పెళ్లి జీవితానికి పరిపూర్ణత అని చిన్నప్పటి నుంచి నేర్పుతారు. కానీ, కొన్నిసార్లు పెళ్లి భ్రమగా మారుతుంది.
Relationship Tips:
జీవితాంతం సంతోషంగా ఉండాలని, భార్యభర్తల మధ్య సమస్యలు రావద్దు అనే అందరూ కోరుకుంటారు. విడిపోవాలనే ఉద్దేశం ఉంటే అసలు పెళ్లే చేసుకోరు. కానీ, కొందరి జీవితం ఆనందంగా సాగదు. మనస్పర్థలు రావడం వల్ల విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ, విడాకులు తీసుకున్నప్పుడు చాలా మంది జీవితం మీద విరక్తి చెందుతారు. వారి ప్రపంచం అంతం అయిపోయిందని, తప్పు చేశామనే భావనలో బ్రతుకుతారు. కానీ, విడాకులు అనేది ఒక అందమైన ప్రారంభం కావచ్చు.
నిజ జీవితంలో శాశ్వతం అనేది ఏమీ ఉండదు. మార్పు అనేది జీవితంలో భాగం. కొన్నిసార్లు వదులుకోవడం కూడా అవసరం.
పెళ్లి - ఒక వాగ్దానమా? భ్రమా?
పెళ్లి అంటే శాశ్వత బంధం అని నమ్ముతాం. కానీ, మనుషుల మనసులు మారతాయి. నెమ్మదిగా లేదా హఠాత్తుగా. మార్పులను అర్థం చేసుకోకుండా శాశ్వత బంధం గురించి మాట్లాడటం అర్థం లేనిది. ప్రేమ, కమిట్మెంట్ తప్పు కాదు. కానీ అవి శాశ్వతం కావు. అవి రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు.
విడాకులు - ఒక నిజాయితీ నిర్ణయం
విడాకులను సాధారణంగా ఓటమిగా భావిస్తారు. కానీ, అది ధైర్యం, నిజాయితీతో కూడిన నిర్ణయం. మనం కలిసి మొదలుపెట్టిన కథ ఇక సరిపోదని అంగీకరించడం. విడాకులు అనేది బాధ కాదు, విముక్తి. మనకు సరిపోని ఒక నకిలీ కథ నుండి బయటపడటం.
విడాకుల తర్వాత - కొత్త జీవితం
పెళ్లి అంతం అయితే, అది కొత్త జీవితానికి నాంది. మళ్ళీ మనల్ని మనం అర్థం చేసుకునే అవకాశం. ఈ కొత్త ప్రయాణంలో బాధతో పాటు కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమ అంటే ఏమిటో, మన విలువ ఏమిటో తెలుసుకునే అవకాశం.
ప్రేమతో పాటు అవగాహనా ముఖ్యం
పరిపూర్ణ ప్రేమకథలను మాత్రమే మనం చూస్తాం. కానీ, సంబంధాలలోని సంక్లిష్టతను గుర్తించం. కొన్నిసార్లు ఒక సంబంధాన్ని ముగించడమే అతి పెద్ద ప్రేమ.