MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Stomach Growling: ఆకలి వేసినప్పుడు పొట్టలో గుడగుడమనే శబ్దాలు ఎందుకు వస్తాయి?

Stomach Growling: ఆకలి వేసినప్పుడు పొట్టలో గుడగుడమనే శబ్దాలు ఎందుకు వస్తాయి?

ఆకలిగా ఉన్నప్పుడు, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు లోపలి నుంచి గడగడమంటూ శబ్దాలు రావడం చాలా కామన్. అసలు ఈ సౌండ్ ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణం ఏంటి? ఇది ఏదైనా అనారోగ్య సమస్యకు సంకేతమా? పూర్తి వివరాలు ఈ గ్యాలరీలో చూద్దాం.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 13 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పొట్టలో గుడగుడ శబ్ధాలు ఎందుకు
Image Credit : Getty

పొట్టలో గుడగుడ శబ్ధాలు ఎందుకు

అప్పుడప్పుడు మీరు గమనించే ఉంటారు. బాగా ఆకలి వేసినప్పుడు పొట్టలోనుంచి గుడగుడమనే శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ శబ్ధాలు ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? జీర్ణక్రియ, పేగుల కదలికల వల్ల కూడా ఈ శబ్దం వస్తుంది. జీర్ణవ్యవస్థ సాధారణంగా పనిచేయడం వల్లే ఈ శబ్దాలు వస్తాయి.

మన జీర్ణవ్యవస్థలోని పొట్ట, పేగులు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు, జీర్ణక్రియ సమయంలో కండరాలు ఆహారాన్ని, ద్రవాలను ముందుకు నెడుతూ ఉంటాయి. ఈ ప్రక్రియను 'పెరిస్టాల్సిస్' (peristalsis) అంటారు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు కూడా జీర్ణవ్యవస్థ పూర్తిగా ఆగదు. పొట్ట, చిన్న పేగు కండరాలు అప్పుడప్పుడు సంకోచిస్తూ గ్యాస్, ద్రవాలను కదిలిస్తాయి. ఈ కదలికే గడగడ శబ్దానికి కారణం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పొట్ట ఖాళీగా ఉండడం వల్ల
Image Credit : our own

పొట్ట ఖాళీగా ఉండడం వల్ల

పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు, శబ్దాన్ని ఆపేందుకు లోపల ఆహారం ఏమీ ఉండదు. అందుకే శబ్దాలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ఆకలి వల్ల శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందుకే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కడుపులో కదలికలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

పొట్టలో గుడగుడమనే శబ్దాలు రావడానికి గ్యాస్ కూడా ఒక కారణం. అన్నం తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు గాలిని మింగడం లేదా చాలా వేగంగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. కొన్ని రకాల ఆహారాలు కూడా పేగుల్లో గ్యాస్‌ను పెంచుతాయి. ఈ గ్యాస్ పేగుల గుండా కదిలినప్పుడు శబ్దం వస్తుంది. మలబద్ధకం, అజీర్తి, ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు కూడా ఈ శబ్దాలకు కారణం కావచ్చు.

33
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Image Credit : freepik

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

సాధారణంగా పొట్ట నుంచి శబ్దాలు రావడం ఆందోళన కలిగించే విషయం కాదు. కానీ, ఈ శబ్దాలతో పాటు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే, అది ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా, శబ్దాలతో పాటు తీవ్రమైన నొప్పి లేదా మలవిసర్జనలో ఇబ్బంది ఉంటే, దాన్ని కేవలం ఆకలి అని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Shelves: అల్యూమినియం ఫాయిల్‌తో వంటగది షెల్ఫ్‌లను క్లీన్ గా ఉండే చిట్కాలు
Recommended image2
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Recommended image3
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Related Stories
Recommended image1
Kitchen Shelves: అల్యూమినియం ఫాయిల్‌తో వంటగది షెల్ఫ్‌లను క్లీన్ గా ఉండే చిట్కాలు
Recommended image2
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved