MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • ముఖం పై ముడతలు పోవాలంటే..!

ముఖం పై ముడతలు పోవాలంటే..!

వయసు మీద పడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. అయితే ఈ ముడతలు కొంతమందికి చాలా తొందరగా వస్తుంటాయి. అవి పోయి.. యవ్వనంగా కనిపించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 20 2022, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఏజ్ మీద పడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు కనిపించడం సర్వ సాధారణం. ఇవి ముప్పై ఏండ్లు పైబడిన వారికి అప్పుడప్పుడే మొదలవుతుంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
wrinkles

wrinkles

ఈ  ముడతలు కనిపించిన వెంటనే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ముడతలు తగ్గించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయినా ఈ ముడతలు అంత సాధారణంగా వదిలిపోవు.  అయితే రెగ్యులర్ గా కొన్ని చిట్కాలను పాటిస్తే ఈజీగా వదిలిపోతాయి. దాంతో మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఇందుకోసం ఏం చేయాలంటే.. 

310

సన్ స్క్రీన్ లోషన్: ముఖం పై ముడతలు వస్తున్నట్టు అనిపిస్తే.. నిత్యం సన్ స్క్రీన్ లోషన్ ను ఖచ్చితంగా వాడాలి. ఈ ముఖంపై ముడతలు 90 శాతం యువీ కిరణాల ప్రభావం వల్లే వస్తుంటాయి. ఈ యువీకిరణాల వల్ల స్కిన్ సాగే గుణాన్ని కోల్పోతుంది. దీనివల్ల స్కిన్ కాంతం తగ్గుతుంది. అలాగే ముడతలు కూడా వస్తుంటాయి. 

410

నీళ్లు తాగుతూ ఉండాలి:   నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నీళ్లతోనే ఎన్నో రోగాలు మటుమాయం అవుతుంటాయి. అందుకే రోజుకు 8 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఒకవేళ మీరు నీళ్లను తాగకపోతే.. మీరు డీహైడ్రేషన్ బారిన పడి.. మీ స్కిన్ కాంతిని కోల్పోతుంది. డల్ గా కూడా మారుతుంది. దాంతో ముఖంపై ముడతలు కూడా వస్తుంటాయి. అదే నీళ్లు తాగితే ఈ సమస్యలేవీ రావు. మీ ఆరోగ్యం, మీ చర్మ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 
 

510

నిద్ర తప్పనిసరి: మనిషికి నిద్ర ఎంతో అవసరం. నిద్రతో ఎన్నో రోగాలు రావు. మీకు తెలుసా.. నిద్రపోతున్నప్పుడే చర్మకణాలు పునరుత్తేజం అవుతాయి. అంతేకాదు కొత్త కణాలు కూడా తయారవుతాయి. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. 

610

ఆకుకూరలు:  తాజా ఆకు కూరలు, తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు, ఆకు కూరగాయలల్లో ఫైటోన్యూట్రియెంట్లు  పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల ఎలాంటి హానీ కలగకుండా చేస్తాయి. 

710

ఎత్తుకు తగ్గ బరువు:  ఎత్తుకు తగ్గ బరువుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఇది చాలా ముఖ్యం కూడా . నిత్య యవ్వనంగా కనిపించాలంటే మాత్రం మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిందే. అప్పుడే మీరు అన్నివిధాల బాగుంటారు. 

810

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు నిత్యం  High Intensity Interval Training ఎక్సర్ సైజెస్ చేయాలి. వీటివల్ల వయసు మీద పడుతున్నా యువ్వనంగానే ఉంటారని పలు పరిశోధనలో తేలింది. 

910

ఆల్కహాల్: ఆల్కహాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కానీ నేడు చాలా మంది దీనికి బానిసలుగా మారారు. దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటుగా చాలా తొందరగా ముసలివాళ్లుగా కనిపిస్తారు. దీనికి కారణం వీటిని ఎక్కువగా సేవిస్తే డీహైడ్రేట్ బారిన పడతారు. అంతేకాదు వీటివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభించవు. 

1010
coffee

coffee

కెఫిన్: టీ, కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ కెఫిన్ తక్కువ మొత్తంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదు కానీ.. ఎక్కువగా తీసుకుంటేనే చిక్కొస్తుంది. వీటిని ఎక్కువగా తాగితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడటంతో పాటుగా.. నిద్రను కూడా దూరం చేస్తుంది. వీటిని ఎక్కువగా తాగితే శరీరానికి పోషకాలు కూడా అందవు.   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved