MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే

Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే

నటుడు ప్రిన్స్ సెసిల్ తన ప్రియురాలు సాయి మాచిరాజును న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 24 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటుడు ప్రిన్స్ వివాహం
Image Credit : Asianet News

నటుడు ప్రిన్స్ వివాహం

నటుడు ప్రిన్స్ సెసిల్ తన చిరకాల ప్రియురాలు సాయి మాచిరాజును వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక న్యూజిలాండ్‌లో ఆదివారం ఆగస్టు 23న జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తెలుగు సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకను నిర్వహించినట్లు సమాచారం. సన్నిహితుల మధ్య ఎంతో ప్రైవేట్‌గా ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
న్యూజిలాండ్‌లో వివాహ వేడుక
Image Credit : Asianet News

న్యూజిలాండ్‌లో వివాహ వేడుక

ప్రిన్స్ సెసిల్, సాయి మాచిరాజు ఈ ఏడాది ప్రారంభంలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రిన్స్ సెసిల్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేస్తూ వెల్లడించారు. అప్పటి నుంచి వీరి వివాహం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. తాజాగా న్యూజిలాండ్‌లో వీరి వివాహం జరగడంతో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సాయి మాచిరాజు న్యూజిలాండ్‌లో ఉంటున్నట్లు సమాచారం. దీంతో అక్కడే వివాహ వేడుక నిర్వహించుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Related image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
35
నీకు నాకు డాష్ డాష్ సినిమాతో ఎంట్రీ
Image Credit : Asianet News

నీకు నాకు డాష్ డాష్ సినిమాతో ఎంట్రీ

ప్రిన్స్ సెసిల్ 2012లో దర్శకుడు తేజ తెరకెక్కించిన నీకు నాకు డాష్ డాష్ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత బస్ స్టాప్, బన్నీ ఎన్ చెర్రీ వంటి సినిమాల్లో హీరోగా నటించారు. అనంతరం ఆయన ప్రధాన పాత్రలతో పాటు సహాయ నటుడిగా, సెకండ్ లీడ్ పాత్రల్లోనూ కనిపించారు. విభిన్న తరహా పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా కెరీర్‌లో ఒక్కో దశలో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు.

45
బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో..
Image Credit : Asianet News

బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో..

ప్రిన్స్ సెసిల్ కెరీర్‌లో పలు సినిమాల్లో ఆయన చేసిన సహాయ పాత్రలు కూడా గుర్తింపు తెచ్చుకున్నాయి. మిస్టర్, నేను శైలజ, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో కనిపించారు. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా ఆయన సందడి చేశారు. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. నటుడిగా సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రిన్స్ సెసిల్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

55
అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదే
Image Credit : Asianet News

అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదే

ప్రిన్స్ సెసిల్, సాయి మాచిరాజు వివాహ వేడుకకు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగడం విశేషంగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దీంతో ప్రిన్స్ సెసిల్ అభిమానులు, సినీ వర్గాల నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిన్స్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు సాయి ప్రతిమ మాచిరాజు. వీరి కుటుంబం న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. రమేష్, లక్ష్మీ సుజాతాల కుమార్తె సాయి ప్రతిమ. ఓ కామన్ ఫ్రెండ్ వివాహంలో ప్రిన్స్, సాయి ప్రతిమ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లారు. సోషల్ మీడియాలో ప్రిన్స్, సాయి ప్రతిమ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Related Stories
Recommended image1
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved