MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Kitchen Hacks: కూరలో ఉప్పు ఎక్కువైందా? నిమిషాల్లో కూరను రుచిగా మార్చేయండి..!

Kitchen Hacks: కూరలో ఉప్పు ఎక్కువైందా? నిమిషాల్లో కూరను రుచిగా మార్చేయండి..!

Kitchen Hacks: వంట చేస్తుంటే పొరపాటున కూరలో ఎక్కువ ఉప్పు వేశారా? ఆ కూర తినలేక పారేస్తున్నారా? కంగారు పడాల్సిన అవసరం లేదు. నిమిషాల్లో కూరను ఉప్పు తగ్గించి.. మళ్లీ రుచిగా మార్చేయచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 21 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Cooking Tips
Image Credit : Gemini

Cooking Tips

వంట పూర్తయ్యాక ఒక్కసారి రుచి చూస్తే ఉప్పు కాస్త ఎక్కువైందని తెలిసి గుండె ఆగినంత పనవుతుందా? రోజూ ఎంతో ఇష్టంగా వండే కూరలు లేదా ఫ్రైలలో పొరపాటున ఉప్పు ఎక్కువ కావడం సర్వసాధారణం. అయితే ఉప్పు ఎక్కువైందని ఆ కూరను పడేయాల్సిన పని లేదు. అమ్మమ్మల నాటి సింపుల్ చిట్కాలతో ఆ ఉప్పును బ్యాలెన్స్ చేయడమే కాకుండా… కూరను మరింత రుచిగా మార్చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కూరలో ఇవి కలిపితే చాలు..
Image Credit : Getty

కూరలో ఇవి కలిపితే చాలు..

పచ్చి బంగాళాదుంప ముక్కలు (Raw Potato)… గ్రేవీలో లేదా కర్రీలో పచ్చి బంగాళాదుంపను పెద్ద ముక్కలుగా కోసి వేసి, 10-15 నిమిషాలు ఉడికించండి. బంగాళాదుంపలో ఉండే స్టార్చ్ గ్రేవీలోని నీటితో పాటు ఉప్పును కూడా పీల్చుకుంటుంది. వడ్డించే ముందు ఈ ముక్కలను తీసివేస్తే సరిపోతుంది.

2. గోధుమ పిండి ఉండలు …మనం చపాతీకి కలుపుకునే గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉడుకుతున్న గ్రేవీలో వేయండి. ఈ పిండి ఉండలు కూరలోని అదనపు ఉప్పును, నీటిని వేగంగా పీల్చుకుంటాయి. వంట పూర్తయ్యాక వీటిని బయటకు తీయవచ్చు.

3. నిమ్మరసం లేదా వెనిగర్.. పులుపు అనేది ఉప్పు తీవ్రతను తగ్గిస్తుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని చుక్కల నిమ్మరసం లేదా కొద్దిగా వెనిగర్ కలపండి. ఇది ఉప్పును పూర్తిగా తీసివేయకపోయినా, నాలికపై ఉప్పు ఘాటు తెలియకుండా రుచిని కవర్ చేస్తుంది.

4. పెరుగు లేదా మీగడ.. గ్రేవీ కూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు చెంచాల చిలికిన పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ కలపడం అద్భుతమైన మార్గం. పెరుగులో ఉండే ఫ్యాట్స్, పులుపు ఉప్పు తీవ్రతను తగ్గించడమే కాకుండా, కూరకి మంచి టెక్స్చర్ , క్రీమీ రుచిని ఇస్తాయి.

Related Articles

Related image1
Lizards: మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేస్తే.. ఈజీగా తరిమికొట్టొచ్చు..!
Related image2
Capital: ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి?
33
ఈ టెక్నిక్స్ కూడా వాడొచ్చు..
Image Credit : Getty

ఈ టెక్నిక్స్ కూడా వాడొచ్చు..

5. తియ్యటి పదార్థాలు.. కారంగా లేదా మసాలా ఎక్కువ ఉన్న కూరల్లో ఉప్పు తగ్గించడానికి చిటికెడు పంచదార లేదా కొన్ని చుక్కల తేనె కలపవచ్చు. ఇది స్వీట్‌నెస్‌ను ఇవ్వడంతో పాటు ఉప్పు, కారాల సమతుల్యతను .. పెంచుతుంది.

మరి గ్రేవీ కర్రీ కాకుండా.. ఫ్ర కర్రీ అయితే…

గ్రేవీ కర్రీ కాకుండా డ్రై ఫ్రైలు (ఉదాహరణకు బెండకాయ, ఆలూ ఫ్రై) లో ఉప్పు ఎక్కువైతే, మరికొన్ని కూరగాయ ముక్కలు లేదా ఉడికించిన పప్పు, కొబ్బరి తురుము వంటివి అదనంగా చేర్చి వండండి. దీనివల్ల మోతాదు పెరిగి ఉప్పు సరిపోతుంది.

7. కొబ్బరి పాలు … నాన్-వెజ్ గ్రేవీలలో ఉప్పు ఎక్కువైతే చిక్కటి కొబ్బరి పాలు కలపండి. ఇది ఉప్పును తగ్గించి, కూరకు మంచి రిచ్ ఫ్లేవర్ ఇస్తుంది.

8. టమోటా ప్యూరీ… పచ్చి టమోటాల ప్యూరీ లేదా కొద్దిగా టమోటా సాస్ కలపడం వల్ల అందులోని సహజ సిద్ధమైన పులుపు, తియ్యదనం ఉప్పు ఘాటును తగ్గించడంలో సహాయపడతాయి.

9. ఉడికించిన అన్నం.. ఆలూ లేదా పిండి అందుబాటులో లేకపోతే, మెత్తగా ఉడికించిన అన్నాన్ని చిన్న ముద్దగా చేసి కాటన్ గుడ్డలో కట్టి లేదా నేరుగా గ్రేవీలో వేసి 5 నిమిషాలు మరిగించి తీసివేయండి. ఇది ఉప్పును సులభంగా పీల్చుకుంటుంది.

ఈసారి మీ ఇంట్లో కూరల్లో ఉప్పు ఎక్కువైతే కంగారు పడకుండా మీ వద్ద ఉన్న పదార్థాన్ని బట్టి ఈ హ్యాక్స్ ట్రై చేయండి..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
రాఖీ కట్టేటప్పుడు ఈ ఒక్క మంత్రం చెప్పండి.. మీ అన్నదమ్ములకు అంతా మంచే జరుగుతుంది
Recommended image2
Palm Oil: చిప్స్ నుంచి బిస్కెట్ల తయారీ దాకా పామాయిల్ ఎందుకు వాడతారు? అసలు పామాయిల్ అంటే?
Recommended image3
Beer Storage: ఫ్రిజ్ లో బీర్ ఎన్ని రోజులు స్టోర్ చేయచ్చు..? ఈ విషయం ఎవరికీ తెలియకపోవచ్చు
Related Stories
Recommended image1
Lizards: మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేస్తే.. ఈజీగా తరిమికొట్టొచ్చు..!
Recommended image2
Capital: ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved