- Home
- Entertainment
- Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్.. టాక్సిక్ ఉందా?.. టాలీవుడ్ దే హవా
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్.. టాక్సిక్ ఉందా?.. టాలీవుడ్ దే హవా
యష్ హీరోగా నటించిన `టాక్సిక్` మూవీ మొదటి రోజు రూ.140 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ మూవీస్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలేంటనేది టాప్ 10 లిస్ట్ చూద్దాం. ఇందులో టాక్సిక్ ఉందా?

అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్
ఇండియన్ సినిమాల్లో.. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. వీటిలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలేంటనేది చూస్తే, టాప్ 10 సినిమాల్లో టాలీవుడ్ అగ్ర స్థానంలో ఉంది. మన సినిమాలే అత్యధికంగా ఉండటం విశేషం. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలున్నాయి. యష్ కూడా చోటు సంపాదించారు.
1.పుష్ప 2
అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో `పుష్ప 2` మొదటి స్థానంలో ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. 2024లో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ఏకంగా రూ.280కోట్లు రాబట్టింది. `పుష్ప` పెద్ద హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఇది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
2.ధురంధర్ 2
రెండో స్థానంలో బాలీవుడ్ మూవీ ఉంది. ఇటీవల `ధురంధర్ 2` విడుదలైన విషయం తెలిసిందే. ఈ సమ్మర్లో వచ్చిన ఈ మూవీ `ధురంధర్`కి పార్ట్ 2గా వచ్చింది. మొదటి భాగం సంచలన విజయం సాధించింది. దీంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.240కోట్లు రాబట్టింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అధిత్య ధర్ దర్శకత్వం వహించారు.
3.ఆర్‌ఆర్‌ఆర్
మూడో స్థానంలో తెలుగు సినిమా `ఆర్‌ఆర్‌ఆర్` ఉంది. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. 2022లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇది మొదటి రోజు రూ.223కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.
4.బాహుబలి 2
అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో `బాహుబలి 2` ఉంది. 2017లో వచ్చిన ఈ మూవీ అంతకు ముందు వచ్చిన `బాహుబలి`కి పార్ట్ 2. మొదటి చిత్రం పెద్ద హిట్ కావడంతో రెండో పార్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ.217కోట్లు రాబట్టడం విశేషం. దీంతో ఇది నాల్గో స్థానంలో నిలిచింది. దీనికి కూడా రాజమౌళినే దర్శకుడు కావడం విశేషం.
5.కల్కి 2898 ఏడీ
అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో మరో ప్రభాస్ మూవీ ఉంది. అదే `కల్కి 2898 ఏడీ`. 2024లో విడుదలైన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ముఖ్య పాత్రలు పోషించారు. ఇది మొదటి రోజు రూ.180 కోట్లు కలెక్ట్ చేసి, అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో ఐదో స్థానంలో ఉంది. దీనికి ఇప్పుడు పార్ట్ 2 రెడీ అవుతుంది.
6.సలార్
ఆరో స్థానంలో సలార్ ఉంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమిది. 2023లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఇది మొదటి రోజు రూ.178కోట్లు కలెక్ట్ చేసింది.
7.కేజీఎఫ్ 2
టాప్ 10 లిస్ట్ లో యష్ మూవీ కూడా ఉంది. ఆయన `కేజీఎఫ్2`తో సంచలనాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కన్నడ సినిమా రేంజ్‌ని చాటి చెప్పారు. ఈ మూవీ 2022లో విడుదలైంది. మొదటి రోజు ఏకంగా రూ.165కోట్లు రాబట్టింది. అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో 7వ స్థానంలో నిలిచింది.
8.ఓజీ
ఇక ఎనిమిదవ స్థానంలో పవన్ కళ్యాణ్ మూవీ ఉండటం విశేషం. అదే `ఓజీ`. ఇది గతేడాది విడుదలైంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదటి రోజు ఏకంగా రూ.155కోట్లు కలెక్ట్ చేసింది.
9.కూలీ
తొమ్మిదో స్థానంలో రజనీకాంత్ చిత్రం ఉంది. ఆయన హీరోగా వచ్చిన `కూలీ` మూవీ గతేడాది విడుదలైంది. ఇందులో నాగార్జున విలన్‌గా నటించగా, అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించారు. ఈ చిత్రం మొదటి రోజు రూ.151కోట్లు కలెక్ట్ చేసింది. దీనికి లోకేష్ కనకరాజు దర్శకుడు.
10.టాక్సిక్
పదో స్థానంలో `టాక్సిక్` ఉంది. ఈ చిత్రం మొదటి రోజు రూ.150కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా ఈ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారాసుతారియా, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటించారు. మొత్తంగా ఇందులో తెలుగు సినిమాదే హవా అని చెప్పొచ్చు. తెలుగు నుంచి ఆరు సినిమాలు టాప్ 10లో ఉండటం విశేషం.

