MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relationship: మ్యారేజ్ లైఫ్ హ్యాపీ గా ఉండాలంటే.. అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు!

Relationship: మ్యారేజ్ లైఫ్ హ్యాపీ గా ఉండాలంటే.. అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు!

 Relationship: పెళ్లి తర్వాత జీవితం గురించి అందరూ కలలు కంటూ ఉంటారు, ఆ కలలు నిజమవ్వాలని కోరుకుంటారు. అయితే మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్ అది ఏంటో చూద్దాం.
 

Navya G | Updated : Oct 20 2023, 04:50 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

పెళ్లి కాకముందు ప్రతి ఒక్కరికి తన భార్య ఇలాగ ఉంటుంది అని, లేక తన భర్త ఇలా ఉంటాడు అని కొన్ని అంచనాలు ఉంటాయి. పెళ్లి అయిన తర్వాత జీవితం చాలా బాగుంటుంది అని ఎన్నో ఆశలు పెంచుకుంటూ ఉంటారు జనాలు. పెళ్లయిన కొత్తలో ఎదుటి వాళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం వల్ల వాళ్ల పైన ప్రేమ పెరిగి బంధం పెరుగుతూ ఉంటుంది.
 

26
Asianet Image

 వాళ్ళు ఏం చేసినా మనకి నచ్చుతుంది. అన్ని కొత్తగా ఉంటాయి కానీ రోజులు గడుస్తున్న కొద్ది అవే రోతగా  కనిపిస్తాయి.మనం అనుకున్నది ఒకలా ఉంటుంది, పెళ్లయిన తర్వాత అక్కడ ఉండే బంధం మరోలా ఉంటుంది. మన లైఫ్ పార్ట్నర్ మనకి తోడుగా, మనం వేసే ప్రతి అడుగులోనూ ఉండాలి అని అనుకుంటాము.
 

36
Asianet Image

 కానీ కొన్ని కొన్ని సంఘటనలలో అది జరగకపోవచ్చు. అలాంటప్పుడే మనకి ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోతే చాలా నిరాశ చెందుతాము. అలాంటప్పుడే రిలేషన్ షిప్ లో  వీక్ అయిపోతాము. ఇద్దరి మధ్య దూరాలు పెరుగుతాయి, దాంతో బంధం తెగిపోతుంది. వీటన్నిటికి కారణం కేవలం ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే.
 

46
Asianet Image

 ఎక్కువగా ఆశించడం వల్ల అది రియాలిటీ కి ఎక్కడా మ్యాచ్ అవ్వకపోవడంతో ఈమధ్య బంధాలు చాలా తెగిపోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. నాకోసం ఎవడో ఏదో చేస్తాడు అని ఆశలు పెంచుకుంటూ ఉంటున్న వారందరూ అలా జరగకపోయేసరికి ఎంతో నిరాశ చెందుతున్నారు.
 

56
Asianet Image

పెళ్లి అనే బంధం గురించి ఎన్నో ఆశలు  పెట్టుకుంటూ ఆఖరికి విడాకులు వరకు వస్తున్నారు. వీటి అన్నిటికి ఉన్న ఏకైక పరిష్కారం..ఆశించకుండా వచ్చే దానిని యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడమే. ఏం చేసినా అందులో సర్దుకోవడం అనేది ఉండాలి.
 

66
Asianet Image

ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటే కేవలం నిరాశ మాత్రమే మిగులుతుంది. కనుక ఉన్న బంధాలు తెగిపోతాయి. బంధాలు గట్టిగా ఉండాలంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడమే మంచిది, నిండు నూరేళ్లు పచ్చగా బతుకుతారు.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories