MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?

Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?

Venu Swamy: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రెటీ స్టేటస్ ఉన్న జ్యోతిష్యులలో వేణు స్వామి ఒకరు. సినిమా వాళ్ల జాతకాలపై సంచలన కామెంట్స్ చేసి.. వివాదాస్పదం అయిన వేణు స్వామి.. జాతకం చెప్పినందకు ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? వేణు స్వామి స్వయంగా ఏం చెప్పారంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 01 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సినిమా జ్యోతిష్యుడిగా పేరు..
Image Credit : Facebook/Venu Swamy

సినిమా జ్యోతిష్యుడిగా పేరు..

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, సినిమా ముచ్చట్లకు ఎంత క్రేజ్ ఉందో.. సెలబ్రిటీల జాతకాలపై వచ్చే వార్తలకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి చెప్పే జోస్యాలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. గతంలో ఆయన చెప్పిన కొన్ని జాతకాలు నిజం కావడంతో, ఈయన చేసే వ్యాఖ్యలపై అందరు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఈమధ్య సినిమావాళ్ల జాతకాల గురించి కామెంట్స్ మానేశాడు వేణు స్వామి. స్టార్స్ పర్సనల్ లైఫ్ పై వాఖ్యలు చేసి కేసలు ఫేస్ చేసిన ఆయన కామ్ అయ్యాడు. చాలా కాలం సైలెంట్ గా ఉన్న వేణు స్వామి.. ఈమధ్య కాలంలో మళ్లీ కాంట్రవర్సీలను కదిలిస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేణు స్వామి ఎంత ఫీజు తీసుకుంటాడు?
Image Credit : Facebook/Venu Swamy

వేణు స్వామి ఎంత ఫీజు తీసుకుంటాడు?

సినిమా వాళ్లకు.. ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువగా జాతకాలు చెపుతూ.. హోమాలు పూజలు చేయించే వేణుస్వామి.. సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంత పేరున్న ఆయన జాతకం చెపితే ఎంత తీసుకుంటాడన్న అనుమానం చాలామందిలో ఉంది. కొంత మంది జనాల్లో వేణు స్వామి జాతకం చెప్పడానికి లక్షల రూపాయలు వసూలు చేస్తారనే ప్రచారం ఉంది. అయితే, ఈ అపోహను ఆయన పూర్తిగా ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద జ్యోతిష్యులు రూ. 50,000, రూ. 30,000 తక్కువలో తక్కువగా రూ. 16,000 వరకు వసూలు చేస్తుంటే, తాను మాత్రం కేవలం రూ. 6,000 మాత్రమే తీసుకుంటానని వేణుస్వామి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా తన ఫీజులో ఎలాంటి మార్పు లేదని, కిందటి నుంచి చూస్తే అత్యంత తక్కువ ఫీజు తీసుకునే జ్యోతిష్యులలో తాను నాలుగో స్థానంలో ఉంటానని ఆయన చెప్పారు.

34
ఆర్థిక స్థోమతను బట్టే పూజల నిర్ణయం
Image Credit : Facebook/Venu Swamy

ఆర్థిక స్థోమతను బట్టే పూజల నిర్ణయం

పూజలు చేయడం విషయంలో తాను ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తానని వేణు స్వామి అన్నారు. వ్యక్తి ఆర్థిక స్థితిని బట్టి పూజల ఖర్చు నిర్ణయిస్తారు. రూ. 100 కోట్లు లేదా రూ. 10 కోట్లు ఉన్నవారికి రూ. 5 లక్షల పూజలు సూచిస్తే, ఆర్థికంగా అంత వెసులుబాటు లేని వారికి అందుబాటులో ఉండే పూజలను మాత్రమే సూచిస్తారు. ఎక్కువగా శ్రీకాళహస్తి, త్రయంబకేశ్వర్, తిరునల్లారు, కామాఖ్య వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోనే ఆయన పూజలు చేయిస్తానని చెప్పారు. కష్టాల్లో ఉన్న వ్యక్తిని ముందుగా ఒడ్డున పడేసి, నిలబెట్టి, నడిపించి, వారు ఆర్థికంగా స్థిరపడిన (సెట్ అయిన) తర్వాతే పెద్ద పూజల జోలికి వెళ్తానని వేణు స్వామి అన్నారు.

44
నెగిటివ్ ప్రెడిక్షన్స్ - ప్రిఫరెన్స్
Image Credit : Venu Swamy\Twitter

నెగిటివ్ ప్రెడిక్షన్స్ - ప్రిఫరెన్స్

జాతకంలో ఉన్న చేదు నిజాలను లేదా ప్రతికూల ఫలితాలను (నెగిటివ్) స్పష్టంగా చెప్పడం వల్ల తనపై కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, నిజాయితీగా ఉండటానికే తాను ప్రాధాన్యం ఇస్తానని ఆయన వివరించారు. దీనిని ఒక ఉదాహరణతో ఆయన సమర్థించుకున్నారు. క్యాన్సర్ లక్షణాలతో వచ్చిన రోగికి రోగం లేదని అబద్ధం చెప్పడం కంటే, ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పి దానికి తగిన చికిత్స మార్గాన్ని (రెమిడీ) సూచించడమే జ్యోతిష్యుడి బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved