MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Parenting: పిల్లల ముందు తల్లిదండ్రులు పొరపాటున కూడా చేయకూడని 5 పనులు ఇవే!

Parenting: పిల్లల ముందు తల్లిదండ్రులు పొరపాటున కూడా చేయకూడని 5 పనులు ఇవే!

Parenting: పిల్లలకు మంచి అలవాట్లు, విలువలు నేర్పించాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ పిల్లలు, పేరెంట్స్ చెప్పే మాటల కంటే.. వారు చేసే పనులనే ఎక్కువగా గమనిస్తుంటారు. నిపుణుల ప్రకారం పిల్లల ముందు పేరెంట్స్ అస్సలు చేయకూడని 5 పనులేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 31 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడని 5 పనులు
Image Credit : AI

పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడని 5 పనులు

పిల్లల పెంపకం చాలా బాధ్యతతో కూడుకున్న పని. తల్లిదండ్రులు పిల్లలకు ఏం చెబుతున్నారనే దానికంటే.. వారి ముందు ఎలా ప్రవర్తిస్తున్నారనేది మరింత ప్రభావం చూపుతుంది. పిల్లలు ఇంట్లో విన్న మాటలు, అలవాట్లు, ప్రవర్తనను తెలియకుండానే అనుసరిస్తుంటారు. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ముందు పొరపాటున కూడా చేయకూడని 5 పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పిల్లల ముందు గొడవ పడటం
Image Credit : freepik

పిల్లల ముందు గొడవ పడటం

భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. అయితే వాటిని పిల్లల ముందే పెద్ద గొడవగా మార్చడం మాత్రం మంచిది కాదు. తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు అరుచుకోవడం, అవమానకరమైన మాటలు మాట్లాడుకోవడం లేదా కోపంతో వస్తువులు విసరడం వంటి వాటిని పిల్లలు చూస్తే వారి మనసులో భయం, ఆందోళన ఏర్పడవచ్చు. కాబట్టి భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే వాటిని పిల్లల ముందు కాకుండా ప్రశాంతంగా, వ్యక్తిగతంగా పరిష్కరించుకోవడం మంచిది.

36
ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం
Image Credit : Getty

ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం

పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడే మాటలను చాలా త్వరగా గ్రహిస్తారు. బంధువులు, పొరుగువారు, స్నేహితులు లేదా ఇతరుల గురించి ఇంట్లో పేరెంట్స్ చెడుగా మాట్లాడటం, వారి రూపం, డబ్బు, చదువు లేదా సామర్థ్యాన్ని ఎగతాళి చేయడం వంటివి చేస్తే ఈ అలవాట్లు పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరినైనా విమర్శించాల్సి వచ్చినా వ్యక్తిగత అవమానాలకు వెళ్లకుండా విషయాన్ని మాత్రమే చర్చించడం పిల్లలకు మంచి ఉదాహరణగా ఉంటుంది.

46
ఇతరులతో పోల్చడం
Image Credit : Istock

ఇతరులతో పోల్చడం

పిల్లలను పదేపదే ఇతరులతో పోల్చడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినవచ్చు. ప్రతి పిల్లవాడి సామర్థ్యం, ఆసక్తి వేర్వేరుగా ఉంటాయి. ఇతరులతో పోల్చడం వల్ల పిల్లలకు తమపై తమకు నమ్మకం పోతుంది. కాబట్టి పిల్లల లోపాలను ఎత్తిచూపడం కంటే, వారి బలాలను గుర్తించి ప్రోత్సహించడం మంచిది.

56
పిల్లల ముందు అబద్ధాలు చెప్పడం
Image Credit : Getty

పిల్లల ముందు అబద్ధాలు చెప్పడం

పిల్లలకు ఎప్పుడూ నిజం చెప్పాలని చెప్పే తల్లిదండ్రులే వారి ముందు చిన్న విషయాల్లోనైనా అబద్ధాలు చెప్తే పిల్లలు గందరగోళానికి గురవుతారు. తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి పిల్లలు నిజాయతీ విలువను నేర్చుకుంటారు. తప్పు జరిగితే దాన్ని అంగీకరించడం, అవసరమైనప్పుడు “నేను తప్పు చేశాను” అని చెప్పడం కూడా పిల్లలకు గొప్ప పాఠమే అవుతుంది.

66
ఎప్పుడూ ఫోన్‌లోనే ఉండటం
Image Credit : Getty

ఎప్పుడూ ఫోన్‌లోనే ఉండటం

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, వీడియోలు వంటి వాటితో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే పిల్లలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఫోన్‌లోనే ఉండటం, వారితో సమయం గడుపుతున్న సమయంలో నిరంతరం స్క్రీన్‌నే చూడటం పిల్లలకు “నా కంటే ఫోనే ఎక్కువ” అనే భావన కలగవచ్చు. కాబట్టి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఫోన్ పక్కన పెట్టి వారి మాటలను శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. రోజులో కొంత సమయాన్ని పూర్తిగా పిల్లల కోసం కేటాయిస్తే తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి
Recommended image2
Top Load Vs Front Load: ఈ రెండు వాషింగ్ మెషీన్లలో ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?
Recommended image3
Salt vs Pink Salt: ఏ రంగు ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఎవరు ఏ ఉప్పు తినాలో తెలుసా?
Related Stories
Recommended image1
Parenting: ఆడపిల్లలు తల్లిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!
Recommended image2
Parenting: తండ్రి ఎప్పుడూ కోపంగా ఉంటే పిల్లలు ఎలా మారిపోతారో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved