MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: బాలకృష్ణ దెబ్బకు భయంతో బెదిరిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Balakrishna: బాలకృష్ణ దెబ్బకు భయంతో బెదిరిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Balakrishna: నటసింహం బాలయ్య బాబు దెబ్బకు బాలీవుడ్ స్టార్ హీరోకి కూడా చెమటలు పట్టాయి. బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. నీళ్లు నమిలే పరిస్థితి వచ్చిందని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరో? ఏంటా సందర్భం?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 23 2026, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాలయ్య బాబుతో అంత ఈజీ కాదు
Image Credit : aha

బాలయ్య బాబుతో అంత ఈజీ కాదు

నందమూరి నట సింహం బాలయ్య బాబుతో అంత ఈజీ కాదు. సినిమాలే కాదు ఆయన తో ఏదైనా ప్రోగ్రామ్ లో పాల్గొనాలన్నా.. స్టార్స్ కూడా భయపడుతుంటారు. ఆయన ఎప్పుడు ఏమడుగుతాడా అని బెదురుగానే ఎదురుగా కూర్చుంటారు. బాలకృష్ణ హీరోగా సక్సెస్ అయినట్టుగానే హోస్ట్ గా కూడా తన సత్తా చాటాడు. అన్ స్టాపబుల్ షోతో అదరగొట్టాడు. టాలీవుడ్ స్టార్స్.. ఎప్పుడు ఇంటర్వ్యూ ముఖం ఎరగని వారిని కూడా స్టూడియోకు రప్పించాడు. ఈక్రమంలోనే స్టార్ హీరోల, దర్శకుల విషయంలో ఎవరికి తెలియని విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఓ సారి ఇలానే బాలీవుడ్ స్టార్ హీరోను భయపెట్టాడట బాలయ్య. ఆ హీరో ఎవరో కాదు రణ్ బీర్ కపూర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయిన నందమూరి హీరో..
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయిన నందమూరి హీరో..

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన 'అన్‌స్టాపబుల్' టాక్ షో వెనుక ఉన్న ముచ్చట్లు, షోకి సబంధించిన ఆసక్తికరమైన విషయాలను.. రచయిత బి.వి.ఎస్. రవి రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వూలో పంచుకున్నాడు. తెలుగు సినీ రంగంలో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణలో ఈ షో ద్వారా సరికొత్త కోణం బయటపడింది. అయితే.. ఇంటర్వ్యూలో ఇరికించే ప్రశ్నలు వేసినా.. అతిథులకు ఆయన ఇచ్చే గౌరవం మాత్రం ఎవరు మర్చిపోలేరు. తనకంటే చిన్నవారికి కూడా బాలయ్య చాలా మర్యద ఇస్తారు.

36
బాలకృష్ట ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది...
Image Credit : Asianet News

బాలకృష్ట ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది...

అన్‌స్టాపబుల్ షోకి మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి టాలీవుడ్ బిగ్ సూపర్ స్టార్స్ ఎందరో వచ్చారు. స్టార్ హీరోలు మాత్రమే కాకుండా.. చిన్న హీరోలు, ఇతర భాషల నుండి వచ్చే నటులకు కూడా బాలకృష్ణ ఎంతో గౌరవం ఇస్తారని బి.వి.ఎస్. రవి అన్నాడు. ఉదాహరణకు, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ షోకి వచ్చినప్పుడు, బాలయ్య స్వయంగా "నేనే నీ క్యారవాన్‌కు వస్తాను" అని చెప్పడంతో దుల్కర్ ఎంతో కంగారు పడిపోయారు. అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి, ఏమాత్రం ఈగో లేకుండా ఇతరుల క్యారవాన్‌లోకి వెళ్లి, సరదాగా మాట్లాడి ఫ్రెండ్‌షిప్ క్రియేట్ చేసుకోవడం బాలయ్య మార్క్ ప్రత్యేకత అని తెలిపారు.

46
రణబీర్ కపూర్ కి బాలయ్య షాక్
Image Credit : aha

రణబీర్ కపూర్ కి బాలయ్య షాక్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఈ షోకి వచ్చినప్పటి సంఘటనను బి.వి.ఎస్. రవి చాలా ఆసక్తికరంగా వివరించారు. షో షూటింగ్ సమయంలో బాలయ్య గారు రణబీర్‌ని చూసి, "నేను మీ తాతగారి గురించి అడుగుతాను" అని ముందే చెప్పారు. పాపులర్ హిందీ మూవీ 'మొఘల్-ఎ-ఆజమ్' (Mughal-e-Azam) సినిమాను ప్రస్తావిస్తూ "నువ్వేమో దిలీప్ కుమార్, నేనేమో మీ తాత పృథ్వీరాజ్ కపూర్" అని బాలయ్య సరదాగా అన్నారు. అంతేకాకుండా, ఆ సినిమాలో పృథ్వీరాజ్ కపూర్ గారి డైలాగ్‌ను బాలయ్య గారు టకటకటక చెప్పేసి, "ఇప్పుడు నువ్వు చెప్పగలవా?" అని రణబీర్ కపూర్‌ను అడిగారు.

56
భయంతో రణ్ బీర్ ఏం చేశాడంటే?
Image Credit : aha

భయంతో రణ్ బీర్ ఏం చేశాడంటే?

బాలయ్య అలా అనగానే, రణబీర్ కపూర్ బిత్తరపోయి, వెనక ఉన్న బి.వి.ఎస్. రవి దగ్గరకు వచ్చి హిందీలో "సర్ నే పూఛా కి క్యా చల్ రహా హై, మేనే తో నహీ దేఖా, మే తో మేనేజ్ కర్తా హూ..." (బాలయ్య గారు సినిమా గురించి అడుగుతున్నారు, నేను సరిగ్గా చూడలేదు, ఏదోలా మేనేజ్ చేస్తాను) అని కంగారుపడ్డారట. బాలకృష్ణకి భారతీయ సినిమా చరిత్ర, పాత సినిమాలపై ఉన్న అపారమైన జ్ఞాపకశక్తి, పట్టు చూసి రణబీర్ కపూర్ షాక్ అయ్యారని బి.వి.ఎస్. రవి నవ్వుతూ చెప్పుకొచ్చారు

66
అభిమానుల్లో ఆనందం..
Image Credit : aha

అభిమానుల్లో ఆనందం..

తన వద్దకు వచ్చిన అతిథులను ఎంతగానో ఆప్యాయంగా పలకరించడం, వారితో ఆత్మీయంగా మెలగడం, సినిమా విషయాలపై బాలయ్యకు ఉన్న జ్ఞానం 'అన్‌స్టాపబుల్' షోను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి. బి.వి.ఎస్. రవి చెప్పిన ఈ మాటలకు బాలయ్య అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మంచి మనసు మా బాలయ్యది అని కామెంట్లు చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abbayigaru Movie Review: కృష్ణ మనసుపడ్డ సినిమా.. వెంకటేష్ చేతికి ఎలా వెళ్లింది, అబ్బాయిగారు మూవీ రివ్యూ
Recommended image2
Chiranjeevi: నాకు కులపిచ్చి ఉంటే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యేవాడు కాదు.. సీనియర్‌ హీరో సంచలన వ్యాఖ్యలు
Recommended image3
6 రూపాయల రెమ్యునరేషన్‌తో 100 కోట్లకుపైగా ఆస్తులు సంపాదించిన నవ్వుల రారాజు
Related Stories
Recommended image1
Paradise Review: ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ.. నాని సినిమాలో హైలెట్స్ ఇవే, మైనస్ ఏంటంటే?
Recommended image2
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved