MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snake vs Mongoose : ముంగీస, పాము మధ్య గొడవేంటి..? ఇది ఎక్కడ మొదలైందో తెలుసా?

Snake vs Mongoose : ముంగీస, పాము మధ్య గొడవేంటి..? ఇది ఎక్కడ మొదలైందో తెలుసా?

ముంగీస, పాము మధ్య శత్రుత్వానికి పౌరాణికాల్లో శాపం, సైన్స్ పరంగా జన్యు కారణాలు ఉన్నాయి. ఇలా పుట్టుకతోనే బద్ద శత్రువులైన వీటి మధ్య గొడవ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 13 2026, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాము, ముంగీస గొడవకు అసలు కారణం ఏంటి?
Image Credit : AI Image

పాము, ముంగీస గొడవకు అసలు కారణం ఏంటి?

ఎప్పుడూ గొడవపడుతుంటే ‘’పాము, ముంగీసల్లా గొడవపడతారేంట్రా'' అంటుంటారు. అంటే బద్ద శత్రుత్వానికి ఈ రెండు జంతువులు సింబాలిక్ గా మారిపోయాయన్నమాట. మనకు పాము కనిపించిందంటే భయంతో దూరం పారిపోతాం… కానీ ముంగీస అలా కాదు, విషపూరితమైన పాముతో హోరాహోరీగా తలపడుతుంది. ఇలా ముంగీస, పాము ఎదురుపడితే చాలు అక్కడ యుద్ధం ఖాయం.

మనం చిన్నప్పటి నుంచి పాము, ముంగీస శత్రుత్వం గురించి కథలుకథలుగా వింటూనే ఉన్నాం. ఈ సమయంలో ఓ డౌట్ వచ్చివుంటుంది… అసలు ఈ రెండింటి మధ్య ఇంత పగ ఎందుకని. దీని వెనుక పౌరాణిక, శాస్త్రీయ కారణాలు రెండూ ఉన్నాయి. వాటి గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాము, ముంగీస గొడవ గురించి పురాణాలు చెప్పే కథ ఇదే..
Image Credit : AI Image

పాము, ముంగీస గొడవ గురించి పురాణాలు చెప్పే కథ ఇదే..

పురాణాల ప్రకారం… కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. కద్రువ పాములకు తల్లి కాగా, వినత గరుత్మంతుడు, అరుణుడికి తల్లి. కద్రువకు వినత అంటే అస్సలు పడేది కాదు. ఒకసారి వారిద్దరి మధ్య జరిగిన పందెంలో కద్రువ మోసం చేసి వినతను ఓడించింది, తన దాసిగా మార్చుకుంది.

ఈ మోసం గురించి తెలుసుకున్న వినత పాములకు శాపం పెట్టింది. అప్పటి నుంచి వినత కొడుకైన గరుత్మంతుడు పాములను చంపి తినడం మొదలుపెట్టాడు. ఇలా గరుడ జాతి పక్షులకు, పాములకు మధ్య వైరం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. విశేషం ఏంటంటే ముంగిసను 'నేల గరుడ' (Terrestrial Garuda) అని కూడా పిలుస్తారు. గరుత్మంతుడు ఆకాశంలో పాములను వేటాడితే, ముంగిస నేల మీద పాములను వేటాడి చంపుతుందని ఒక పౌరాణిక నమ్మకం.

34
పాము, ముంగీస మధ్య గొడవ గురించి సైన్స్ ఏం చెబుతుంది
Image Credit : AI Image

పాము, ముంగీస మధ్య గొడవ గురించి సైన్స్ ఏం చెబుతుంది

ఇక శాస్త్రీయ కోణంలో చూస్తే పాము, ముంగిస రెండూ ఒకే రకమైన ఆహారం (చిన్నచిన్న జంతువులు, ఎలుకలు మొదలైనవి) తింటాయి. సాధారణంగా ఆహారం కోసం వేటాడేటప్పుడే ఇవి ఎక్కువగా ఎదురుపడతాయి. తమ ఆహారంపై మరొకరు హక్కు సాధించకూడదనే పోటీతోనే వీటి మధ్య పోరాటం జరుగుతుందని చెబుతారు. అంటే పరిస్థితులే వీటిమధ్య శత్రుత్వాన్ని పెంచాయన్నమాట.

44
పాము విషం ముంగీసకు ఏం చేయలేదా?
Image Credit : AI Image

పాము విషం ముంగీసకు ఏం చేయలేదా?

పాము విషం ముంగిసపై నేరుగా ప్రభావం చూపదు. ముంగిస శరీరానికి పాము విషాన్ని తట్టుకునే ప్రత్యేక శక్తి ఉంది. ఈ ధైర్యంతోనే ముంగిస పాముతో నేరుగా పోరాడుతుంది. తన వేగంతో పామును ఓడించి, ఆహారాన్ని దక్కించుకుంటుంది. మొత్తంగా చెప్పాలంటే పాము-ముంగిస వైరం వెనుక శాపం కథతో పాటు, మనుగడ కోసం చేసే పోరాటం కూడా ఒక ముఖ్య కారణం.

గమనిక 

ఈ కథనంలో ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద కథలపై ఆధారపడి ఉంది. ఇది పండితులు, వివిధ మూలాల నుంచి సేకరించిన సమాచారం. కేవలం పాఠకుల ఆసక్తి కోసం మాత్రమే అందిస్తున్నాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫాలోవర్స్ దెబ్బ.. ఇన్‌ఫ్లూయెన్సర్‌ అబ్బా..! సోషల్ మీడియాలో ఎక్స్ట్రాలు చేశారో ఇదే గతి.. బీ కేర్ ఫుల్
Recommended image2
White Uniform: ఏ దేశానికి చెందిన క్రికెటర్లయినా టెస్ట్ క్రికెట్‌లో వైట్ డ్రెస్ మాత్రమే ఎందుకు వేసుకుంటారు?
Recommended image3
చేతివేళ్లు విరిస్తే 'టక్' అని శబ్దం ఎందుకు వస్తుంది? దీని వెనుక అసలు కారణం ఇదే!
Related Stories
Recommended image1
Snakes : ఓ పాము ఇంకో పామును కరిస్తే ఏమవుతుంది?
Recommended image2
Snakes Farm : కోళ్ల ఫారం లాగే పాముల ఫారం.. లక్షల నాగుపాములు పెంచే ఈ ఒక్క విలేేజ్ ఆదాయం ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved