MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • పిల్లల్ని హత్తుకుంటే ఏమౌతుందో తెలుసా..?

పిల్లల్ని హత్తుకుంటే ఏమౌతుందో తెలుసా..?

పిల్లల్ని ప్రేమగా హత్తుకోవడం వల్ల వారు మానసికంగా ఎదుగుతారు. కష్ట సమాయాల్లో నాకు వీళ్లు అండగా ఉన్నారన్న భరోసా కలుగుతుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 19 2022, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఒక్క కౌగిలితో ఎన్నో విషయాలను తెలియజేయచ్చు. ఇష్టమైన వారిని గట్టిగా కౌగిలించుకుని వారిపై ఉన్న ప్రేమను తెలియస్తుంటారు. ఇక స్నేహితులపై ఉన్న ఇష్టాన్ని కూడా కౌగిలి ద్వారానే తెలియజేయొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కౌగిలి ఇష్టాన్ని, ప్రేమనే కాదు వారి బాధను కూడా తొలగిస్తుంది. నీకు నేనున్నా అనే భరోసాను కల్పిస్తుంది. కష్టసమయాల్లో ఉన్న వారిని హత్తుకుంటే వారికి ఎంతో ఓదార్పు లభిస్తుంది. ధైర్యాన్ని కూడా ఇస్తుంది. 

310

ఈ కౌగిలింత పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఎంతో అవసరం. పేరెంట్స్ పిల్లలను ప్రేమగా హగ్ చేసుకుంటే వారికెంత భారోసా కలుగుతుందో తెలుసా. మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పేరెంట్స్ పిల్లలను హగ్ చేసుకుంటే వారి ఎదుగుదల బావుంటుందని చెబుతున్నారు. 

410
parenting

parenting

ప్రేమగా వారిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటే .. వారి కష్టం రాకుండా చూసుకునే వారున్నారన్న నమ్మకం వారిలో కలుగుతుందట. 

510

పిల్లలు శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండేందుకు కేవలం వారికి పౌష్టికాహారం మాత్రమే కాదు.. తల్లిదండ్రులు తరచుగా హగ్ చేసుకోవాలంట. దీనివల్ల వారి మెదడు పనితీరు మెరుగు పడుతుంది. అంతేకాదు వారి ఆలోచనా విధానం కూడా  బాగుంటుందట. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి కూడా. 

610

కొన్ని కొన్ని సమయాల్లో పిల్లలు తుంటరి పనులను చేస్తుంటారు. అలాంటి సమయాల్లో వారిని కొట్టడమో, తిట్టడమో చేయకుండా వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకోవాలట. దీనివల్ల పిల్లలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి వారి మూడ్ మారుతుందట. 

710

ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా.. పిల్లలను తరచుగా హత్తుకుంటే వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

810
parenting

parenting

పిల్లలు అనారోగ్యం బారిన పడ్డప్పుడు లేదా వారికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకుంటే వాటినుంచి తొందరగా బయటపడతారట. 

910

ఇకపోతే పిల్లలను ఏ విషయం గురించైనా మెచ్చుకోవాలనుకుంటే వారిని ప్రేమగా కౌగిలించుకోండి. దీంతో వారు ఎంతో సంతోషిస్తారు. ఇది వారిలో సానుకూల ఆలోచనలు వచ్చేలా చేస్తుంది కూడా. 

1010
Parenting

Parenting

పిల్లలను కుటుంబ సభ్యులు తరచుగా కౌగిలించుకునే, లేదా ఎక్కువ ప్రేమను పొందే పిల్లలు తమ భావోద్వేగాలను కూడా కంట్రోల్ చేసుకోగలరని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పిల్లలు చెడు వ్యసనాల వైపు మల్లే అవకాశం ఉండదు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved