MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Face pack: రాత్రి పచ్చి పసుపుతో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు ఉదయానికల్లా ముఖం మెరిసిపోతుంది

Face pack: రాత్రి పచ్చి పసుపుతో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు ఉదయానికల్లా ముఖం మెరిసిపోతుంది

Face pack: ఇంట్లో ఉన్న పచ్చి పసుపు పొడిని వాడడం ద్వారా ముఖాన్ని మెరిపించుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ‘కోరా టర్మరిక్ ఫేస్ ప్యాక్’ వైరల్ అవుతోంది. ఇది ఎలా వేసుకోవాలో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 28 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పసుపుతో ఫేస్ ప్యాక్
Image Credit : Gemini AI

పసుపుతో ఫేస్ ప్యాక్

పచ్చి పసుపును పూర్వం నుంచి అందం కోసం వాడుతున్నారు. ముఖాన్ని రాసుకుంటే చాలు పసుపు రంగులో ముఖం మెరిసిపోతుంది. రకరకాల ఇంటి చిట్కాలు, సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌లు ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో చర్మానికి సహజసిద్ధమైన కాంతిని అందిస్తుందంటూ ‘కోరా టర్మరిక్ DIY ఫేస్ మాస్క్’ వైరల్ అవుతోంది. సహజంగా మన వంటింట్లో లభించే సాధారణ పసుపును డ్రై రోస్ట్ చేసి, దాంతో తయారుచేసే ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి మెరుపునిస్తుందని ఎంతో మంది చెబుతున్నారు. దీన్ని ఎలా వేయాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫేస్ ప్యాక్ తయారీ
Image Credit : Pixabay

ఫేస్ ప్యాక్ తయారీ

ఈ ఫేస్ ప్యకా్ తయారీ ఎంతో సులభంగా ఉంటుంది. దీని కోసం కేవలం ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా రోజ్ వాటర్ సరిపోతాయి. ముందుగా పసుపును తక్కువ మంటపై కాసేపు డ్రై రోస్ట్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత అందులో తేనె, పేస్ట్‌లాగా మారేందుకు తగినంత రోజ్ వాటర్ కలిపితే ఈ ఫేస్ మాస్క్ సిద్ధమవుతుంది. ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కళ్లు, పెదవులను వదిలి మిగతా ముఖమంతా ఈ మిశ్రమాన్ని పలుచగా పూయాలి. సుమార పావుగంట సేపు ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. పసుపులోని శక్తివంతమైన కుర్కుమిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మ కణాలను కాపాడుతుంది. తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఎరుపుదనం, మంటను తగ్గించి తక్షణ మెరుపును అందిస్తాయి.

33
వీరు జాగ్రత్తగా ఉండాలి
Image Credit : Pixabay

వీరు జాగ్రత్తగా ఉండాలి

అయితే ఈ ప్యాక్ అందరికీ పడాలని లేదు. ఇందులో ఉండేవి అన్నీ సహజ పదార్థాలే అయినప్పటికీ సున్నితమైన చర్మం కలిగిన వారికి, ఎగ్జిమా సమస్యలు ఉన్నవారికి పసుపు సరిపడకపోవచ్చు. అందుకే ముఖానికి అప్లై చేయడానికి ముందే చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. మీకు దురద, మంట లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే నీటితో కడిగేయాలి. అలాగే చర్మంపై గాయాలు ఉన్నప్పుడు, లేదా ఎక్స్‌ఫోలియేట్ చేసిన వెంటనే ఈ మాస్క్‌ను ఉపయోగించకూడదు. ఈ ప్యాక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రంతా ముఖంపై ఉంచకూడదని, పసుపు మరకలు పడకుండా జాగ్రత్త పడాలని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పద్ధతిలో వాడితే మాత్రం తక్కువ ఖర్చుతో ముఖానికి మంచి గ్లో పొందవచ్చని పేర్కొంటున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: కూర వండే ముందు.. కూరగాయల్ని ఎలా శుభ్రం చేయాలి?
Recommended image2
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Recommended image3
లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Related Stories
Recommended image1
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Recommended image2
First Rakhi: మొదటిసారి రాఖీని ఎవరు ఎవరికి కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved