- Home
- Entertainment
- Vijay Deverakonda : ఇన్ స్టాలో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ.. ఏకంగా బన్నీనే దాటేందుకు లైగర్ దూకుడు..
Vijay Deverakonda : ఇన్ స్టాలో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ.. ఏకంగా బన్నీనే దాటేందుకు లైగర్ దూకుడు..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు సోషల్ మీడియాలో మామూలు క్రేజ్ లేదు. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జునే బీట్ చేసే దిశగా దూసుకెళ్తున్నాడు. రోజురోజుకు విజయ్ ఫాలోవర్స్ కౌంట్ పెరిగిపోతోంది.

యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన తొలిసినిమా ‘పెళ్లి చూపులు’తో తెలుగు ఆడియెన్స్ కు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకోవడంతో విజయ్ కి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత ‘ద్వారకా’ చిత్రంలో నటించి మెప్పించాడు.
మూడో చిత్రం ‘అర్జున్ రెడ్డి’ Arjun Reddyతో ఒక్కసారిగా టాలీవుడ్ ను తనపైపు తిప్పకున్నాడీ రౌడీ హీరో. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరెకిక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా ఎంతంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతోనే విజయ్ కేరీర్ కు గట్టి బ్రేక్ వచ్చింది.
ఇక అర్జున్ రెడ్డి తర్వాత వెనుదిరిగి చూడని విజయ్ .. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్నాడు. ఏకంగా ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ సంస్థ ‘థంమ్స్ అప్’ (Thumps Up) కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోవడం గొప్ప విషయం. ఇలా తన క్రేజ్ ను సినిమా సినిమాకు పెంచేస్తున్నాడు.
అప్పట్లో కొంచెం స్టోరీల పరంగా కస్తా తడబడినా.. ప్రస్తుతం చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఆచీతూచి అడుగులేస్తున్నారు. సినిమా కోసం టోటల్ మేక్ ఓవరే మార్చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు విభిన్న పాత్రలను ఎంచుకుంటూ సవాళ్లతో కూడిన సినిమాలు చేస్తున్నారు.
మరోవైపు, సోషల్ మీడియాలోనూ విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. ఏకంగా బన్నీ ఇన్ స్టా ఫ్యామిలీనే బీట్ చేసే దిశగా అడుగులేస్తున్నాడీ రౌడీ హీరో. తాజాగా ఇన్ స్టాలో 15 మిలియన్ ఫాలోవర్స్ ను రీచ్ అయ్యాడు. మూడు నెలల్లోనే దాదాపుగా 4 మిలియన్ల ఫాలోవర్స్ ను తనవైపు తిప్పుకున్నాడు విజయ్.
అయితే మూడు నెలల కింద బన్నీ 15 మిలియన్ ఫాలోవర్స్ ను రీచ్ అయ్యడు. అప్పుడు విజయ్ 11 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. పుష్ప (Pushpa) తర్వాత బన్నీ ఫాలోవర్స్ కౌంట్ 18 మిలియన్ కు చేరుకుంది. ‘లైగర్’ అనౌన్స్ మెంట్ తో విజయ్ దేవరకొండ తాజాగా 11 నుంచి 15 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకున్నాడు. ఇక ఆగస్టులో Liger రిలీజ్ తర్వాత ఈజీగా బన్నీని దాటేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.