MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్

Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్

యూపీ ప్రభుత్వం 'రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన' పథకానికి ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కింద కాలేజీల్లో చదివే అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇవ్వనున్నారు... ఇందుకోసం భారీగా నిధులు కేటాయించారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 27 2026, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగమ్మాయిలకు ఫ్రీగా ఈవి స్కూటీ ఇచ్చేదెప్పుడు?
Image Credit : Gemini AI

తెలుగమ్మాయిలకు ఫ్రీగా ఈవి స్కూటీ ఇచ్చేదెప్పుడు?

తెలుగు అమ్మాయిలు ఎప్పటినుండో ప్రభుత్వం అందించే ఉచిత స్కూటీల కోసం ఎదురుచూస్తున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాలేజీ అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందుకే రేవంత్ సర్కార్ ఎప్పుడెప్పుడు ఈ ఉచిత ఈవి స్కూటీల స్కీమ్ అమలుచేస్తుందోనని అమ్మాయిలు వేచిచూస్తున్నారు. త్వరలోనే కాలేజీ అమ్మాయిలకు ఉచిత ఈవి స్కూటీలను అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. దీంతో అమ్మాయిలకు మళ్లీ ఫ్రీ స్కూటీపై ఆశలు మొదలయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అక్కడ ఉచిత స్కూటీ స్కీం రెడీ
Image Credit : META AI

అక్కడ ఉచిత స్కూటీ స్కీం రెడీ

అయితే తెలంగాణ కంటే ముందుగానే మరో రాష్ట్రం ఈ ఉచిత స్కూటీల స్కీంను అమలుచేసేలా ఉంది. కాలేజీ అమ్మాయిలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే స్కూటీలు అందించేందుకు సిద్దమయ్యింది. ఆ రాష్ట్రం ఏదో కాదు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తర ప్రదేశ్.

యూపీ ప్రభుత్వం 'రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన' స్కీమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లో చదివే అమ్మాయిల్లో టాప్ 5 శాతం మందికి ఉచితంగా స్కూటీలు అందించనున్నట్లు యోగి సర్కార్ స్పష్టం చేసింది. ఇందుకు తగిన విధివిధానాలను కూడా రూపొందించినట్లు తెలిపింది. కేవలం ఈ ఒక్క పథకం కోసమే రాష్ట్ర బడ్జెట్ లోంచి రూ.400 కోట్లు కేటాయించింది యోగి సర్కార్. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 50,000 మంది విద్యార్థినులకు లబ్ధి చేకూరుతుందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Related Articles

Related image1
Free Train Journey : తెలుగు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాగే.. వీరికి 100% ఉచిత రైలు ప్రయాణం
Related image2
Lifetime Free Credit Card : చిన్న ట్రిక్ ప్లే చేశారో.. లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు మీసొంతం
35
ఫ్రీ స్కూటీ పొందేందుకు అర్హతలేంటి?
Image Credit : META AI

ఫ్రీ స్కూటీ పొందేందుకు అర్హతలేంటి?

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఇలా ఏ కాలేజీలో చదువుకునే అమ్మాయిలులైనా 'రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన' కు అర్హులే. అయితే కాలేజీలో బాగా చదివే అమ్మాయిలకే ఉచితంగా స్కూటీ లభిస్తుంది... టాప్‌లో ఉన్న 5 శాతం మంది అమ్మాయిలు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.

అమ్మాయిలను బాగా చదివేలా ప్రోత్సహించేందుకే ప్రతిభ ఆధారంగానే లబ్ధిదారులకు ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు యూపీ అధికారులు చెబుతున్నారు. కేవలం స్కూటీ మాత్రమే కాదు 4 లీటర్ల పెట్రోల్, రిజిస్ట్రేషన్ ఫీజు, వెహికల్ ఇన్సూరెన్స్, ISI మార్క్ హెల్మెట్, ఇతర యాక్సెసరీలు కూడా ప్రభుత్వమే అందించనుంది.

45
ఫ్రీ స్కూటీ స్కీమ్ కోసం రూ.400 కోట్ల బడ్జెట్
Image Credit : META AI

ఫ్రీ స్కూటీ స్కీమ్ కోసం రూ.400 కోట్ల బడ్జెట్

రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన కోసం యూపీ ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించింది. 2026-27 బడ్జెట్‌లో ఈ కేటాయింపులు జరిపారు. ఈ పథకం ద్వారా సుమారు 50,000 మంది అమ్మాయిలకు స్కూటీలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దూరం కారణంగా చదువు మధ్యలో ఆపేస్తున్న అమ్మాయిలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 2026లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలిపారు.

55
యూపీ అమ్మాయిలకే ఈ లక్కీ ఛాన్స్
Image Credit : Gemini AI

యూపీ అమ్మాయిలకే ఈ లక్కీ ఛాన్స్

రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన పథకంలో సాధారణ విద్యార్థులతో పాటు అమరవీరుల కుటుంబాలు, దివ్యాంగులు, అనాథ విద్యార్థినులకు కూడా చోటు కల్పించారు. వీరికి అర్హత మార్కుల్లో 10 శాతం మినహాయింపు ఉంటుంది. ఫ్రీ స్కూటీ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థిని తప్పనిసరిగా ఉత్తరప్రదేశ్ స్థానికత కలిగివుండాలి. ఆమె కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 లక్షలకు మించకూడదు. CGPA విధానంలో చదివే వారికి, యూనివర్సిటీ నిబంధనల ప్రకారం అర్హతను నిర్ణయిస్తారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. సంబంధిత యూనివర్సిటీ, అర్హులైన విద్యార్థుల జాబితాను తయారు చేసి అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రభుత్వ పథకాలు
మహిళలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image2
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Recommended image3
Now Playing
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
Related Stories
Recommended image1
Free Train Journey : తెలుగు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాగే.. వీరికి 100% ఉచిత రైలు ప్రయాణం
Recommended image2
Lifetime Free Credit Card : చిన్న ట్రిక్ ప్లే చేశారో.. లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు మీసొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved