MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే

IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే

Heavy Rain Alert : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మొత్తం రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇకపై భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని… కొన్ని ప్రాంతాల్లో అతలాకుతలం తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 15 2026, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..
Image Credit : AI Image/Gemini

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి... జూన్ 6న ప్రవేశించి జూన్ 15 నాటికి అన్ని ప్రాంతాలను తాకాయి. అంటే ఇక వర్షాకాలం జోరందుకున్నట్లే. రుతుపవనాలకు ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు కూడా తోడయ్యాయి. దీంతో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
Image Credit : Perplexity AI

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..

జూన్ 15న (మంగళవారం) పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.

కోస్తాంధ్ర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఓవైపు వర్షాలతో పాటు ఎండలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

Related Articles

Related image1
Now Playing
Heavy Rain Alert!: వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు భారీ వర్షాలు| Asianet News Telugu
Related image2
Rain Card: వర్షాకాలం బయటకు వెళ్తున్నారా.? జేబులో పట్టే ఈ రెయిన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే
34
తెలంగాణలో వర్షాలు..
Image Credit : others

తెలంగాణలో వర్షాలు..

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సాయంత్రం లేదా రాత్రి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మరికొద్దిసేపట్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రేపు (జూన్ 16, మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇలా తెలంగాణలో వర్షాలు జోరందుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

44
జూన్ 18 నుండి 20 వరకు జోరువానలు..
Image Credit : Gemini

జూన్ 18 నుండి 20 వరకు జోరువానలు..

తెలంగాణలో రెండ్రోజుల్లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా జూన్ 18 (గురువారం) నుండి 20 (శనివారం) వరకు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
No Bag Day: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. నెలకు ఒకరోజు నో బ్యాగ్ డే.. అసలు ఏంటిది?
Recommended image2
Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి
Recommended image3
Weather Update: తీవ్రమైన ఈదురుగాలులు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షల హెచ్చరిక
Related Stories
Recommended image1
Now Playing
Heavy Rain Alert!: వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు భారీ వర్షాలు| Asianet News Telugu
Recommended image2
Rain Card: వర్షాకాలం బయటకు వెళ్తున్నారా.? జేబులో పట్టే ఈ రెయిన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved