MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snake Meat Food : చికెన్ పకోడీ రొటీన్.. పాము పకోడీ వెరైటీ..! ఇలా లొట్టలేసుకుంటూ తింటున్నారేంట్రా బాబు!!

Snake Meat Food : చికెన్ పకోడీ రొటీన్.. పాము పకోడీ వెరైటీ..! ఇలా లొట్టలేసుకుంటూ తింటున్నారేంట్రా బాబు!!

నాగుపాము మాంసంతో పకోడి, కట్లపాము మాంసంలో కబాబ్… చదువుతుంటేనే ఒళ్లు జలదరిస్తుందా? అయితే ఇలాంటి వంటకాలు నిజంగానే ఉంటాయి, ప్రజలు లొట్టలేసుకుంటూ తింటారు కూడా. ఎక్కడో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 06 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాము మాంసంతో వంటకాలా..!
Image Credit : Gemini AI

పాము మాంసంతో వంటకాలా..!

Snake Meat Snacks : మనం సాధారణంగా చికెన్, మటన్, చేపలు లేదా రొయ్యలతో చేసిన పకోడీలు, టిక్కాలు, కబాబ్‌లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా నాగుపాముతో చేసిన పకోడీలు, సమోసాలు తిన్నారా..? కనీసం ఇలాంటి వంటకాలు ఉంటాయని విన్నారా? వినడానికే ఒళ్ళు జలదరిస్తున్నా ఇలాంటి వంటకాలు ఉన్నాయన్నది ముమ్మాటికీ నిజం. మన దేశంలో వీధుల్లో పానీపూరి, సమోసా బండ్లు ఎలా ఉంటాయో.. ఇండోనేషియా వీధుల్లో నాగుపాము (కోబ్రా) మాంసంతో చేసిన డిష్‌లను విచ్చలవిడిగా అమ్మే స్టాల్స్ ఉంటాయి. అక్కడి జనాలు వీటిని ఇష్టంగా తింటారు.

అయితే ఇంతకాలం ఇండోనేషియాలో లభించే పాము పకోడీలు, స్నేక్ కబాబ్స్ గురించి చాలామందికి తెలియదు. అయితే ఈ కోబ్రా వంటకాలు, స్టాల్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీంతో ఈ పాముల వంటకాలు ఫేమస్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్ మీడియాలో పాము వంటకాల వీడియో వైరల్..
Image Credit : Gemini

సోషల్ మీడియాలో పాము వంటకాల వీడియో వైరల్..

ఓ ఇంటర్నేషనల్ ట్రావెల్ వ్లాగర్ సోషల్ మీడియాలో ఇండోనేషియా స్ట్రీట్ ఫుడ్ మార్కెట్‌కు సంబంధించిన విజువల్స్‌, వీడియోలకు పంచుకున్నాడు. ఈ వీడియోలో వరసగా ఉన్న దుకాణాలు, అందులో నాగుపాము మాంసంతో రకరకాల వంటకాలు సిద్ధం చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఓ స్టాల్ వద్ద ఒక యువతి ఎంతో ధైర్యంగా భయంకరమైన నాగుపామును చేతుల్లో పట్టుకుని నిల్చుంది.

మరోచోట పదుల సంఖ్యలో బతికున్న నాగుపాములు ఉన్న పెద్ద ప్లాస్టిక్ డబ్బా కనిపించింది. ప్రమాదం జరగకుండా ఆ పాముల నోళ్లకు పట్టీలు (టేప్) కట్టి ఉంచడం గమనార్హం. దుకాణాల ముందర ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసి.. నాగుపాముతో ఏమేం వంటకాలు చేస్తారో స్పష్టమైన విభాగాలు, ధరలతో సహా డిస్ప్లే చేశారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది "ఇది అత్యంత భయంకరమైన వంటకం, ఎలా తింటారురా బాబోయ్!" అని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు "ప్రపంచంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన ఆహార సంస్కృతి ఉంటుంది, దానిని గౌరవించాలి" అని అభిప్రాయపడుతున్నారు. విదేశీ పర్యాటకులు ఇండోనేషియా వెళ్లినప్పుడు ఈ కోబ్రా స్టాళ్లను చూడటానికి ప్రత్యేక ఆసక్తి చూపుతుంటారు.

Related Articles

Related image1
Snake : విషం లేని పాములు కూడా ప్రాణాలు తీయగలవు.. ఎలాగో తెలుసా?
Related image2
Snake : నీటిలో ఉండగా పాములు కాటు వేయలేవని అంటారు.. ఇందులో నిజమెంత?
35
పాములతో ఏమేం వంటకాలు చేస్తారంటే?
Image Credit : Gemini AI

పాములతో ఏమేం వంటకాలు చేస్తారంటే?

ఇండోనేషియా వీధుల్లో నాగుపాము మాంసాన్ని కేవలం ఒకేలా కాకుండా, ప్రజల అభిరుచులకు తగినట్లుగా అనేక రకాలుగా వండుతారు. అక్కడి ప్రజలు వీటిని ఎంతో మక్కువతో లొట్టలేసుకుంటూ తింటారు. కోబ్రా పకోడీ, పాముల సమోసాలు లభిస్తాయి... క్రిస్పీగా ఉండేలా స్థానిక మసాలాలు జత చేసి వీటిని వండుతారు. పాము మాంసాన్ని నిప్పులపై కాల్చి, స్పైసీ మసాలాలు దట్టించి టిక్కాలు, కబాబ్‌లు అందిస్తారు.

పాము ఎముకలు, మాంసంతో రసం (సూప్) కాచి వేడిగా తాగుతారు. ఇక వెస్ట్రన్ శైలిలో నాగుపాము మాంసంతో సాసేజ్‌లు కూడా తయారు చేస్తుండటం విశేషం. ఇలా పాము మాంసంతో రకరకాల వంటకాలు వడ్డి ప్రజలకు రుచిచూపిస్తారు. కేవలం స్ట్రీట్ స్టాల్స్ లోనే కాదు ఇండోనేషియాలోనే పెద్దపెద్ద రెస్టారెంట్స్ లో కూడా పాము మాంసంతో వంటకాలు లభిస్తాయి.

45
ఈ దుకాణాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి?
Image Credit : Gemini

ఈ దుకాణాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి?

ఇండోనేషియా రాజధాని జకార్తా (Jakarta)తో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్త (Yogyakarta) ప్రాంతాల్లో పాము మాంసంతో తయారుచేసే వంటకాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడ ఇలాంటి దుకాణాలు వీధి వీధినా కనిపిస్తాయి. మన దగ్గర హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వీధుల్లో సాయంత్రం వేళల్లో రకరకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్నాక్ స్టాల్స్ ఎలా కళకళలాడుతాయో, అక్కడ కూడా సాయంత్రం కాగానే పాము వంటకాల స్టాల్స్ వద్ద జనాలు గుమిగూడుతారు. ఒకే వరసలో పదుల సంఖ్యలో ఈ తరహా షాపులు నడుస్తుండటం అక్కడి ఫుడ్ కల్చర్‌కు అద్దం పడుతోంది.

55
పాము మాంసంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయాా?
Image Credit : X

పాము మాంసంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయాా?

ఇండోనేషియా ప్రజలు నాగుపాము మాంసాన్ని కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా సాంప్రదాయ ఔషధ గుణాలు ఉన్నాయని బలంగా నమ్ముతారు.

చర్మ వ్యాధులు : పాము మాంసం తినడం వల్ల అలర్జీలు, తామర (Eczema), మొటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయని భావిస్తారు.

రక్త శుద్ధి : నాగుపాము మాంసంలో ఉండే కొన్ని పదార్థాలు శరీరాన్ని, రక్తాన్ని శుద్ధి చేస్తాయని నమ్ముతారు.

స్టామినా & ఎనర్జీ : శరీరాకృతిని, రక్షణ వ్యవస్థను పెంచడానికి నాగుపాము రక్తాన్ని తేనె లేదా ఆల్కహాల్‌తో కలిపి తాగే ఆచారం కూడా ఉంది.

శ్వాసకోశ సమస్యలు : ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అక్కడి నాటు వైద్యులు చెబుతుంటారు.

అయితే పాము మాంసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది అపోహ మాత్రమే. విషపూరిత పాములను సరైన పద్దతిలో కట్ చేసి వండాలి. లేదంటే దాని విషం శరీరంలోకి చేరి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

పాము మాంసం రుచికరంగా ఉంటుందా?

పాము అత్యంత ప్రమాదకరమైన విషప్రాణి కాబట్టి దీనిని తయారు చేసేటప్పుడు వ్యాపారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా పాము విషపు కోరలను, విష గ్రంథులను జాగ్రత్తగా తొలగిస్తారు. ఆ తర్వాత చర్మాన్ని వలిచి, మాంసాన్ని శుభ్రం చేస్తారు. పాము మాంసానికి ఉండే నీచు వాసన పోయేలా స్థానిక ఇండోనేషియన్ మసాలాలు, అల్లం, వెల్లుల్లి, కారం (సాంబల్ చట్నీ) దట్టంగా పట్టించి డీప్ ఫ్రై చేస్తారు. అందుకే అక్కడ దొరికే పాముమాంసం వంటకాలు సాధారణ మాంసంలాగే రుచికరంగా ఉంటాయని తిన్నవారు చెబుతుంటారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆహారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇవేం టాయిలెట్స్ బాబోయ్‌.. బ‌య‌ట నుంచి అంతా క‌నిపిస్తుంది. కానీ లోపికి వెళ్తే మాత్రం
Recommended image2
Petrol Price : స్వాతంత్య్ర సమయంలో ఇండియాలో పెట్రోల్ ధర ఎంతో తెలుసా?
Recommended image3
UPI Charges : యూపీఐ పేమెంట్స్ పై ఇక ఛార్జీలా? లోక్ సభలో బిల్లు ఇందుకేనా? రూ.2000 దాటితే ఏం జరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Snake : విషం లేని పాములు కూడా ప్రాణాలు తీయగలవు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Snake : నీటిలో ఉండగా పాములు కాటు వేయలేవని అంటారు.. ఇందులో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved