Chanakya Niti: భర్త పొరపాటున కూడా భార్యతో ఈ 4 విషయాలు చెప్పకూడదు!
భార్యా భర్తల బంధం పారదర్శకంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అంటే వారు ఒకరితో ఒకరు అన్ని విషయాలు పంచుకోవాలి. వారి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. కానీ ఆచార్య చాణక్యుని ప్రకారం భర్త.. భార్యకు చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

చాణక్యుడి ప్రకారం..
సాధారణంగా భార్యా భర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. వాటివల్ల వారి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి భార్యా భర్తలు అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకోవడమే మంచిదనేది పెద్దల ఉద్దేశం. కానీ భర్త.. భార్యతో కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదని చెబుతోంది చాణక్య నీతి. మరి చాణక్యడు ఎందుకు అలా చెప్పాడు? అసలు భర్త.. భార్యతో చెప్పకూడని విషయాలెంటో ఇక్కడ చూద్దాం.
బలహీనత గురించి..
చాణక్య నీతి ప్రకారం భర్త.. తన బలహీనతల గురించి భార్యకు ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే ఆమె దాన్ని మీకు వ్యతిరేకంగా కూడా ఉపయోగించే ప్రమాదం ఉంటుంది. బంధం బలంగా ఉండాలంటే ఒకరి బలహీనత మరోకరికి తెలియకపోవడమే మంచిదని చాణక్య నీతి చెబుతోంది.
అవమానం గురించి
భర్త.. తనకు జరిగిన అవమానం గురించి కూడా భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే ఆమె ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. లేదా మీకు పదే పదే గుర్తు చేయచ్చు. అంతేకాదు మిమ్మల్ని అవమానించిన వారిపై ప్రతికారం తీర్చుకునే ప్రయత్నం కూడా చేయచ్చు. కాబట్టి అవమానం గురించి భార్యతో చెప్పకూడదని చాణక్య నీతి చెబుతోంది.
దానం గురించి
దానం ఎప్పుడూ రహస్యంగా ఉండాలి. ఒక చేత్తో దానం చేస్తే.. మరో చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. కాబట్టి దానం గురించి భార్యకు చెప్పకపోవడమే మంచిది. కొందరు ఆడవాళ్లు ఈ విషయాన్ని వ్యతిరేకించవచ్చు. సంపాదన అంతా దానం చేస్తున్నాడని గొడవలకు దిగవచ్చు. కాబట్టి దానం చేసే విషయాన్ని రహస్యంగా ఉంచాలని చాణక్యుడు పేర్కొన్నాడు.
సంపాదన గురించి
చాణక్య నీతి ప్రకారం భర్త ఎంత సంపాదిస్తున్నాడో భార్యకు చెప్పకూడదు. దానివల్ల భార్య.. భర్త ఖర్చులను నియంత్రించవచ్చు. లేదా ఆమె ఎక్కువగా ఖర్చు చేయచ్చు. ఒకవేళ భర్త సంపాదన తక్కువగా ఉంటే.. కొందరు భార్యలు వారిని చులకనగా చూసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి సంపాదన గురించి భార్యకు చెప్పకపోవడమే మంచిదని చాణక్యనీతి చెబుతోంది.