MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Liquor Shops: మందుబాబులకు షాక్.. మద్యం దుకాణాలు బంద్.. పూర్తి వివరాలు ఇవే

Liquor Shops: మందుబాబులకు షాక్.. మద్యం దుకాణాలు బంద్.. పూర్తి వివరాలు ఇవే

Wine Shops Closed: మందుబాబులకు షాకింగ్ న్యూస్. వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు సైబరాబాద్, హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో మద్యం విక్రయాలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. మద్యం దుకాణాలు బంద్ చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వినాయక నిమజ్జనం వేళ వైన్ షాప్స్ బంద్.. ఏ ఏరియాలో ఎప్పుడంటే?
Image Credit : chatgpt

వినాయక నిమజ్జనం వేళ వైన్ షాప్స్ బంద్.. ఏ ఏరియాలో ఎప్పుడంటే?

వినాయక చవితి నవరాత్రుల ముగింపు సందర్భంగా నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రల వేళ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసుకునేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పలు నగరాలు, జిల్లాల్లో మద్యం విక్రయాలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించారు.

మద్యం మత్తులో కొందరు చేసే చిల్లర పనుల వల్ల శోభాయాత్రల్లో అనవసర గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే, ముందుజాగ్రత్తగా పోలీస్ అధికారులు మద్యం షాపులను క్లోజ్ చేయిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో 24 గంటల వైన్స్ బంద్
Image Credit : Getty

సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో 24 గంటల వైన్స్ బంద్

రాజధాని పరిధిలో నిమజ్జన శోభాయాత్రలు చాలా గ్రాండ్ గా జరుగుతాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి సహా నగరంలో వేలాది విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం విక్రయాలను నిషేధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ ఆదేశాలు ఇచ్చారు.

సైబరాబాద్ లో సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా క్లోజ్ కానున్నాయి. అలాగే హైదరాబాద్ పరిధిలోనూ సిపి వీసీ సజ్జనార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 25న వైన్ షాపులు బంద్ అమల్లో ఉంటాయి. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు చెందిన బార్లకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు.

35
తెలంగాణ జిల్లాల్లో ఆంక్షల అమలు తేదీలు ఇవే
Image Credit : Gemini

తెలంగాణ జిల్లాల్లో ఆంక్షల అమలు తేదీలు ఇవే

కేవలం రాజధాని ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన జిల్లాల్లో కూడా నిమజ్జనం రోజూ మద్యం షాపులు బంద్ కానున్నాయి.

• వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి: ఈ జిల్లాల్లో సెప్టెంబర్ 23 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 24 ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు బంద్ ఉంటాయి.

• జగిత్యాల జిల్లా: కలెక్టర్ ఆదేశాలతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కఠిన ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 71 మద్యం దుకాణాలు, 20 బార్లు, 304 బెల్లర్లను సెప్టెంబర్ 23 ఉదయం నుంచి సెప్టెంబర్ 25 ఉదయం వరకు ఏకంగా రెండు రోజుల పాటు మూసివేయనున్నారు.

• నిజామాబాద్ జిల్లా: ఇక్కడ సెప్టెంబర్ 22 నుంచే వైన్ షాపులపై ముందస్తు బంద్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

45
ఏపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
Image Credit : our own

ఏపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో సైతం వినాయక నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో సెప్టెంబర్ 22న మద్యం దుకాణాలు బంద్ చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్రజల రద్దీ, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

55
చట్టపరమైన చర్యలు తప్పవు
Image Credit : our own

చట్టపరమైన చర్యలు తప్పవు

శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ ఎక్సైజ్ చట్టం-1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ డ్రై డేస్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ తెలిపారు. నిబంధనలను బ్రేక్ చేసి బ్లాక్ లో కానీ, దొంగతనంగా కానీ మద్యం విక్రయాలు జరిపితే షాపుల యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నిమజ్జన శోభాయాత్రల్లో మద్యం సేవించి గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
Recommended image2
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది
Recommended image3
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Related Stories
Recommended image1
School Holidays: దంచికొడుతున్న భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. రెడ్ అలర్ట్ జారీ
Recommended image2
Flash Flood Alert: తీరం దాటుతున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved