MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • జుట్టు రాలితే ఆ సమస్య ఉన్నట్టేనా..!

జుట్టు రాలితే ఆ సమస్య ఉన్నట్టేనా..!

జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే.. జుట్టుకు ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. ఇవలేకపోతేనే జుట్టు రాలడం నుంచి ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 18 2023, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hair loss

hair loss

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. జుట్టు రాలడాన్ని ఆపడానికి రకరకాల నూనెలు, షాంపూలు, హెయిర్ మాస్క్ లు, మందులు లేదా చికిత్సలను ప్రయత్నిస్తుంటారు. దీనికంటే ముందు అసలు జుట్టు ఎందుకు రాలుతుంతో దెలుసుకుంటే దీన్ని ఆపడం సులువు అవుతుందంటున్నారు నిపుణులు. ఒత్తిడి లేదా జెనెటిక్స్ లేదా కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుది. అంతేకాదు విటమిన్ల లోపంతో కూడా జుట్టు రాలుతుందని నిపుణులు అంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విటమిన్లు, ఖనిజ లోపాలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఈ విటమిన్లు, ఖనిజాలు లోపిస్తే జుట్టు విపరీతంగా రాలుతుందని నిపుణులు అంటున్నారు. 

36

మన జుట్టుకు 13 ముఖ్యమైన విటమిన్లు అవసరమవుతాయి. విటమిన్ బి 12, విటమిన్ డి 3 లోపాలు ప్రధానంగా జుట్టు రాలడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ ను తీసుకువెళ్లే ఎర్ర రక్త కణాలు విటమిన్ బి 12 తో సులభతరం అవుతాయి. మీ శరీరంలో విటమిన్ బి 12 స్థాయిలు తగినంతగా  లేకపోతే మీ హెయిర్ ఫోలికల్స్ కొత్త జుట్టు ఉత్పత్తి చేయలేవు. దీనివల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి వంటి ఇతర విటమిన్ల లోపాలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి విటమిన్లు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

46

విటమిన్ ఇ ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుం. అలాగే జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇకపోతే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణకు సహాయపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. గట్ నుంచి ఇనుము శోషణలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మీ శరీరానికి విటమిన్ సి చాలా అవసరం. ముఖ్యంగా ఇనుము లోపం వల్ల జుట్టు రాలకుండా ఉండటానికి. 

56

విటమిన్ డి "సన్ షైన్ విటమిన్" అని అందరికీ తెలుసు. ఎందుకంటే దీన్ని చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు, సప్లిమెంట్ల ద్వారా ఈ విటమిన్ ను పొందొచ్చు. హెయిర్ ఫోలికల్ పెరుగుదలను ప్రోత్సహించడానికి, ఆరోగ్యకరమైన హెయిర్ ఫోలికల్స్ ను నిర్వహించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ విటమిన్ డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం పేరుకుపోతుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.

66
hairfall

hairfall


జుట్టు ఆరోగ్యానికి విటమిన్లతో పాటుగా ఖనిజాలు కూడా అవసరమే. ఐరన్, జింక్, సెలీనియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్ల సంశ్లేషణకు సెలీనియం సహాయపడుతుంది. ప్రోటీన్ సంశ్లేషణకు మెగ్నీషియం చాలా అవసరం. ఇది జుట్టును పెంచేందుకు సహాయపడుతుంది. ఇనుము లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా తగ్గితే జుట్టు రాలుతుంది. జింక్ లోపం కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇది జుట్టు కణాల ఉత్పత్తి, మరమ్మత్తుకు సహాయపడుతుంది. దీని లోపం జుట్టు సన్నబడటానికి, జుట్టు రాలడానికి దారితీస్తుంది.

విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే జుట్టు రాలే అవకాశం ఉండదు. అయితే మీరు జుట్టు రాలడానికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved