MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • హెల్తీ స్కిన్ కావాలా? అయితే ఈ హెల్తీ డ్రింక్స్ ను రోజూ తాగండి..

హెల్తీ స్కిన్ కావాలా? అయితే ఈ హెల్తీ డ్రింక్స్ ను రోజూ తాగండి..

కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్ మన శరీరాల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మన చర్మాన్ని కూడా హెల్తీ గా ఉంచుతాయి. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 01 2023, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
skin care

skin care

ఆరోగ్యకరమైన, అందమైన, మెరిసే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరూ కలలుగంటారు. కానీ ఇది ప్రతిఒక్కరికీ సాధ్యం కాదు. చర్మ సంరక్షణ మెరుగ్గా ఉండి.. మంచి ఆహారాలను తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందమైన, ఆరోగ్యమైన చర్మం మీ సొంతం అవుతుంది. నిపుణుల ప్రకారం.. పండ్లు, కూరగాయలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే వాటిలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మ సంరక్షణ కోసం ఎలాంటి డ్రింక్స్ ను రెగ్యులర్ గా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

స్మూతీ

పాలు, వేరుశెనగ వెన్న, దాల్చినచెక్క, ఓట్స్, సత్తు పొడిని బ్లెండర్ లో వేస్తే.. మృదువైన, రుచికరమైన పానీయం తయారైపోతుంది. ఈ స్మూతీలోని పదార్థాలు ఎన్నో చర్మ ప్రయోజనాలను అందిస్తాయి తెలుసా..

పాలు కాల్షియం, విటమిన్ డి కి గొప్ప మూలం. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ఓట్స్ లో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి చర్మపు మంటను తగ్గించేటప్పుడు కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే సత్తు పౌడర్ కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వేరుశెనగ వెన్నలో విటమిన్ ఇ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఇక దాల్చినచెక్క పొడి చర్మానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

35
skin care

skin care

చియా విత్తనాలతో మజ్జిగ

రాత్రంతా నానబెట్టిన చియా విత్తనాలు, వాటర్, జీలకర్ర పొడి, రాతి ఉప్పు, మజ్జిగ తో తయారుచేసే ఈ డ్రింక్ చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. చియా విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించడానికి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇకపోతే మజ్జిగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. అలాగే చర్మంపై మచ్చలను పోగొడుతాయి. ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తాగితే మీ చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. 
 

45

లెమన్ వాటర్, తేనె

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తేనె చర్మం నుంచి అదనపు నూనెను తొలగించడానికి, మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. నిమ్మరసం చర్మ వ్యాధిని కలిగించే ఫంగల్ పెరుగుదలను తగ్గిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది.

 

55
skin care

skin care

పండ్ల రసాలు

తాజా పండ్ల రసాలను తాగడం మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్ల రసాలలో విటమిన్లు, సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి మీ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్స్ లో వృద్ధాప్య సంకేతాలను నివారించడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దానిమ్మలో చర్మ కణాలను పునరుద్ధరించే యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. నారింజలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడే విటమిన్ సి ఉంటుంది. మీకు నచ్చిన ఒక గ్లాసు తాజా పండ్ల రసాన్ని తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాదు అందంగా మెరిసిపోతుంది కూడా. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Clips: క్షణాల్లో మీ లుక్‌ను మార్చేసే అందమైన హెయిర్ యాక్సెసరీస్
Recommended image2
Parenting: ఆడపిల్లలు తల్లిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!
Recommended image3
Gold Haaram: 4 తులాల్లో లైట్ వెయిట్ హారం డిజైన్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved