MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Free Train Journey : తెలుగు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాగే.. వీరికి 100% ఉచిత రైలు ప్రయాణం

Free Train Journey : తెలుగు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాగే.. వీరికి 100% ఉచిత రైలు ప్రయాణం

మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లోని సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది అక్కడి ప్రభుత్వం. తెలంగాణ, ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ మాదిరిగానే ఆ దేశంలో ముసలివారికి ఫ్రీ ట్రైన్ జర్నీ స్కీమ్ ప్రకటించింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 13 2026, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇక్కడ ఉచితంగా రైలు ప్రయాణం..
Image Credit : Gemini AI

ఇక్కడ ఉచితంగా రైలు ప్రయాణం..

బంగ్లాదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆ దేశ ఆర్థిక మంత్రి అమీర్ ఖోస్రు మహమూద్ చౌదరి ఈ ప్రకటన చేశారు. 65 ఏళ్లు పైబడిన ప్రతి బంగ్లాదేశీ పౌరుడికి రైళ్లలో ఉచిత ప్రయాణం, మెట్రో రైళ్లలో 25 శాతం ఛార్జీల రాయితీ అందిస్తామని తెలిపారు.

"దేశ నిర్మాణంలో సీనియర్ సిటిజన్ల పాత్ర ఎనలేనిది. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. ఈ పథకం ప్రకారం ఇకపై 65 ఏళ్లు పైబడిన బంగ్లాదేశీ ప్రజలు ప్రభుత్వ రైళ్లలో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే ఢాకా మెట్రో రైలు సర్వీసుల్లో 25% ఛార్జీల తగ్గింపు కూడా పొందుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మెట్రోలో కూడా ముసలివారికి రాయితీ
Image Credit : Gemini

మెట్రోలో కూడా ముసలివారికి రాయితీ

ఇప్పటికే బంగ్లాదేశ్ రైల్వే మంత్రిత్వ శాఖ 2026 మే 25 నుంచి సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు రైలు ఛార్జీలలో 25% తగ్గింపును అమలు చేస్తోంది. ఈ రాయితీ పొందాలంటే జాతీయ గుర్తింపు కార్డు (NID) ద్వారా వయస్సును ధ్రువీకరించుకోవాలి. ఆన్‌లైన్, స్టేషన్ టికెట్ కౌంటర్ల ద్వారా ఈ సదుపాయం పొందవచ్చు.

ఢాకా మెట్రో రైలు సర్వీసులో కూడా 65 ఏళ్లు పైబడిన వారికి 25% ఛార్జీల రాయితీని ఇప్పటికే ప్రవేశపెట్టారు. సింగిల్ జర్నీ టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రయాణికులు తమ జాతీయ గుర్తింపు కార్డును చూపించి ఈ రాయితీని పొందవచ్చని అధికారులు తెలిపారు.

Related Articles

Related image1
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Related image2
Free Train Travel : రైలులో ఉచిత ప్రయాణం.. వీరికి టికెట్ అవసరం ఉండదనే విషయం మీకు తెలుసా..?
34
వృద్ధుల సంక్షేమం..
Image Credit : Getty

వృద్ధుల సంక్షేమం..

బంగ్లాదేశ్ గణాంకాల శాఖ ప్రకారం.. దేశంలో 65 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరుగుతోంది. 2023లో మొత్తం జనాభాలో వీరి శాతం 6.14%కి చేరింది. వారి సామాజిక భద్రత, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ప్రజా రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని, వారు స్వతంత్రంగా ప్రయాణించేందుకు ఈ పథకం దోహదపడుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

44
ఇండియాలోనూ ఫ్రీ ట్రైన్ జర్నీ కోసం డిమాండ్...
Image Credit : Gemini AI

ఇండియాలోనూ ఫ్రీ ట్రైన్ జర్నీ కోసం డిమాండ్...

అయితే ఆర్థికంగా, సామాజికంగా ఇండియా కంటే బాగా వెనకబడిన బంగ్లాదేశ్ వృద్ధుల సంక్షేమం కోసం ఫ్రీ రైల్వే ప్రయాణానికి అవకాశం కల్పించింది. కాబట్టి ఇలాంటి సదుపాయమే ఇండియాలో కూడా కల్పించాలనే డిమాండ్ వినిపించవచ్చు. ఇప్పటికే వృద్ధులకు రైల్వే టికెట్ కొనుగోలుపై రాయితీ ఇస్తోంది భారత ప్రభుత్వం... కానీ ఫ్రీగా ప్రయాణించే సదుపాయం కల్పించాలని వృద్ధులు కోరవచ్చు. అంటే తెలంగాణ, ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ లాగే దేశవ్యాప్తంగా ముసలివారికి ఫ్రీ రైల్వే జర్నీ స్కీమ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image3
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Related Stories
Recommended image1
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Recommended image2
Free Train Travel : రైలులో ఉచిత ప్రయాణం.. వీరికి టికెట్ అవసరం ఉండదనే విషయం మీకు తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved