MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Gold: నోటిలో 82 గ్రాముల బంగారాన్ని దాచేశాడు... అయినా దొరికిపోయాడు

Gold: నోటిలో 82 గ్రాముల బంగారాన్ని దాచేశాడు... అయినా దొరికిపోయాడు

Gold: బంగారం ధరలు పెరుగుతుండడంతో బంగారం అక్రమ రవాణా కూడా పెరిగిపోయింది. బెంగళూరుతో ఓ వ్యక్తి నోట్లో 82 గ్రాముల బంగారాన్ని దాచేశాడు. అయినా పోలీసులకు దొరికిపోయాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 30 2026, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నోటిలో బంగారం
Image Credit : Chat Gpt

నోటిలో బంగారం

బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. అందుకే అక్రమ రవాణా కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు ఎవరూ ఊహించని మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఓ ప్రయాణికుడు ఏకంగా తన నోట్లో బంగారాన్ని దాచుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆగస్టు 26న ఈ ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆ ప్రయాణికుడు అక్కడి నుంచి ఘాజియాబాద్ వెళ్లాల్సి ఉంది.

బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్-1లో విమానం ఎక్కేందుకు ముందు భద్రతా తనిఖీలు జరుగుతున్న సమయంలో CISF సిబ్బంది అతడిని గమనించారు. తనిఖీల సమయంలో అతడు సరిగా స్పందించకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఏం అడిగినా సమాధానం చెప్పకోపోవడంతో అతడి నోరును తెరిపించారు. అతడి నోట్లో రెండు క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని బయటకు తీయగా అందులో పసుపు రంగులో ఉన్న లోహం కనిపించింది. రెండు క్యాప్సూల్స్ బరువు కలిపి సుమారు 82 గ్రాములు ఉన్నట్లు తేలిసింది. బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి క్యాప్సూల్స్ లో వేసి తీసుకొచ్చేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎవరు అతను?
Image Credit : Pixabay

ఎవరు అతను?

ఆ వ్యక్తి పేరు మొహమ్మద్ సిరాజ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. అతడు దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో ఇండిగో విమానంలో ఘాజియాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఉదయం టెర్మినల్-1లో ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్ జరుగుతున్నప్పుడు CISF సిబ్బంది అతడిని ఆపారు. సాధారణంగా విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగులు, వ్యక్తిగత వస్తువులతో పాటు వారి ప్రవర్తనను కూడా భద్రతా సిబ్బంది గమనిస్తుంటారు. ఈ ప్రయాణికుడి ప్రవర్తనలో తేడా కనిపించడంతో అధికారులు మరింత జాగ్రత్తగా తనిఖీ చేశారు. చివరకు పట్టుబడిపోయాడు.

33
చివరికి ఏం జరిగింది?
Image Credit : Pixabay

చివరికి ఏం జరిగింది?

అధికారులు స్వాధీనం చేసుకున్న క్యాప్సూల్స్ ను పరీక్షలకు పంపించారు. అది బంగారంగా తేలింది. ఈ ఘటన తర్వాత ప్రయాణికుడిని బెంగళూరు విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. అతడిని విచారించి ఈ లోహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరికి ఇవ్వాల్సి ఉంది? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై కస్టమ్స్, విమానాశ్రయ భద్రతా సంస్థలు ప్రత్యేక నిఘా ఉంచుతుంటాయి. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు గతంలో కూడా బ్యాగులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, షూస్ ఇలా ఎన్నో మార్గాలను ఉపయోగించిన ఘటనలు బయటపడ్డాయి. అయితే ఈసారి ఏకంగా నోట్లో రెండు క్యాప్సూల్స్ పెట్టుకుని తీసుకురావడం భద్రతా సిబ్బందిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CJP Protest: ఢిల్లీ నిరసనల నేపథ్యంలో.. కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Recommended image2
Elon Musk: ముఖేష్ అంబానీని ప్ర‌ధానితో పోల్చిన మ‌స్క్‌.. అస‌లేంటీ వివాదం.?
Recommended image3
CJP Protest : సిజెపి ఆందోళనలతో డిల్లీలో హైఅలర్ట్.. విమానంలో అభిజిత్ దీప్కే, ఇంట్లో ధ్రువ్ రాఠీ అరెస్ట్
Related Stories
Recommended image1
Dosa Tips: ఇడ్లీ పిండిని ఇలా దోశె పిండిగా మార్చేయండి, క్రిస్పీ దోశెలు వేసుకోవచ్చు
Recommended image2
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved