Coco Gauff: ఫ్రెంచ్ ఓపెన్ 2025 విజేతగా 21 ఏళ్ల అమ్మాయి.. ఎవరీ కోకో గౌఫ్?
French Open 2025 Women's Final: ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంకా ఓడించి 21 ఏళ్ల కోకో గౌఫ్ ఛాంపియన్ గా నిలిచింది.

ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా కోకో గౌఫ్
French Open 2025 Women's winner Coco Gauff journey: ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్ లో ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంకా, నంబర్ 2 కోకో గౌఫ్ లు తలపడ్డారు. ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఛాంపియన్ గా నిలవడం కోసం అద్భుత పోరాట పటిమను చూపించారు. ప్రపంచ టాప్ సీడ్ ప్లేయర్ల మధ్య జరిగిన ఫైనల్ పోరు చివరివరకు ఉత్కంఠగా సాగింది.
అయితే, అమెరికా యువ సంచలనం కోకో గౌఫ్ అద్భుతమైన ఆటతో 2025 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. బెలారుస్ ప్లేయర్ అరీనా సబాలెంకాపై 6-7, 6-2, 6-4 తేడాతో విజయం సాధించి గౌఫ్ కెరీర్‌లో మరో గ్రాండ్ స్లామ్ ను అందుకుంది.
NEW QUEEN OF PARIS 👑#RolandGarrospic.twitter.com/eiesv9t1Aw
— Roland-Garros (@rolandgarros) June 7, 2025
కోకో గౌఫ్ కుటుంబ నేపథ్యం
కోకో గౌఫ్ టెన్నిస్‌లో తన ప్రయాణాన్ని చిన్ననాటి కలలతో ప్రారంభించింది. ఆ కలలను 2023లో సాకారం చేసుకుంది. ఎనిమిదేళ్ల వయసులో US ఓపెన్ స్టాండ్స్‌లో డ్యాన్స్ చేసిన చిన్నారి కోకో.. 11 ఏళ్ల తర్వాత అదే ఆర్థర్ ఆష్ స్టేడియంలో ట్రోఫీ ఎత్తి పట్టుకుంది. ఈ క్రమంలో ఆమె టెన్నిస్ ప్రపంచాన్ని తన ప్రతిభతో ఆశ్చర్యపరిచింది.
2004, మార్చి 13న అమెరికాలోని ఫ్లోరిడాలోని డెల్రే బీచ్‌లో జన్మించిన కోకో గౌఫ్.. క్రీడలతో బలమైన నేపథ్యం కలిగిన కుటుంబంలో పెరిగింది. ఆమె తండ్రి కోరీ గౌఫ్ జార్జియా స్టేట్ యూనివర్సిటీలో బాస్కెట్‌బాల్ ప్లేయర్ కాగా, తల్లి కాండీ ఓడమ్ గౌఫ్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ట్రాక్ అథ్లెట్.
కోకో గౌఫ్ ప్రారంభ శిక్షణ
కోకో గౌఫ్ చిన్నతనంలోనే టెన్నిస్‌పై ఆసక్తి కనబరిచింది. 10ఏళ్ల వయసులో ఫ్రాన్స్‌కు వెళ్లి ప్రముఖ కోచ్ ప్యాట్రిక్ మురటోగ్లూ (సెరెనా విలియమ్స్ కోచ్) ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. ఆ సమయంలో ఆమె టెన్నిస్ శైలి, స్థైర్యం మరింత మెరుగైంది.
వీనస్ విలియమ్స్‌పై గెలుపుతో టెన్నిస్ ప్రపంచంలో సంచలనం
2019లో కోకో గౌఫ్ వింబుల్డన్ వేదికగా వైల్డ్ కార్డ్ దక్కింది. మొదటి రౌండ్‌లో తన బాల్యం నుంచే అద్భుతమైన ఆట నైపుణ్యాలను చూపించింది. తాను ఆదర్శంగా చూసిన వీనస్ విలియమ్స్‌ను ఓడించి కోకో గౌఫ్ సంచలనం రేపింది. ఈ విజయం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది.
15ఏళ్ల వయసులో వింబుల్డన్ నాల్గవ రౌండ్ చేరిన అతి పిన్న వయస్సు గల ఆటగాళ్లలో గౌఫ్ ఒకరిగా నిలిచింది. 1991లో జెన్నిఫర్ కప్రీయాటి తర్వాత ఈ రికార్డు సాధించింది. అదే ఏడాది US ఓపెన్‌లో మూడవ రౌండ్ వరకు చేరి తన స్థిరమైన ఫామ్‌ను కొనసాగించింది.
2023లో స్వదేశంలో గ్రాండ్‌స్లామ్ విజయం
కోకో గౌఫ్ అత్యుత్తమ మైలురాయి నిలిచిన సంవత్సరం 2023. ఆ ఏడాది కోకో గౌఫ్ యూఎస్ ఓపెన్ గెలిచింది. ఇది ఆమె మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్.