MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Krishna: తనకంటే 15 ఏళ్లు పెద్దవాడైన కృష్ణకు జంటగా నటించడంతో పాటు.. అమ్మ నాన్నమ్మ పాత్రల్లో కూడా కనిపించింది ఓ హీరోయిన్. 23 ఏళ్ల యంగ్ ఏజ్ లో ఇంత సాహసం ఆమె ఎలా చేయగలిగింది.?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 30 2026, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
23 ఏళ్ల వయసులో హీరోకి నానమ్మగా నటించిన హీరోయిన్!
Image Credit : Asianet News

23 ఏళ్ల వయసులో హీరోకి నానమ్మగా నటించిన హీరోయిన్!

ఈ కాలంలో హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా గ్లామర్ రోల్స్ చేయడానికే ఇష్టపడుతున్నారు. "సీనియర్ హీరోల పక్కన హీరోయిన్లుగా నటిస్తాం కానీ, తల్లి పాత్రలు లేదా క్యారెక్టర్ రోల్స్ చేయం" అని స్పష్టం చేస్తున్నారు. నయనతార, త్రిష, సమంత లాంటి 40 ఏళ్ల తారలంతా ఇప్పటికీ హీరోయిన్లుగా మంచి ఫామ్‌ను మెయింటేన్ చేస్తున్నారు.

కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. నటీమణులు పాత్రను పండించడం కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడేవారు కాదు. 23 ఏళ్ల యంగ్ హీరోయిన్, తనకంటే 15 ఏళ్లు పెద్దవాడైన సూపర్ స్టార్ కృష్ణకు తల్లిగా, ఏఎన్నార్‌కి నానమ్మగా కనిపించిందంటే నమ్ముతారా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు... సహజనటి జయసుధ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సహజనటిగా ప్రత్యేక గుర్తింపు
Image Credit : Asianet News

సహజనటిగా ప్రత్యేక గుర్తింపు

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని 'సహజనటి'గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన నటి జయసుధ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభంలో చేసిన సాహసాల గురించి, ఎంచుకున్న పాత్రల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి చిన్న వయస్సులోనే పెద్ద వయసు ఉన్న పాత్రలు పోషించడానికి గల కారణాలను ఆమె వెల్లడించారు.

35
చిన్న వయసులోనే పెద్ద వయసు పాత్రల సాహసం
Image Credit : Telugu Movie Bazaar / YouTube Channel

చిన్న వయసులోనే పెద్ద వయసు పాత్రల సాహసం

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వయోవృద్ధుల పాత్రలు చేయడానికి సందేహిస్తుంటారు. కానీ జయసుధ గారు మాత్రం కేవలం 23 ఏళ్ల వయస్సులోనే అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'శక్తి' సినిమాలో ఆమె ఆయనకు జోడీగా నటించడమే కాకుండా, అదే సినిమాలో ఆయనకు తల్లి పాత్రను కూడా పోషించారు. 'మదర్ ఇండియా' చిత్ర స్ఫూర్తితో రూపొందించిన ఆ సన్నివేశాల కోసం ధరించిన విగ్, మేకప్ ఆ రోజుల్లో కొంచెం భయానకంగా అనిపించినప్పటికీ, కథ డిమాండ్ మేరకు ఆమె ఆ పాత్రను ఎంతో ఆత్మవిశ్వాసంతో చేశారు.

45
ఏఎన్నార్‌కి నానమ్మగా...
Image Credit : Pinterest

ఏఎన్నార్‌కి నానమ్మగా...

కేవలం కృష్ణ గారి సినిమానే కాకుండా, నటరత్న అక్కినేని నాగేశ్వరరావు (ANR)తో 'జస్టిస్ చక్రవర్తి' వంటి చిత్రంలో ఆయనకు తల్లిగా, నానమ్మ పాత్రలో కూడా నటించిన జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు. "నాకు 22 లేదా 23 ఏళ్లు ఉన్నప్పుడే 80 ఏళ్ల నానమ్మ పాత్ర చేశాను. సినిమాలో నేను హీరోయిన్‌గా ఉన్నానా లేదా నా వయస్సు ఎంత అనేది నాకు ఎప్పుడూ సమస్య కానే కాదు" అని జయసుధ స్పష్టం చేశారు. పాత్ర యొక్క ప్రాధాన్యతనే తప్ప వయస్సుతో తనకు సంబంధం లేదనే దృక్పథం ఆనాడే ఆమెకు ఉండటం విశేషం.

55
పాత్రల ఎంపిక చాలా ముఖ్యం
Image Credit : Instagram/Jayasudha

పాత్రల ఎంపిక చాలా ముఖ్యం

తన కెరీర్ ప్రారంభంలో పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా (Choosy) ఉండేదాన్ని అని జయసుధ తెలిపారు. అయితే కొన్నిసార్లు పరిచయాలు, ఆబ్లిగేషన్స్ లేదా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పుడు పెద్ద స్టార్ల పక్కన కేవలం గ్లామరస్ హీరోయిన్ పాత్రలు చేయాల్సి వచ్చిందని అంగీకరించారు. అయినప్పటికీ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పుడు చాలావరకు మంచి పాత్రలే లభించడం తన అదృష్టమని ఆమె అన్నారు.

స్క్రిప్ట్ విషయంలో ఆమెకు స్పష్టమైన సూత్రాలు ఉండేవి. తనకు నచ్చని, చౌకబారు డైలాగులు ఉంటే వాటిని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేకుండా రిజెక్ట్ చేసేవారు జయసుధ. పాత్ర పట్ల లేదా సన్నివేశం పట్ల తనకు పూర్తి నమ్మకం కుదిరితేనే కెమెరా ముందుకు వచ్చేవారని ఆమె తెలిపారు. ఈ విధమైన క్రమశిక్షణ, వృత్తిపరమైన విలువల వల్లే ఆమె సుదీర్ఘ కాలం పాటు సినీ పరిశ్రమలో కొనసాగగలిగారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
కృష్ణ ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
Toxic day 4 Collections: 300 కోట్లకు చేరువలో టాక్సిక్.. నాలుగో రోజు యశ్ సినిమాకు గట్టి దెబ్బ.. ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved