు. అయితే ఇది చారిత్రక కట్టడమే అయినా లోపలికి మగవాళ్లు, సామాన్య ప్రజలు వెళ్లలేరు... ఎందుకంటే ఇందులో ఉమెన్స్ కాలేజీ కొనసాగుతోంది. ఆనాటి బ్రిటీష్ రెసిడెన్సీ, నేటి ఉమెన్స్, మెడికల్ కాలేజీల చుట్టూ విస్తరించిన ప్రాంతమే ఈనాటి కోఠి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Recommended image2
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image3
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Related Stories
Recommended image1
Hyderabad Real Estate : మూడు నెలల్లోనే ఎకరం ధర ఏకంగా రూ.27 కోట్లు పెరిగిందా? అక్కడ అసలు ధర తెలిస్తే షాక్
Recommended image2
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved