MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ హీరోకి దక్కాల్సిన సూపర్ హిట్ చిత్రాలు నితిన్, చైతు, నాని చేతుల్లోకి..కెరీర్ నాశనం కావడానికి తండ్రే కారణమా?

ఆ హీరోకి దక్కాల్సిన సూపర్ హిట్ చిత్రాలు నితిన్, చైతు, నాని చేతుల్లోకి..కెరీర్ నాశనం కావడానికి తండ్రే కారణమా?

హ్యాపీ డేస్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో యంగ్ ప్రామిసింగ్ హీరోగా అనిపించాడు. అందుకు తగ్గట్లుగానే వరుణ్ సందేశ్ వరుస సూపర్ హిట్స్ కొట్టాడు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 13 2024, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హ్యాపీ డేస్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో యంగ్ ప్రామిసింగ్ హీరోగా అనిపించాడు. అందుకు తగ్గట్లుగానే వరుణ్ సందేశ్ వరుస సూపర్ హిట్స్ కొట్టాడు. కొత్త బంగారు లోకం చిత్రం ఎమోటినల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా విజయం సాధించింది. కుర్రాడు లాంటి చిత్రాలు బాగానే రాణించాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వరుణ్ సందేశ్ ఎదిగేందుకు ఫ్లాట్ ఫామ్ సెట్ అయింది. కానీ అదే సమయంలో వరుణ్ సందేశ్ తప్పటడుగులు వేశాడు. దానికి తోడు వరుణ్ సందేశ్ కి అదృష్టం కూడా కలసి రాలేదు. 

37

నాగ చైతన్య సూపర్ హిట్ చిత్రం 100 పర్సెంట్ లవ్ మూవీ ముందుగా వరుణ్ సందేశ్ తో అనుకున్నారట. వరుణ్ సందేశ్ హీరోగా కంఫర్మ్ అయ్యాడు కూడా. కానీ ఊహించని విధంగా నాగ చైతన్య చేతుల్లోకి ఆ చిత్రం వెళ్ళింది. తనని ఎందుకు పక్కన పెట్టారో కూడా వరుణ్ సందేశ్ కి అర్థం కాలేదట. 

47
Akkineni Naga Chaitanya

Akkineni Naga Chaitanya

ఇక వరుణ్ సందేశ్ నటించాల్సిన మరో సూపర్ హిట్ మూవీ గుండె జారి గల్లంతయ్యిందే. ఈ చిత్రం కోసం దర్శకుడు ముందుగా వరుణ్ సందేశ్ నే సంప్రదించారట. కానీ చూస్తే నితిన్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

57

నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు చిత్రం కూడా వరుణ్ సందేశ్ చేయాల్సిన మూవీనే. ఈ మూవీ సూపర్ హిట్ అని చెప్పలేం కానీ.. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం. ఈ మూవీ కూడా వరుణ్ సందేశ్ కి దక్కలేదు. ఇవన్నీ దురదృష్టాలు అయితే స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి. 

67

వరుణ్ సందేశ్ తండ్రి కొడుకు చిత్రాలని మేనేజ్ చేసేవారట. ఆయన పెద్ద డైరెక్టర్ పెద్ద బ్యానర్ అయితే చాలు.. కథ ఎలా ఉన్న పట్టించుకోకుండా ఒప్పుకునేవారట. ఆ విధంగా చాలా బ్యాడ్ మూవీస్ వరుణ్ సందేశ్ కి పడ్డాయి. దీనితో క్రమంగా మార్కెట్ తగ్గుతూ వచ్చింది. వరుణ్ సందేశ్ కెరీర్ ఇలా పడిపోవడానికి కారణం అతడి తండ్రే అని విమర్శలు వస్తున్నాయి కదా.. ఎలా ఫీల్ అవుతున్నారు అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. 

77

అలా ఏమి లేదు.. నేను చేసిన చిత్రాలు వర్కౌట్ కాలేదు అంతే. నాన్న నాకు ఇన్సిపిరేషన్. ఒక వేళ అవే చిత్రాలు బాగా ఆడి ఉంటే.. వరుణ్ సందేశ్ కెరీర్ అతడి తండ్రి వల్లే నిలబడింది అని పొగిడేవారు. ఆ విమర్శలని, ప్రశంసల్ని పట్టించుకోను అని తెలిపాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Recommended image2
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?
Recommended image3
Prithviraj Sukumaran: అఖిల్‌ని ఢీ కొట్టబోతున్న వారణాసి విలన్.. పృథ్వీరాజ్ 'ఐ నోబడీ' రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved