MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?

Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?

చిరంజీవి నటించిన ఓ క్రేజీ మూవీ నాగార్జున సినిమా వల్ల డిజాస్టర్ అయింది. ఆ తర్వాత దర్శకుడికి, చిరంజీవికి మధ్య విభేదాలు పెరిగాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఆ దర్శకుడు ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 23 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి రాకముందే దాసరి నారాయణ రావు టాలీవుడ్ తిరుగులేని స్టార్ డైరెక్టర్. చిరంజీవి, దాసరి మధ్య బంధుత్వం కూడా ఉంది. కానీ చిరంజీవి వచ్చి స్టార్ గా ఎదిగిన చాలా ఏళ్ళ వరకు వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. కానీ చివరికి దాసరి నారాయణ రావు తన 100వ సినిమాని చిరంజీవితో తీయాలని నిర్ణయించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లంకేశ్వరుడు మూవీ
Image Credit : Asianet News

లంకేశ్వరుడు మూవీ

ఆ విధంగా చిరంజీవి, దాసరి కాంబోలో 1989లో లంకేశ్వరుడు మూవీ వచ్చింది. ఆ సినిమాలో పాటలు, చిరంజీవి డ్యాన్సులు హైలెట్.. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చిరంజీవి ముందే ఊహించారట. ఆ సినిమా ఫ్లాప్ కి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి అని సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

35
రెండు కారణాల వల్ల లంకేశ్వరుడు ఫ్లాప్
Image Credit : X

రెండు కారణాల వల్ల లంకేశ్వరుడు ఫ్లాప్

మొదటి కారణం దాసరి నారాయణ రావు ఆ టైంకి దర్శకుడిగా అప్ డేట్ కావడం ఆపేశారు. ఆయన సినిమాల్లో హెవీ సెంటిమెంట్, డ్రామా రొటీన్ గా ఉంటాయి. అలాంటి కథతోనే లంకేశ్వరుడు మూవీ తెరకెక్కించారు. దీనితో జనాలకు ఆ సినిమా అంతగా ఎక్కలేదు. మరో కారణం.. లంకేశ్వరుడు రిలీజ్ కి కొన్ని వారాల ముందు నాగార్జున శివ చిత్రం రిలీజ్ అయింది. లంకేశ్వరుడు అవుట్ డేటెడ్ మూవీ కాగా.. శివ మాత్రం టాలీవుడ్ కి బెంచ్ మార్క్ సినిమాగా నిలిచింది.

45
రాజకీయ పరిణామాలు
Image Credit : Asianet News

రాజకీయ పరిణామాలు

శివ సృష్టించిన హోరులో లంకేశ్వరుడు మూవీ నిలబడలేదు. లంకేశ్వరుడు సినిమా వల్ల దాసరి, చిరంజీవి మధ్య విభేదాలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. చిరంజీవి, దాసరి మధ్య విభేదాలకు కారణం లంకేశ్వరుడు మూవీ కాదు అని.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అని జర్నలిస్ట్ శ్రీకాంత్ తెలిపారు.

55
చిరంజీవికి వ్యతిరేకంగా సినిమా
Image Credit : Asianet News

చిరంజీవికి వ్యతిరేకంగా సినిమా

1991 నుంచి చిరంజీవిని రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయడానికి దాసరి ప్రయత్నించడం మొదలు పెట్టారు. తద్వారా చిరంజీవి తనకి రాజకీయాల్లో సపోర్ట్ గా ఉంటారని దాసరి భావించారు. కానీ చిరంజీవి కేరీర్ పీక్ లో ఉన్న టైం లో రాజకీయాల్లో రానని సున్నింతంగా చెప్పారట. ఆ తర్వాత దాసరి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత.. కాంగ్రెస్ లో ఉన్న దాసరి చిరంజీవికి వ్యతిరేకంగా మేస్త్రి అనే సినిమా చేశారు. ఆ టైంలో విభేదాలు మరింత ఎక్కువ అయ్యాయి అని జర్నలిస్ట్ శ్రీకాంత్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved