MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మధుమేహులు మామిడి పండ్లను ఇలా తింటేనే మంచిది.. ఎలా పడితే అలా తిన్నారో..?

మధుమేహులు మామిడి పండ్లను ఇలా తింటేనే మంచిది.. ఎలా పడితే అలా తిన్నారో..?

ఎండాకాలం వచ్చేసింది. ఇంకేముంది మామిడి పండ్లు కూడా మార్కెట్ లోకి వచ్చేస్తుంటాయి. ఇక వాటిని చూస్తూ తినకుండా ఉండటం చాలా కష్టం. కానీ మధుమేహులు మాత్రం వీటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ మామిడి పండ్లను కొన్ని విధాలుగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే లేదంటున్నారు నిపుణులు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 09 2023, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image: Getty Images

Image: Getty Images

జ్యూసీగా, టేస్టీగా, తీయగా ఉండే మామిడి పండ్లను చూస్తూ తినకుండా ఉండటం చాలా కష్టం. పండ్లలో రారాజు అయిన మామిడి పండు ఒక్క ఎండాకాలంలో లభిస్తుంది. ఈ సీజన్ పోతే మళ్లీ దొరకవని రోజూ తినేవారున్నారు. నిజానికి మామిడి పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లు ఆకలిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. విటమిన్లు, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉండే మామిడి పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. అయితే చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు మామిడి పండ్లకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కానీ వీటిని కూడా డయాబెటీస్ పేషెంట్లు తినొచ్చు. 
 

25
Image: Getty Images

Image: Getty Images

మామిడి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే వీటిలోని ఫైబర్, వాటర్ కంటెంట్ శరీరంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తాయి. అయినప్పటికీ.. మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల దీని ప్రయోజనాలు తగ్గుతాయి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఈ పండ్లను తినడానికి భయపడుతుంటారు. అయితే మధుమేహులు కొన్ని మార్గాల్లో మామిడి పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. అదెలాగంటే..
 

35
Image: Getty Images

Image: Getty Images

స్మూతీ

తీయగా, పోషకాలు పుష్కలంగా ఉండే మామాడి పండ్లను మధుమేహులు కూడా తినొచ్చు. కాకపోతే వీరు మామిడి పండ్లను పెరుగుతో స్మూతీగా తినాలి. ఎందుకంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ను మరింత తగ్గిస్తుంది. 
 

45
Image: Getty Images

Image: Getty Images

స్టాండలోన్ స్నాక్

భోజనం తర్వాత కాకుండా ఉదయం లేదా మధ్యాహ్నం పూట అల్పాహారంగా మధుమేహులు తీసుకోవచ్చు. దీనివల్ల వీరికి మంచి జరుగుతుంది.  దీనీవల్ల మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు.

55
Mangoes

Mangoes

ప్రాసెస్ చేసిన మామిడికి దూరంగా ఉండండి

మార్కెట్లో ప్రాసెస్ చేసిన మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. కానీ వీటిని తినకపోవడమే మంచిది. తయారుగా ఉన్న, ముక్కలుగా కోసి పెట్టిన మామిడి ముక్కలను అస్సలు తినకండి. ఫ్రెష్ వాటినే మాత్రమే తినాలి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Beer: బీర్ తాగితే మ‌నిషి చ‌నిపోతాడా.? ఒకేసారి ఎంత తాగితే ఇలా జ‌రుగుతుందో తెలుసా.
Recommended image2
Sleep Habits: ఈ అలవాట్లు మీ నిద్రను పాడుచేస్తాయి.. జాగ్రత్త!
Recommended image3
Carrot Benefits: రోజుకో క్యారెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved