MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్

Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్

ఎక్కువగా పాపులర్ కాకపోయినా, ఒకసారి చూడటం మొదలుపెడితే చివరి వరకు ఉత్కంఠతో కూర్చోబెట్టే 5 అద్భుతమైన మిస్టరీ సినిమాలు ఇవి. ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ ప్లాట్‌తో మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 24 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1. కోహెరెన్స్ (Coherence)
Image Credit : coherencemovie Instagram Page

1. కోహెరెన్స్ (Coherence)

ఒక తోకచుక్క భూమిని దాటి వెళ్తున్న రాత్రి, కొందరు స్నేహితులు డిన్నర్‌కు కలుస్తారు. ఉన్నట్టుండి కరెంట్ పోతుంది. ఆ తర్వాత వాళ్ల చుట్టూ జరిగే వింత సంఘటనలు కథను ఊహించని మలుపు తిప్పుతాయి. 'అసలు ఏది నిజం?' అని చివరి వరకు ఆలోచింపజేసే సైన్స్-ఫిక్షన్ మిస్టరీ ఇది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2. ది బాడీ (The Body)
Image Credit : thebodymovie Instagram Page

2. ది బాడీ (The Body)

ఒక మహిళ మృతదేహం మార్చురీ నుంచి అకస్మాత్తుగా మాయమవుతుంది. పోలీసులు విచారణ మొదలుపెట్టగానే, ఆ మహిళ భర్తపై అనుమానం పెరుగుతుంది. దొరికే ప్రతి క్లూ, అంతకుముందు దొరికిన సమాచారాన్నే తప్పు అనిపించేలా చేస్తుంది. చివరి వరకు నిజాన్ని దాచిపెట్టే స్పానిష్ థ్రిల్లర్ ఇది.

35
3. ఫర్గాటెన్ (Forgotten)
Image Credit : remnantglimpse Instagram Page

3. ఫర్గాటెన్ (Forgotten)

కిడ్నాప్ అయిన అన్నయ్య 19 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. కానీ, అతను తిరిగొచ్చాక అతని ప్రవర్తనలో ఏదో తేడా ఉందని తమ్ముడు గమనిస్తాడు. ఆ తర్వాత కుటుంబంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మీరు ఊహించేదానికి పూర్తి భిన్నంగా కథను మలుపు తిప్పే కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ ఇది.

45
4. ది వాస్ట్ ఆఫ్ నైట్ (The Vast of Night)
Image Credit : realadamwhite Instagram Page

4. ది వాస్ట్ ఆఫ్ నైట్ (The Vast of Night)

ఇది 1950ల నాటి అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో జరిగే కథ. రాత్రిపూట ఒక రేడియో DJ, ఒక టెలిఫోన్ ఆపరేటర్ ఇద్దరూ ఇంతకు ముందెన్నడూ వినని ఒక రహస్యమైన సౌండ్ ఫ్రీక్వెన్సీని కనుగొంటారు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? దాని వెనుక ఏముంది? అనే ప్రశ్నలతో నెమ్మదిగా ఉత్కంఠను పెంచే విభిన్నమైన సైన్స్-ఫిక్షన్ మిస్టరీ సినిమా ఇది.

55
5. ది ఎండ్‌లెస్ (The Endless)
Image Credit : theendlessmovie Instagram Page

5. ది ఎండ్‌లెస్ (The Endless)

చిన్నప్పుడు ఒక రహస్యమైన గ్రూప్ నుంచి తప్పించుకున్న ఇద్దరు అన్నదమ్ములకు, చాలా ఏళ్ల తర్వాత ఆ గ్రూప్ నుంచి ఒక వీడియో టేప్ వస్తుంది. దాంతో వాళ్లు మళ్లీ అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని విషయాలకు అసలు సాధారణమైన వివరణే దొరకదు. UFO, కల్ట్, టైమ్ లూప్ వంటి ఎన్నో మిస్టరీలను కలిపి ఒక వింత అనుభూతిని ఇచ్చే సినిమా ఇది.

ఈ 5 సినిమాల్లో ఒక కామన్ పాయింట్!

ఈ సినిమాల్లో చాలా వరకు మామూలుగా 'హీరో విలన్‌ను వెతుక్కుంటూ వెళ్లే' ఫార్ములాలో ఉండవు. ప్రతి సినిమా ప్రేక్షకుల్లోనే ప్రశ్నలు రేకెత్తిస్తుంది. మనకు దొరికే చిన్న చిన్న క్లూస్‌తో మనమే మిస్టరీని అర్థం చేసుకునేలా చేస్తాయి.

అందుకే, ట్విస్ట్ ఏంటో ముందే తెలిసిపోకుండా చూడాలనుకుంటే, ఈ సినిమాల కథ గురించి గూగుల్‌లో వెతక్కుండా నేరుగా చూడటమే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్!

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Related Stories
Recommended image1
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved