MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dal: కుక్కర్లో పప్పును ఉడికించేటప్పుడు మధ్యలో చిన్న స్టీల్ గిన్నె ఎందుకు పెట్టాలి?

Dal: కుక్కర్లో పప్పును ఉడికించేటప్పుడు మధ్యలో చిన్న స్టీల్ గిన్నె ఎందుకు పెట్టాలి?

Dal: మన తెలుగువారి భోజనంలో పప్పు తప్పనిసరి. విందుల్లో కూడా పప్పు కనిపిస్తుంది. అయితే ఇంట్లో పప్పును కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు అందులో చిన్న స్టీల్ గిన్నె పెడితే ఎన్ని లాభాలో తెలుసా?

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 31 2026, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కుక్కర్లో స్టీలుగిన్నె
Image Credit : Chat GPT

కుక్కర్లో స్టీలుగిన్నె

పప్పు మన ఇళ్లలో తరచూ వండుతూనే ఉంటారు. ప్రెజర్ కుక్కర్‌లో పప్పు, నీళ్లు వేసి ఉడికిస్తుంటాము. అయితే దాల్ వండేటప్పుడు కుక్కర్‌లో ఒక చిన్న స్టీల్ గిన్నె కూడా పెడితే ఎంతో మంచిదట. ప్రముఖ షెఫ్ పంకజ్ భదౌరియా కూడా ఈ కిచెన్ హ్యాక్‌ను తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేశారు. దాల్ ఉడికేటప్పుడు ఎక్కువగా నురుగు వస్తుంది. ఒక్కోసారి ఈ నురుగు, దాల్ నీళ్లు కుక్కర్ విజిల్ నుంచి బయటకు వస్తాయి. దీంతో కుక్కర్‌తో పాటు గ్యాస్ స్టవ్, చుట్టుపక్కల ప్రాంతం కూడా మురికిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకే కుక్కర్‌లో చిన్న స్టీల్ గిన్నె పెడితే సరిపోతుందని చెబుతున్నారు పంకజ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పప్పు ఉడికించేటప్పుడే
Image Credit : Pixabay

పప్పు ఉడికించేటప్పుడే

ప్పు ఉడికేటప్పుడు ఏర్పడే నురుగు పైకి ఎగసి విజిల్ నుంచి బయటికి వచ్చి స్టవ్ మీద పడిపోతుంది. దాన్ని క్లీన్ చేయడం పెద్దపని. కుక్కర్‌లో చిన్న స్టీల్ గిన్నె పెట్టడం వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చు. అయితే గిన్నెను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుక్కర్‌లో సులభంగా సరిపోయే చిన్న గిన్నెనే వాడాలి. అది కుక్కర్ మూతకు లేదా వాల్వ్‌కు తగలకూడదు. అలాగే కుక్కర్‌ను పూర్తిగా నింపకూడదు. పప్పు ఉడికేటప్పుడు పప్పు ఉబ్బడానికి, నురుగు రావడానికి లోపల కొంత ఖాళీ ఉండాలి. కుక్కర్ సామర్థ్యాన్ని మించి నింపితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

33
స్పూన్, నెయ్యి కూడా వాడొచ్చు
Image Credit : Pixabay

స్పూన్, నెయ్యి కూడా వాడొచ్చు

పప్పు నీళ్లు బయటకు రాకుండా ఉండేందుకు మరో రెండు చిన్న టిప్స్ ను కూడా షెఫ్ పంకజ్ సూచించారు. కుక్కర్‌లో చిన్న స్టీల్ స్పూన్ వేయడం వల్ల కూడా దాల్ నుంచి వచ్చే నురుగు, నీళ్లు పొంగడాన్ని కొంతవరకు నియంత్రించవచ్చని తెలిపారు. అలాగే దాల్ వండేటప్పుడు నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేయడం కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే కుక్కర్‌ను ఎక్కువ పప్పుతో మాత్రం నింపేయకూడదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Baby Products: బేబీ ప్రొడక్ట్స్ పెద్దవాళ్లు కూడా వాడితే ఏమవుతుంది?
Recommended image2
Coconut: కొబ్బరి చిప్పతో కుక్కర్‌ల్లోని పప్పులు, గింజలు మెత్తగా త్వరగా ఉడికేస్తాయి.. ఎలాగంటే
Recommended image3
Aluminium Vs Stainless: రోజూ వంట చేయడానికి ఏ కుక్కర్ బెటర్? అల్యూమినియమా? స్టీలా?
Related Stories
Recommended image1
Current Shock: ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే... వెంటనే ఇలా చేయండి
Recommended image2
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved