MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • వర్షాకాలంలో ఏ కూరగాయలు, ఏ పండ్లు తినాలో తెలుసా?

వర్షాకాలంలో ఏ కూరగాయలు, ఏ పండ్లు తినాలో తెలుసా?

వర్షాకాలంలో లేనిపోని రోగాలు తరచుగా వస్తుంటాయి. కారణం.. ఈ సీజన్ లో మన రోగనిరోధక శక్తి తగ్గడమే. అయితే ఈ కాలంలో మనం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల కూరగాయలను, పండ్లను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 11 2024, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సాధారణంగా వర్షాకాలం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కానీ ఈ సీజన్ తో పాటుగా ఎన్నో వ్యాధులు కూడా ఎంట్రీ ఇస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా రకరకాల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతుంటాయి. అకస్మాత్తుగా ఈ వాతావరణ మార్పును మన శరీరం తట్టుకోలేకే అనారోగ్యానికి గురవుతుంటాం. దీనికి తోడు సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మనం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయలు బాగా సహాయపడతాయి. అందుకే ఈ సీజన్ లో వీటిని ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అవేంటంటే? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కాకరకాయ

కాకరకాయను చాలా తక్కువ మంది తింటారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుందని. దీని రుచి చేదుగా ఉన్నా.. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో మన పేగుల్లో వృద్ధి చెందే సూక్ష్మక్రిములు మన జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. కానీ ఈ సూక్ష్మక్రిములను చంపే గుణం కాకరకాయకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ సీజన్ లో కాకరకాయను ఖచ్చితంగా తినండి.ఈ సీజన్ లో కాకరకాయలు మార్కెట్ లో బాగా దొరుకుతాయి. 
 

39
ivy gourd

ivy gourd

దొండకాయ

దొండకాయ కూర, దొండకాయ ఫ్రై ఇలా.. దొండకాయతో ఏది చేసిన సూపర్ టేస్టీ గా అవుతుంది. మీకు తెలుసా? ఇది మన ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబుతో పాటుగా.. వర్షాకాలంలో వచ్చే అలర్జీ సమస్య కూడా తొలగిపోతుంది.
 

49

పర్వల్

ఈ కూరగాయను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇది కూడా వర్షాకాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇదొక యాంటీ ఇన్ఫ్లమేటరీ వెజిటేబుల్. వర్షాకాలంలో దీన్ని తినడం వల్ల శరీరంలో విషపూరిత బ్యాక్టీరియా పెరగదు. దీనిలో ఉండే విటమిన్ -సి వర్షంలో వచ్చే వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్నిమన శరీరానికి అందిస్తుంది.
 

59

నేతి బీరకాయ

వర్షాకాలంలో నేతి బీరకాయలు కూడా మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వెజిటేబుల్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి.  దగ్గుకు జలుబుకు కారణమయ్యే శోషరస గ్రంథుల్లో వాపును ఈ కూరగాయ నివారిస్తుంది.
 

69
pomegranate

pomegranate

దానిమ్మ

దానిమ్మ ఎన్నో పోషకాలున్న పండు. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే డెంగ్యూ, మలేరియా వంటి వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు మనల్ని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు రాకుండా మనల్ని కాపాడుతాయి. 

79

పీచెస్

పీచెట్ టేస్ట్ లో పుల్లగా ఉంటుంది. కానీ ఈ పండులో ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఈ పండును వర్షాకాలంలో తింటే అలర్జీల బారిన పడే ప్రమాదం ఉండదు. ఈ పండు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది దగ్గు జలుబు జ్వరం రాకుండా మనల్ని కాపాడుతుంది. 
 

89


బెర్రీలు

బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ వంటి రకరకాల బెర్రీ పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముందుంటాయి. ఈ పండులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్-సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వర్షాకాలంలో అనారోగ్యానికి గురికావడానికి మనల్ని కాపాడుతుంది. 

99

చెర్రీలు

చెర్రీలను ప్రతి ఒక్కరూ తింటారు. ఇది మన ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది తెలుసా? దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వర్షాకాలంలో సంక్రమణను నివారిస్తుంది. జలుబు వల్ల కలిగే కండరాల నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Recommended image2
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image3
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved