MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health Tips: తులసి గింజల ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు..

Health Tips: తులసి గింజల ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు..

Health Tips: తులసి ఆకులను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎన్నో ఇన్ఫెక్షన్లను తొలగించడానికి సహాయపడుతుంది. తులసి ఆకులే కాదు తులసి గింజలు (Basil seeds) కూడా మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jun 16 2022, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తులసి ఆకులు (Basil leaf) మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ ఆకులు శరీరంలోని మంట నుంచి ఉపశమనం కలిగించడంలో ముందుంటాయి. అలాగే రోగనిరోధక శక్తి (Immunity)ని బలోపేతం చేస్తుంది. తులసి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటాయి. అయితే తులసి విత్తనాలు (Basil seeds)కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్న ముచ్చట చాలా మందికి తెలిసి ఉండదు. తులసి గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తులసి గింజల్లో ప్రోటీన్ (Protein), ఫైబర్ (Fiber), ఐరన్ (Iron)పుష్కలంగా ఉంటాయి.  ఈ తులసి గింజలు జీర్ణక్రియ, బరువు తగ్గడం, దగ్గు, జలుబు వంటి జబ్బులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

38

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు:  తులసి గింజలు మెదడుకు మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి (Stress),ఆందోళన (Anxiety) వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి గింజలు మానసిక అనారోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి. ఒత్తిడి కలిగినప్పుడు తులసి విత్తనాల్ని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది మనసును శాంతపరుస్తుంది.
 

48

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:  తులసి గింజల్లో ఫ్లేవనాయిడ్లు (Flavonoids), ఫినోలిక్ (Phenolic)ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచుతాయి. అంతేకాక శీతాకాలంలో (winter) తులసి విత్తన కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.  తులసి విత్తనాల్ని టీలో వేసుకుని కూడా తాగొచ్చు. 
 

58

తులసి విత్తనాల్లో చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ (Free radicals) వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల వృద్ధాప్యం ఛాయలు చిన్నవయసులో రావడం ప్రారంభమవుతాయి. అయితే తులసి గింజలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు.
 

68

తులసి గింజలు జీర్ణవ్యవస్థ (Digestive system)ను మెరుగుపరిచి కడుపు సమస్యలను దూరం చేస్తాయి. తరచుగా చాలా మందికి మలబద్ధకం (Constipation), అసిడిటీ (Acidity), అజీర్ణం (Indigestion) వంటి కడుపు సమస్యలు వస్తుంటాయి. ఈ వ్యాధులన్నింటికీ తులసి విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

78

తులసి గింజల్లో ఉండే ఫైబర్ (Fiber)పేగులను పూర్తిగా శుద్ధి చేస్తుంది. ఇందుకోసం తులసి విత్తనాల్ని రెండు మూడు గంటలు నీళ్లలో నానబెట్టాలి. దాంతో విత్తనాలు ఉబ్బుతాయి. అలాగే వాటిపైన జెలటిన్ పొరను ఏర్పరుస్తాయి. నీళ్లతో సహా తులసి విత్తనాల్ని తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. 

88

అధిక బరువు (Over weight), ఊబకాయం (Obesity)సమస్యతో బాధపడేవారికి తులసి గింజలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. ఎందుకంటే తులసి గింజలు బరువు తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.  తులసి విత్తనాలలో కేలరీలు (Calories)చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ (Fiber)అధికంగా ఉంటుంది. ఇవి మీకు అంత తొందరగా  ఆకలి కానివ్వవు. వీటిని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాక తులసి విత్తనాన్ని గ్రీన్ టీ తయారీకి కూడా ఉపయోగించవచ్చు. ఇది బరువును తగ్గిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved