MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే

Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే

Mahakali: ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో రాధా రమగా పవర్‌ఫుల్ నటనతో ఆకట్టుకున్న శ్రియా రెడ్డి, ప్రస్తుతం మహాకాళి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కాళికా దేవిగా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 25 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహాకాళిగా రౌద్రరూపం చూపించిన శ్రియా రెడ్డి.. ఈ సలార్ విలన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలుసా?
Image Credit : Instagram/sriya_reddy

మహాకాళిగా రౌద్రరూపం చూపించిన శ్రియా రెడ్డి.. ఈ సలార్ విలన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలుసా?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాకాళి సినిమా టీజర్‌తో నటి శ్రియా రెడ్డి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమె మహాకాళి దేవిగా కనిపించిన రౌద్ర రూపం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. టీజర్ చివరిలో అక్షయ్ ఖన్నా పోషించిన శుక్రాచార్యుడి పాత్రకు ఎదురుగా శ్రియా రెడ్డి ప్రత్యక్షమైన సీన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. టీవీ, సినిమా రంగాల్లో బలమైన, పవర్‌ఫుల్ రోల్స్ చేయడంలో శ్రియా రెడ్డికి మంచి పేరుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహాకాళిగా శ్రియా రెడ్డి సంచలనం
Image Credit : RKD Studios

మహాకాళిగా శ్రియా రెడ్డి సంచలనం

మహాకాళి టీజర్‌లో నటుడు అక్షయ్ ఖన్నా అసుర గురువు శుక్రాచార్యుడిగా పరిచయం అయ్యారు. 14 లోకాల్లో అసురుల ఉనికి, హక్కుల గురించి ఆయన మాట్లాడతారు. కానీ శ్రియా రెడ్డి మహాకాళిగా ఎంట్రీ ఇవ్వగానే సీన్ మొత్తం మారిపోతుంది. ఒక వైపు మాతృత్వం, మరోవైపు ఉగ్రరూపంతో కూడిన ఆమె ఎక్స్‌ప్రెషన్ టీజర్‌లో చిన్న సన్నివేశమే అయినా గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో శ్రియా రెడ్డి, అక్షయ్ ఖన్నా మధ్య జరిగే ఫేస్ ఆఫ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

View this post on Instagram

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

Related Articles

Related image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Related image2
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
35
ఇండియన్ క్రికెట్ టీమ్ కనెక్షన్
Image Credit : our own

ఇండియన్ క్రికెట్ టీమ్ కనెక్షన్

శ్రియా రెడ్డి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కోణం ఆమె క్రికెట్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. 1982 నవంబర్ 28న జన్మించిన శ్రియా రెడ్డి, భారత మాజీ టెస్ట్ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె. భరత్ రెడ్డి 1978 నుండి 1981 వరకు భారత జాతీయ జట్టుకు వికెట్ కీపర్‌గా ప్రాతినిధ్యం వహించారు. రిటైర్మైంట్ తర్వాత ఆయన కోచింగ్ వైపు వెళ్లి, క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రారంభ రోజుల్లో శిక్షణ కూడా ఇచ్చారు. అలా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాతావరణంలో పెరిగిన శ్రియా, ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.సలార్‌తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 - సీజ్‌ఫైర్ మూవీలో శ్రియా రెడ్డి నటన ప్రతి ఒక్కరినీ మెప్పించింది. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ చెల్లెలు రాధా రమా మన్నార్ పాత్రలో ఆమె నటించింది. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ ఉన్న సీన్లలో కూడా ఆమె తన రాయల్ అండ్ పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె క్యారెక్టర్ డెప్త్ చూసి బాహుబలిలోని శివగామి పాత్రతో పోల్చారు. సలార్ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి శ్రియా రెడ్డికి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

45
ఆర్జే, విజేగా కెరీర్ ప్రారంభం
Image Credit : Asianet News

ఆర్జే, విజేగా కెరీర్ ప్రారంభం

యాక్టింగ్ వైపు రాకముందు శ్రియా రెడ్డి రేడియో జాకీగా , వీడియో జాకీగా పనిచేసింది. తన వాయిస్, ఆన్‌స్క్రీన్ కాన్ఫిడెన్స్‌తో టీవీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లోకి వచ్చింది. తెలుగు కుటుంబంలో జన్మించిన శ్రియా, చెన్నైలోని గుడ్ షెపర్డ్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఇతిరాజ్ కాలేజీలో ఉన్నత చదువులు చదివింది. ఆర్జే, విజే స్థాయి నుంచి ప్రధాన చిత్రాల్లో ఇంపాక్ట్ ఇచ్చే పాత్రల వరకు ఆమె ప్రయాణం చాలా నిలకడగా సాగింది.

55
తమిళ స్టార్ ఫ్యామిలీతో కోడలిగా బంధం
Image Credit : Youtube Screenshot@@rkddigital

తమిళ స్టార్ ఫ్యామిలీతో కోడలిగా బంధం

2002లో విక్రమ్ కథానాయకుడిగా వచ్చిన సమురాయ్ చిత్రంతో శ్రియా సినీ అరంగేట్రం చేసింది. 2003లో అప్పుడప్పుడు సినిమాలో హీరోయిన్‌గా నటించినా ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయితే నిరాశపడకుండా వెయిల్, కంచివరం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో తన నటనకు గుర్తింపు తెచ్చుకుంది.

పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2008లో నటుడు, నిర్మాత విక్రమ్ కృష్ణను ఆమె వివాహం చేసుకుంది. విక్రమ్ కృష్ణ తమిళ ప్రముఖ నటుడు విశాల్ అన్నయ్య. దీంతో శ్రియా రెడ్డి సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖ సినీ కుటుంబంతో భాగమైంది. అప్పుడు సలార్, ఇప్పుడు మహాకాళి వంటి పవర్‌ఫుల్ రోల్స్‌తో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో దుమ్మురేపుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
బాలీవుడ్
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image3
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Related Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved