MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Technology
  • Phone Charging Tips : మీ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. చేశారో పెద్ద ప్రమాదంలో పడ్డట్టే!

Phone Charging Tips : మీ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. చేశారో పెద్ద ప్రమాదంలో పడ్డట్టే!

రోజంతా ఫోన్ వాడితే సరిపోదు... దాన్ని సరిగ్గా ఛార్జ్ చేయడం కూడా తెలియాలి. చాలామంది ఛార్జింగ్ పెట్టేటప్పుడు, తీసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 02 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫోన్ నుండి ఛార్జర్ ఎలా తీయాలి?
Image Credit : Gemini AI

ఫోన్ నుండి ఛార్జర్ ఎలా తీయాలి?

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని లైఫ్‌ను ఊహించుకోవడం కూడా కష్టమే. కాల్స్ మాట్లాడటం దగ్గర్నుంచి ఇంటర్నెట్, బ్యాంకింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్నింటికీ ఫోనే ఆధారం. కూడు, గూడు మాదిరిగా ఫోన్ కూడా మనిషి నిత్యావసర వస్తువుల్లో భాగమయ్యింది. ఇలా నిత్యజీవితంలో ఎంతో కీలకంగా మారిన స్మార్ట్ ఫోన్ ను చాలా జాగ్రత్తగా వాడాలి... ముఖ్యంగా బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. మరీముఖ్యంగా ఛార్జింగ్ తీసేటప్పుడు చాలామంది కామన్ గా ఓ తప్పు చేస్తుంటారు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు... అదే ఫోన్, ఛార్జర్ రెండింటిని డ్యామేజ్ చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫోన్ ఛార్జింగ్ తీసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు
Image Credit : Getty

ఫోన్ ఛార్జింగ్ తీసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు

చాలామంది ఫోన్ లో ఛార్జింగ్ ఫుల్ అయ్యాక ఛార్జర్ కేబుల్‌ను పట్టుకుని గబుక్కున లాగేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పుడు పద్ధతి. ఇలా ఛార్జర్ కేబుల్‌ను లాగినప్పుడు దాని లోపల ఉండే సన్నని వైర్లు, కనెక్టర్‌పై అనవసరంగా ఒత్తిడి పడుతుంది. పదేపదే ఇలాగే చేస్తే ఛార్జింగ్ కేబుల్ తొందరగా పాడైపోతుంది. అంతేకాదు మీ ఫోన్‌లో కూడా ఛార్జింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది… కొన్నిసార్లు ఫోన్ బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫోన్ నుండి ఛార్జర్ ను వేరుచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఫోన్ నుండి ఛార్జర్ తీసేసే సరైన పద్ధతి ఏంటి?

ఫోన్ నుండి ఛార్జింగ్ కేబుల్ తీసేటప్పుడు వైర్‌ను పట్టుకుని లాగకూడదు... ఫోన్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్లాస్టిక్ లేదా మెటల్ భాగాన్ని (కనెక్టర్ హెడ్) వేళ్లతో పట్టుకుని నెమ్మదిగా బయటకు తీయాలి. దీనివల్ల కేబుల్‌పై ఎలాంటి ఒత్తిడి పడదు, అది ఎక్కువ కాలం మన్నుతుంది. ఇలా జాగ్రత్తగా చార్జర్ ను తొలగించడం వల్ల ఫోన్ బ్యాటరీ కూడా సేఫ్ గా ఉంటుంది.

ఒకవేళ మీ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పాడైపోయినా లేదా వైర్లు బయటకు కనిపిస్తున్నా దాన్ని వాడటం అస్సలు మంచిది కాదు. అలాంటి డ్యామేజ్ అయిన కేబుల్స్.. ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను, ఛార్జర్‌ను విపరీతంగా వేడెక్కిస్తాయి. కాబట్టి కేబుల్ పాడైతే వెంటనే కొత్తది మార్చేయండి.

