MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్ ని దూరం పెడుతున్న వేద.. కీలక సాక్షాలను సంపాదించిన లాయర్ ఝాన్సీ?

Ennenno Janmala Bandham: యష్ ని దూరం పెడుతున్న వేద.. కీలక సాక్షాలను సంపాదించిన లాయర్ ఝాన్సీ?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 23 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 23 2022, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో వేద, యష్ కోసం భోజనం తీసుకుని వస్తుంది. వేదని చూసిన యష్ రా వేద అని అనగా అప్పుడు వేద అత్తయ్య గారు మీకోసం లంచ్ పంపించారు అని అంటుంది. థాంక్స్ లేదా సరే కూర్చో ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని అనడంతో లేదు నేను క్లినిక్ కి వెళ్తున్నాను అని అంటుంది వేద. ఆ తర్వాత వేద అత్తయ్య గారితో మధ్యాహ్నం ఒకసారి భోజనం చేసి మాట్లాడండి చాలా బాధపడుతున్నారు మీ విషయంలో అని అక్కడి నుంచి వెళ్తుండగా ఇంతలో వేద అని పిలుస్తాడు. అప్పుడు యష్ అసలు విషయం చెప్పబోతుండగా వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వెనకాలే వెళ్లి యష్ ఏంటి నువ్వు చేస్తున్న పని అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మాళవిక విషయంలో ఏం చేశావు అని అనడంతో తప్పు చేసినవారికి శిక్ష పడాలి కదా అనడంతో నేను నిన్ను రిక్వెస్ట్ చేశాను కదా ఎందుకు అంత తొందర పడ్డావు అని అంటాడు యష్. నన్ను ఒక మాట కూడా అడగకుండా ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు వేద అని అనడంతో అదే మాట నేను నిన్ను తిరిగి అడిగితే నువ్వు ఏం సమాధానం చెబుతావు నాది అదే సమాధానం మిస్టర్ యశోదర్ అని అంటుంది వేద. మీరు నిర్ణయం తీసుకోవచ్చు నేను నిర్ణయం తీసుకోకూడదా. నేను మిమ్మల్ని నమ్మాను. మీరు నన్ను నమ్మారా అని నిలదీస్తుంది వేద. నేను మీతో నిజాయితీగా ఉన్నాను కానీ మీరు మాత్రం నాతో నిజం దాచి పెట్టారు అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద.

36

తప్పుడు పనిచేసిన దానిని రక్షిస్తాను అంటే నేను ఊరికే ఉంటాననుకుంటున్నారా అని అక్కడి నుంచి వేదా వెళ్లిపోతుంది. ఆ తర్వాత మాళవిక వెళుతుండగా వసంత్ అడ్డుపడతాడు. మళ్లీ కొత్త డ్రామాలు మొదలు పెట్టావు నీకు ఏం పని ఉంది మాళవిక అని అడగడంతో నీకు అడిగే హక్కు లేదు వసంత నీ పని నువ్వు చూసుకో ఇది నా మొగుడు ఆఫీస్ ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను అని అంటుంది మాళవిక. నీకు మైండ్ పని చేయనట్టుంది నువ్వు రిజెక్టెడ్ వైఫ్ వి. ఇప్పుడు మా వదిన డాక్టర్ వేదస్విని అని అంటాడు వసంత్. మా వదిన కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నావు అని వసంత్ అనడంతో జస్ట్ స్టాపిడ్  అని సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాళవిక.
 

46

ఆ తర్వాత మాళవిక వేద ఇద్దరూ అనుకోకుండా లిఫ్టులో కలుస్తారు. అప్పుడు వారిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ వాదించుకుంటూ ఉండగా ఇంతలోనే లిఫ్ట్ అనుకోకుండా ఆగిపోతుంది. అప్పుడు లిఫ్ట్ ఆగిపోవడంతో మాళవిక వేద మీద సీరియస్ అవుతూ ఉంటుంది. అప్పుడు హలో హెల్ప్ చేయండి అని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత మాళవిక వేద ఇద్దరూ వసంత్ కి ఫోన్ చేసి లిఫ్ట్ ఆగిపోయింది అని చెబుతారు. అప్పుడు వేదతో మాళవిక ఛాలెంజ్ చేస్తూ నన్ను ఈ కేసులో గెలిపించేది నీ మొగుడు కాని మొగుడు అని అంటుంది. ఇప్పుడు మాళవిక కు తగిన విధంగా బుద్ధి చెబుతుంది వేద. ఇంతలోనే అక్కడికి యష్,వసంత్ వస్తారు.
 

56

అప్పుడు యష్ ఆరాటపడుతూ రా వేద దిగు అని అనడంతో వసంత్ సహాయంతో కిందికి దిగుతుంది వేద. తర్వాత వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వసంత్ వదిన నువ్వు టెన్షన్ పడకు మేమంతా మీ వైపే ఉన్నాము అని అంటాడు. ఎప్పుడు యష్ కి సపోర్ట్ చేస్తే నేను ఈ విషయంలో మాత్రం నేను మీ వైపు ఉన్నాను మీరు భయపడకండి వదిన అని అంటాడు వసంత్. మరొకవైపు యష్ వేద చేసిన విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు కార్ లో వెళ్తున్న వేద ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు వేద లాయర్ జాన్సీ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అవతల పార్టీ వారు సిసి ఫుటేజ్ ను మాయం చేసి ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు లేకుండా చేయాలని చూశారు కానీ నేను నా ఇన్వెస్టిగేషన్ లో చాలా ఆధారాలను సంపాదించాను.
 

66

రేపు కోర్టులో వాళ్లకి ఊహించని షాక్ ఇస్తాను అనడంతో వేద సంతోష పడుతూ ఉంటుంది. ఇప్పుడు వేద ఎట్టి పరిస్థితుల్లో నిందితుడు తప్పించుకోకూడదు కచ్చితంగా గెలవాలి అని అంటుంది. మరొకవైపు యష్ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసంత్ వస్తాడు. నీ ప్రవర్తన నీ మాట తీరు నాకేమీ నచ్చట్లేదు యష్ అని అంటాడు. మరొకవైపు చిత్ర దగ్గరికి వెళ్లిన వేద స్వారీ నీ మాట నేను వినలేదు చిత్ర అని అంటుంది. మరొకవైపు వసంత్ వేద గురించి గొప్పగా పొగుడుతూ మీరిద్దరూ సీతారాములు ఇలా చేయడం కరెక్ట్ కాదు యష్ అని అంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image3
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved