Bike: ధర రూ. 84 వేలు, మైలేజ్ 71 కి.మీలు.. ఇది కదా సామాన్యుడి బైక్ అంటే
Bike: దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్‌లలో హీరో ప్యాషన్ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు కంపెనీ తన ప్రముఖ హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్‌ను కొత్త డిస్క్ బ్రేక్ వేరియంట్‌లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.?

కొత్త డిజైన్‌తో మరింత స్టైలిష్ లుక్
కొత్త Hero Passion Plus Disc మోడల్‌లో గత వెర్షన్‌తో పోలిస్తే డిజైన్‌లో మార్పులు చేశారు. కొత్త గ్రాఫిక్స్, ప్రీమియం ఫినిషింగ్, ఆకర్షణీయమైన బాడీ స్టైల్‌తో బైక్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. అయితే ప్యాషన్ సిరీస్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపును మాత్రం కంపెనీ అలాగే కొనసాగించింది. దీంతో కొత్త లుక్‌తో పాటు పాత మోడల్‌కు ఉన్న విశ్వసనీయత కూడా ఈ బైక్‌లో కనిపిస్తుంది.
డిజిటల్ మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ ప్రత్యేక ఆకర్షణ
ఈ బైక్‌లో ప్రధాన ఆకర్షణ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ లెవల్ వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేస్తే కాల్స్, SMS అలర్ట్‌లు నేరుగా డిజిటల్ డిస్‌ప్లేపై కనిపిస్తాయి. దీంతో ప్రయాణ సమయంలో ఫోన్‌ను పదేపదే చూడాల్సిన అవసరం ఉండదు.
71 కిలోమీటర్ల వరకు మైలేజ్.. ధర ఎంత?
కొత్త Hero Passion Plus Disc బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో గరిష్ఠంగా 71 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లాలనుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.84,128గా నిర్ణయించారు.
మెరుగైన భద్రతతో పాటు మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
ఈ కొత్త మోడల్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను అందించారు. దీంతో బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో బైక్‌ను వేగంగా నియంత్రించేందుకు సహాయపడుతుంది. అదనంగా రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, లో ఫ్యూయల్ అలర్ట్, డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
తక్కువ ఖర్చుతో మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రత కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని Hero ఈ కొత్త Passion Plus Disc బైక్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ ప్రయాణాలకు ఇది మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