Related Articles

Related image1
Phone Before Bed: పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారా? ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే !
Related image2
Mobile Phone: మీ ఫోన్‌ను అక్కడ పెడుతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి, పెను ప్రమాదం పొంచి ఉంది?
34
స్విచ్ బోర్డ్ దగ్గర కూడా జాగ్రత్త
Image Credit : Gemini

స్విచ్ బోర్డ్ దగ్గర కూడా జాగ్రత్త

ఫోన్ నుంచి కేబుల్ తీసేటప్పుడే కాదు స్విచ్ బోర్డ్ లేదా సాకెట్ నుంచి ఛార్జర్ తీసేటప్పుడు కూడా ఇదే తప్పు జరుగుతుంది. అక్కడ కూడా కేబుల్‌ను పట్టుకుని లాగకుండా, ఛార్జర్ అడాప్టర్‌ను చేత్తో పట్టుకుని సాకెట్ నుంచి తీయాలి.

ఛార్జింగ్ కేబుల్‌ను సరిగ్గా హ్యాండిల్ చేస్తే మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ కూడా సేఫ్‌గా ఉంటుంది. ఫోన్ ఎక్కువగా వేడెక్కకుండా చూసుకోవడం, పాడైన ఛార్జర్లు వాడకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.

ఫోన్ బ్యాటరీని 0% వరకు వాడొద్దు

బ్యాటరీ పూర్తిగా అయిపోయి (0%) ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు వాడకూడదు. అలాగే ప్రతీసారి 100% ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బ్యాటరీ లెవెల్ 20% నుంచి 80% మధ్య ఉండేలా చూసుకుంటే బ్యాటరీ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది.

రాత్రంతా ఛార్జింగ్ పెట్టొద్దు : ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచితే, బ్యాటరీపై నిరంతరం ఒత్తిడి పడి వేడెక్కుతుంది. ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఫోన్ కవర్‌తో ఛార్జింగ్ వద్దు : ఛార్జ్ అవుతున్నప్పుడు ఫోన్ నుంచి వేడి బయటకు వస్తుంది. మందపాటి ఫోన్ కవర్ ఆ వేడిని బయటకు పోనివ్వకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్ తీసి పెట్టడం మంచిది.

44
నకిలీ ఛార్జర్లను వాడొద్దు
Image Credit : Gemini

నకిలీ ఛార్జర్లను వాడొద్దు

ఒరిజినల్ / సర్టిఫైడ్ ఛార్జర్లు మాత్రమే వాడండి : ఫోన్ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్ లేదా సర్టిఫైడ్ బ్రాండెడ్ ఛార్జర్లను మాత్రమే వాడాలి. నకిలీ ఛార్జర్లు ఫోన్‌కు వెళ్లే కరెంట్‌ను సరిగ్గా కంట్రోల్ చేయలేక బ్యాటరీని పాడు చేస్తాయి.

ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ వాడొద్దు : ఛార్జింగ్ అవుతున్నప్పుడు గేమ్స్ ఆడటం లేదా వీడియోలు చూడటం వల్ల బ్యాటరీపై రెట్టింపు భారం పడుతుంది. ఇది ఫోన్‌ను విపరీతంగా వేడెక్కించి, బ్యాటరీ ఉబ్బడానికి లేదా పాడవ్వడానికి కారణం కావచ్చు.

వేడి ప్రదేశాల్లో ఛార్జింగ్ వద్దు : నేరుగా ఎండ తగిలే చోట, దిండు లేదా పరుపు కింద ఫోన్‌ను పెట్టి ఛార్జ్ చేయకూడదు. చల్లగా, గాలి తగిలే ప్రదేశంలో పెట్టి ఛార్జ్ చేయడమే సురక్షితం.

రోజంతా ఫోన్ వాడితే సరిపోదు. దాన్ని ఎలా ఛార్జ్ చేయాలో, ఎలాంటి తప్పులు చేయకూడదో కూడా కచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ విషయాలు తెలుసుకుంటే మీ ఫోన్ లైఫ్ పెరుగుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related Stories
Recommended image1
Phone Before Bed: పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారా? ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే !
Recommended image2
Mobile Phone: మీ ఫోన్‌ను అక్కడ పెడుతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి, పెను ప్రమాదం పొంచి ఉంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved