MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Rain Card: వర్షాకాలం బయటకు వెళ్తున్నారా.? జేబులో పట్టే ఈ రెయిన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే

Rain Card: వర్షాకాలం బయటకు వెళ్తున్నారా.? జేబులో పట్టే ఈ రెయిన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే

Rain Card: వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం. అలాంటి సమయంలో గొడుగు లేదా రెయిన్‌కోట్ లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యకు పరిష్కారంగా మార్కెట్లోకి వచ్చిన ఉత్పత్తే పాకెట్ రెయిన్ కార్డ్. ఏటీఎమ్ కార్డు సైజులో ఉండే ఈ కార్డ్‌తో ఉప‌యోగాలు ఇవే. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 15 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏటీఎమ్ కార్డు సైజులోనే పూర్తి రెయిన్‌కోట్
Image Credit : Amazon.in

ఏటీఎమ్ కార్డు సైజులోనే పూర్తి రెయిన్‌కోట్

ఈ రెయిన్ కార్డ్ ప్రత్యేకత దాని పరిమాణం. సాధారణ ఏటీఎమ్‌ కార్డ్ సైజులో ఉండే చిన్న ప్యాక్‌లో ఇది వస్తుంది. పర్స్, జేబు, హ్యాండ్‌బ్యాగ్, బ్యాక్‌ప్యాక్ లేదా ట్రావెల్ కిట్‌లో చాలా తక్కువ స్థలంలో ఇమిడిపోతుంది. అందువల్ల ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వర్షం పడితే వెంటనే ఉపయోగించుకోవ‌చ్చు
Image Credit : Amazon.in

వర్షం పడితే వెంటనే ఉపయోగించుకోవ‌చ్చు

అనుకోకుండా వర్షం మొదలైతే ఈ ప్యాక్‌ను తెరిచి లోపల ఉన్న రెయిన్ పౌచ్‌ను బయటకు తీసుకోవచ్చు. కొన్ని సెకన్లలోనే ధరించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. వర్షంతో పాటు తేలికపాటి గాలుల నుంచి కూడా రక్షణ అందిస్తుంది.

Related Articles

Related image1
Viral Video: ప్రేమ ముందు విడాకులు ఓడిపోయాయి.. వైర‌ల్ అవుతోన్న ఈ హ‌గ్‌ స్టోరీ ఏంటో తెలుసా.?
Related image2
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
35
తేలికైన వాటర్‌ప్రూఫ్ మెటీరియల్
Image Credit : Amazon.in

తేలికైన వాటర్‌ప్రూఫ్ మెటీరియల్

ఈ పాకెట్ రెయిన్‌కోట్‌ను PE (పాలిథిలిన్) వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారు చేశారు. బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే ఉండటంతో ధరించినప్పుడు భారంగా అనిపించదు. నీరు లోపలికి రాకుండా శరీరాన్ని పొడిగా ఉంచడంలో సహాయపడుతుంది.

45
ప్రయాణాలు, ట్రెక్కింగ్, అవుట్‌డోర్ కార్యక్రమాలకు బెస్ట్
Image Credit : Amazon.in

ప్రయాణాలు, ట్రెక్కింగ్, అవుట్‌డోర్ కార్యక్రమాలకు బెస్ట్

ఈ ఉత్పత్తి ట్రావెల్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, ఫెస్టివల్స్, థీమ్ పార్కులు, అవుట్‌డోర్ ఈవెంట్లు వంటి సందర్భాల్లో చాలా ఉపయోగపడుతుంది. వర్షం వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లేవారు దీనిని వెంట తీసుకెళితే ఉపయోగకరంగా ఉంటుంది.

55
అందరికీ సరిపోయే డిజైన్.. ముఖ్య వివరాలు
Image Credit : Amazon.in

అందరికీ సరిపోయే డిజైన్.. ముఖ్య వివరాలు

ఈ రెయిన్‌కోట్ యూనిసెక్స్ డిజైన్‌తో రూపొందించారు. పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించవచ్చు. ఎక్కువ మంది పెద్దలకు సరిపోయేలా "వన్ సైజ్ ఫిట్స్ మోస్ట్" విధానంలో తయారు చేశారు. దీని బ‌రువు కేవ‌లం 30 గ్రాములు మాత్ర‌మే ఉంటుంది. పరిమాణం: 8 x 7 x 2 సెం.మీ ఉంటుంది. వర్షాకాలంలో తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో తీసుకెళ్లగల అత్యవసర రక్షణ ఉత్పత్తిగా ఈ పాకెట్ రెయిన్ కార్డ్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా బైక్ రైడర్లు, ట్రావెలర్స్, విద్యార్థులు, ఉద్యోగులకు ఇది ఉపయోగపడే గ్యాడ్జెట్‌లాంటి రెయిన్‌వేర్.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Phone Number: మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు ఎందుకు ఉంటాయి? 8, 9 ఎందుకు లేవు..?
Recommended image2
Anant Ambani: వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. అంబానీ కొడుకు బరువు ఎందుకు తగ్గలేదు..?
Recommended image3
Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూసేయండి
Related Stories
Recommended image1
Viral Video: ప్రేమ ముందు విడాకులు ఓడిపోయాయి.. వైర‌ల్ అవుతోన్న ఈ హ‌గ్‌ స్టోరీ ఏంటో తెలుసా.?
Recommended image2
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved