MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • International
  • Viral News: మహిళా ఎంపీ ఇంట్లో బంగారు బికినీ.? సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న ఫొటోలు

Viral News: మహిళా ఎంపీ ఇంట్లో బంగారు బికినీ.? సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న ఫొటోలు

Viral News: ఇరాక్‌లో అవినీతి వ్యతిరేక చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మహిళా ఎంపీ ఇంటిపై అధికారులు దాడి చేసిన స‌మ‌యంలో బంగారంతో తయారైన లోదుస్తులు ల‌భ్య‌మైన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 02 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతోంది?
Image Credit : Gemini AI

సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతోంది?

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, ఇరాక్‌కు చెందిన మహిళా ప్రజాప్రతినిధి హింద్ అల్-అబ్బాసి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారనే ప్రచారం సాగింది. ఈ దాడిలో సుమారు 57 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, 27 కిలోల బంగారం, అలాగే బంగారంతో తయారుచేసిన విలాసవంతమైన లోదుస్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వాదనలకు మద్ధతుగా కొన్ని ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దర్యాప్తులో బయటపడిన వాస్తవం
Image Credit : Gemini AI

దర్యాప్తులో బయటపడిన వాస్తవం

ఈ వైరల్ ప్రచారాన్ని పరిశీలించిన తర్వాత, అందులో పేర్కొన్న అంశాలకు అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడైంది. ముఖ్యంగా హింద్ అల్-అబ్బాసి ఇంట్లో బంగారు లోదుస్తులు లేదా 57 మిలియన్ డాలర్ల నగదు దొరికిందని ఇరాక్ ప్రభుత్వం, భద్రతా సంస్థలు లేదా అధికారిక మీడియా ఎక్కడా ప్రకటించలేదు.

Related Articles

Related image1
Bike: ధ‌ర రూ. 84 వేలు, మైలేజ్ 71 కి.మీలు.. ఇది క‌దా సామాన్యుడి బైక్ అంటే
Related image2
మీ కంపెనీ పెంచకపోయినా సరే.. మీ జీతం పెరగనుంది. మారిన పీఎఫ్ నిబంధనలతో ఏం జ‌ర‌గ‌నుంది.?
35
అసలు సోదాలు ఎవరిపై జరిగాయి?
Image Credit : Asianet News

అసలు సోదాలు ఎవరిపై జరిగాయి?

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాక్ అవినీతి నిరోధక దర్యాప్తులో భాగంగా అధికారులు నిర్వహించిన దాడులు మాజీ ఎంపీ అలియా నాసిఫ్కు సంబంధించిన వ్య‌వ‌హారం చుట్టూ తిరిగాయి. ఈ సోదాల్లో సుమారు 15.5 మిలియన్ డాలర్ల నగదుతో పాటు గణనీయమైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వ‌చ్చాయి. అదే కేసులో ఆమె కుమారుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో హింద్ అల్-అబ్బాసి పేరుతో ప్రచారం చేస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు.

45
ఇరాక్‌లో అవినీతిపై కొనసాగుతున్న కఠిన చర్యలు
Image Credit : Gemini AI

ఇరాక్‌లో అవినీతిపై కొనసాగుతున్న కఠిన చర్యలు

ఇటీవలి కాలంలో ఇరాక్ ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక దర్యాప్తు చేపడుతోంది. మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులపై విచారణ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన మాజీ డిప్యూటీ చమురు శాఖ మంత్రి ఇచ్చిన సమాచారంతో పలుచోట్ల సోదాలు నిర్వహించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను విచారించినట్లు సమాచారం.

55
వైరల్ పోస్టులను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి
Image Credit : Gemini AI

వైరల్ పోస్టులను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి

సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించే ప్రతి సమాచారం నిజం కావాల్సిన అవసరం లేదు. ఇరాక్‌లో అవినీతి వ్యతిరేక సోదాలు జరిగిన విషయం నిజమే అయినప్పటికీ, 27 కిలోల బంగారం, బంగారు లోదుస్తులు, 57 మిలియన్ డాలర్ల నగదు వంటి సంచలనాత్మక వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల ఇలాంటి వార్తలను నమ్మే ముందు విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా అధికారిక ప్రకటనలను పరిశీలించడం అవసరం. ప్రస్తుతం వైరల్ అవుతున్న కథనంలోని కీలక ఆరోపణలు నిర్ధారణ కాలేదని గుర్తించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
ప్రపంచం
ఫ్యాక్ట్ చెక్

Latest Videos
Recommended Stories
Recommended image1
Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Recommended image2
Donald Trump: మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లు పెట్టిన ట్రంప్‌.. హార్మోజ్ మాదే అంటూ ప్ర‌క‌ట‌న
Recommended image3
Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
Related Stories
Recommended image1
Bike: ధ‌ర రూ. 84 వేలు, మైలేజ్ 71 కి.మీలు.. ఇది క‌దా సామాన్యుడి బైక్ అంటే
Recommended image2
మీ కంపెనీ పెంచకపోయినా సరే.. మీ జీతం పెరగనుంది. మారిన పీఎఫ్ నిబంధనలతో ఏం జ‌ర‌గ‌నుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved