MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?

Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?

రాకింగ్‌ స్టార్‌ యష్‌ తాజాగా `టాక్సిక్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. బుధవారం విడుదలైన ఈ సినిమాకి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. అయినా మొదటి రోజు దుమ్ములేపింది. మరి రెండో రోజు పరిస్థితేంటి?

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 28 2026, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు
Image Credit : X/@KvnProductions ·

రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు

రీమేక్‌ల ఇండస్ట్రీ అనే ముద్ర వేసుకున్న కన్నడ చిత్ర పరిశ్రమ దశ దిశని మార్చేశారు హీరో యష్‌. `కేజీఎఫ్‌`తో ఆయన సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇది ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. `కేజీఎఫ్‌ 2` తర్వాత చాలా సెలక్టీవ్‌గా ఉన్నారు యష్‌. ఏరికోరి `టాక్సిక్‌` మూవీ చేశారు. ఈ సినిమా రిలీజ్‌కావడానికి నాలుగేళ్లు పట్టింది. పలు వాయిదాల అనంతరం ఈ బుధవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మొదటి రోజు దుమ్ములేపింది. కానీ ఓవరాల్‌గా నెగటివ్‌ టాక్‌ ని తెచ్చుకుంది. భారీ అంచనాలతో భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకున్న ఈ సినిమాకి రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా గురువారం కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. దీనికి షాకింగ్‌ కలెక్షన్లు వచ్చాయి. ఇది బాక్సాఫీసు వద్ద భారీగా పడిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాక్సిక్‌ రెండో రోజు కలెక్షన్లు
Image Credit : Asianet News

టాక్సిక్‌ రెండో రోజు కలెక్షన్లు

మొదటి రోజు ఈ మూవీ రూ.140కోట్లు రాబట్టినట్టు ట్రేడ్‌ సైట్లు వెల్లడించాయి. కానీ రూ.150కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. దీంతో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 లిస్ట్ లో టాక్సిక్‌ చేరిపోయింది. ఇంతటి నెగటివ్‌ టాక్‌ మధ్య టాక్సిక్‌కి రెండో రోజు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఈ మూవీ రెండో రోజు ఇండియాలో రూ.36.40కోట్ల నెట్‌ ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.50కోట్ల వరకు రాబట్టింది. దీంతో ఈ మూవీ రెండు రోజుల్లో రూ.190కోట్లు వసూలు చేసింది. ఇండియాలో దీనికి రూ.164.50కోట్ల గ్రాస్‌ రాగా, రూ.137.50కోట్ల నెట్‌ వచ్చింది. రెండో రోజు ఓవర్సీస్‌లో పది కోట్లు కలెక్ట్ చేసింది. అక్కడ రెండు రోజుల్లో రూ.26.25కోట్లు వసూలు చేసింది.

35
65శాతం పడిపోయిన టాక్సిక్‌ రెండో రోజు కలెక్షన్లు
Image Credit : X/@KvnProductions

65శాతం పడిపోయిన టాక్సిక్‌ రెండో రోజు కలెక్షన్లు

రెండో రోజు ఈ మూవీకి తెలుగులో రూ.మూడుకోట్ల నెట్‌ వచ్చింది. హిందీలో రూ.23కోట్లు, కర్నాటకలో దారుణంగా కేవలం రూ.8.50కోట్లు మాత్రమే వచ్చాయి. కేరళాలో నలభై లక్షలు, తమిళంలో కోటిన్నర వచ్చాయి. అయితే ఓవరాల్‌ కలెక్షన్లలో మొదటి రోజుతో పోల్చితే 65శాతం డ్రాప్‌ కనిపించడం షాకిస్తోంది. సాధారణంగా ఒక సినిమా రెండో రోజు 30-40శాతం డ్రాప్‌ కనిపిస్తుంది. యాభై శాతం దాటిందంటే అది పెద్ద డ్రాప్‌ అనే చెప్పాలి. కానీ ఇది 65శాతం పడిపోవడం షాకిస్తోంది. ఇది సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పొచ్చు. భారీ నెగటివ్‌ టాక్‌ దీనిపై ప్రభావం పడిందని ఈ కలెక్షన్లని చూస్తుంటే అర్థమవుతుంది. మరి శుక్రవారం కలెక్షన్లు పెరుగుతాయా? మరీ పడిపోతాయా? అనేది ఆసక్తికరం. పెరిగితే సినిమాకి ఊపిరి పోసినట్టే అవుతుంది. పడిపోయిందంటే డిజాస్టర్‌ వైపు వెళ్తున్నట్టే అని చెప్పొచ్చు.

45
టాక్సిక్‌ మూవీ బడ్జెట్‌, బిజినెస్‌ లెక్కలు
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌ మూవీ బడ్జెట్‌, బిజినెస్‌ లెక్కలు

ఇక `టాక్సిక్‌` మూవీకి బడ్జెట్‌ ఎంత? థియేట్రికల్ బిజినెస్‌ ఎంత? ఎంత కలెక్ట్ చేస్తే సినిమా నిర్మాత, బయ్యర్లు సేఫ్‌ అనేది చూస్తే. ఈ చిత్రానికి రూ.500-600కోట్ల బడ్జెట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.105కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. ఇందులో నైజాంలో రూ.45కోట్లు, సీడెడ్‌లో రూ.15కోట్లు, ఆంధ్రాలో మరో రూ.45కోట్లు అయ్యిందని సమాచారం. కర్నాటకలో రూ.100కోట్లకు, తమిళనాడులో రూ.45కోట్లకు, కేరళాలో రూ.15కోట్లకు, నార్త్ లో రూ.75కోట్లకు, రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో రూ.15కోట్లకు అమ్మారట. ఓవర్సీస్‌ రైట్స్ మరో రూ.70కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తంగా రూ.425కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. సినిమా హిట్‌ కావాలంటే రూ.850కోట్ల గ్రాస్‌ రాబట్టాలి. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.

55
టాక్సిక్‌లో ఏం చూపించారంటే?
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌లో ఏం చూపించారంటే?

యష్‌ హీరోగా నటించిన `టాక్సిక్‌` చిత్రానికి గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. యష్‌ కథ అందించారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాంస్టర్‌ మైండ్‌ క్రియేషన్స్ పతాకాలపై యష్‌, వెంకట్‌ కే నారాయణ నిర్మించారు. నయనతార ఆయనకు అక్కగా నటించగా, కియారా అద్వానా, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ యష్‌కి జోడీగా చేశారు. హ్యూమా ఖురేషి మరో కీలక పాత్రలో మెప్పించింది. ఇందులో యష్‌ ద్విపాత్రాభినయం చేశారు. పీరియడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో అతి హింస, అతి రొమాన్స్, అది మందు, సిగరేట్‌ వాడకం ఉంది. అవి తప్ప సినిమాలో మరేం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆడియెన్స్ కి అర్థమయ్యేలా లేదనే టాక్‌ వినిపిస్తుంది. గ్రాండియర్‌గా విజువల్స్ ఉన్నా, సినిమాలో మ్యాటర్‌ లేకపోవడంతో ఆడియెన్స్ ని ఇది బాగా డిజాప్పాయింట్‌ చేసిందని ట్రేడ్‌ పండితులు, క్రిటిక్స్ తోపాటు కామన్‌ ఆడియెన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
నయనతార
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Siva Reddy: 11 లక్షలు పెడితే 100 కోట్లు.. స్నేహితుడి చేతిలో నటుడు శివారెడ్డి ఎలా మోసపోయాడో తెలుసా?
Recommended image2
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image3
Hanuman Ansh Telugu Day 3 Collections: తెలుగులో హనుమాన్‌ అంశ్‌ ఊహించని జంప్‌.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Related Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved