MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • రైలులో బ్యాగ్ మరిచిపోయారా లేక దొంగిలించారా? వెంటనే ఇలా చేయండి!

రైలులో బ్యాగ్ మరిచిపోయారా లేక దొంగిలించారా? వెంటనే ఇలా చేయండి!

రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి బ్యాగులు మరిచిపోవడం లేదా దొంగతనానికి గురవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే కొన్ని పనులు చేస్తే బ్యాగు తిరిగి దొరికే అవకాశం ఉంది. ఆ పనులేంటో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 26 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రైలులో బ్యాగ్ పోతే
Image Credit : Chat gpt

రైలులో బ్యాగ్ పోతే

రైలు ప్రయాణంలో హడావుడిగా దిగిపోయేటప్పుడు బ్యాగ్ సీటు దగ్గరే మరిచిపోవడం, సామాను కనిపించకుండా పోవడం చాలామందికి ఇలా జరుగుతుంది. ఒక్కోసారి బ్యాగ్ దొంగతనానికి గురవుతూ ఉంటుంది. బ్యాగ్ పోయిందని తెలిసిన వెంటనే కంగారు పడకుండా ముందుగా రైలులో ఉన్న టీటీఈ, గార్డు లేదా ఇతర రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. బ్యాగ్ ఏ కోచ్‌లో, ఏ సీటు దగ్గర పెట్టారు, రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు వంటి వివరాలు చెప్పాలి. బ్యాగ్ పొరపాటున రైలులోనే ఉండిపోయిందా? దొంగతనానికి గురైందా? అనే విషయం తెలుసుకోవడానికి ఈ వివరాలు అధికారులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం రైల్వేలో ఫిర్యాదుల కోసం ‘రైల్ మదద్ సేవ’ అందుబాటులో ఉంది. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో సమస్య ఎదురైతే 139కు కాల్ చేసి సహాయం కోరవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
139కు కాల్ చేయండి..
Image Credit : Pixabay

139కు కాల్ చేయండి..

బ్యాగ్ దొంగతనానికి గురైందని అనుమానం ఉంటే వెంటనే రైల్వే పోలీస్ లేదా ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. రైల్వే అధికారుల ప్రకారం పోయిన వస్తువులపై ‘రైల్ మదద్’‌లో ఫిర్యాదు చేయవచ్చు. 139కు కాల్ చేయడం ద్వారా కూడా సహాయం పొందొచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు మీ మొబైల్ నంబర్, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్, కోచ్ నంబర్, సీటు నంబర్, ప్రయాణ వివరాలు, బ్యాగ్ రంగు, పరిమాణం, ప్రత్యేక గుర్తులు, అందులో ఉన్న వస్తువులు వంటి వివరాలను స్పష్టంగా చెప్పాలి. రైల్ మదద్‌లో రైలు ఫిర్యాదు నమోదు చేసే సమయంలో కోచ్, సీటు, ప్రయాణ తేదీ, ఫిర్యాదు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే ఫోటోలు లేదా ఇతర ఆధారాలను కూడా అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది.

Related Articles

Related image1
మీ కాళ్లపై నీలి సిరలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంగా మారుతుంది
Related image2
రాఖీ కట్టేటప్పుడు ఈ ఒక్క మంత్రం చెప్పండి.. మీ అన్నదమ్ములకు అంతా మంచే జరుగుతుంది
33
ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి
Image Credit : Pixabay

ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి

బ్యాగ్ పోయిన విషయం తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. ఆలస్యం చేస్తే బ్యాగ్ ఎక్కడ ఉందో గుర్తించడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చిన తర్వాత వారు అవసరాన్ని బట్టి సంబంధిత స్టేషన్, ఆర్పీఎఫ్ లేదా ఇతర అధికారులకు సమాచారం అందించవచ్చు. దొంగతనం జరిగినట్లు తేలితే పోలీస్ ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ నమోదు విషయంలో ఆర్పీఎఫ్ సిబ్బంది సహాయం చేస్తారు. రైల్వేలో లాస్ట్ అండ్ ఫౌండ్ సేవ కూడా ఉంది. కాబట్టి బ్యాగ్ పోయిందని తెలిసిన వెంటనే ‘ఇక దొరకదు’ అని అనుకోకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా బ్యాగ్‌పై పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలతో ట్యాగ్ పెట్టుకోవడం మంచిది. విలువైన వస్తువులు, నగదు, ముఖ్యమైన పత్రాలను మాత్రం ఎప్పుడూ మన దగ్గరే ఉంచుకోవడం సురక్షితం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: వర్షం పడకుండానే నేపాల్‌లోని నదికి వరదలు ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది?
Recommended image2
పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?
Recommended image3
ర‌మ్ వ‌ర్సెస్ విస్కీ... ఈ రెండింటి మ‌ధ్య అస‌లు తేడా ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
మీ కాళ్లపై నీలి సిరలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంగా మారుతుంది
Recommended image2
రాఖీ కట్టేటప్పుడు ఈ ఒక్క మంత్రం చెప్పండి.. మీ అన్నదమ్ములకు అంతా మంచే జరుగుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved