MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ

OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ

Aparna Balamurali: మలయాళంలో వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఊహించని మలుపులతో చివరి వరకు ఉత్కంఠగా సాగే ఈ సినిమా విశేషాలు మీకోసం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 27 2026, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Must Watch Malayalam Movie
Image Credit : Asianet News

Must Watch Malayalam Movie

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వల్ల మలయాళ సినిమాలకు ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా, డిఫరెంట్ కథ, పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో వచ్చే మలయాళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే చాలా మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయి ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ కోవలో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా 'ఇని ఉదరం' (Ini Utharam). సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎన్నో మలుపులతో సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలు కథేంటి?
Image Credit : youtube/ ThinkMusicIndia

అసలు కథేంటి?

కథ ప్రకారం, జానకి అనే ఒక డాక్టర్ ఉంటుంది. ఒకరోజు ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తాను ఒకరిని హత్య చేశానని షాకింగ్ విషయం చెబుతుంది. కానీ, పోలీసులు ఆమె మాటలను పెద్దగా పట్టించుకోరు. మీడియా ఈ విషయంపై ప్రశ్నించగా, జానకికి మానసిక సమస్యలు ఉన్నాయని పోలీసులు చెబుతారు. అయితే జానకి మాత్రం తన మాట మీదే నిలబడుతుంది. తాను చంపానని చెబుతున్న వ్యక్తి శవాన్ని పాతిపెట్టిన చోటును చూపిస్తానని అంటుంది. దీంతో పోలీసులు, మీడియాతో కలిసి ఆమె ఒక అడవి ప్రాంతానికి వెళ్తుంది. ఈ విషయం తెలియడంతో చాలా మంది గ్రామస్థులు కూడా అక్కడికి చేరుకుంటారు. అక్కడ తవ్వగా రెండు శవాలు దొరుకుతాయి. దీంతో కేసు ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. కానీ, ఆ తర్వాత జానకి చెప్పే మాటతో విచారణ గతే మారిపోతుంది. ఆ ఇద్దరినీ తాను చంపలేదని, ఒక పోలీస్ అధికారే వారిని చంపాడని ఆమె ఆరోపిస్తుంది.
34
ట్విస్టుల మీద ట్విస్టులు
Image Credit : youtube/ ThinkMusicIndia

ట్విస్టుల మీద ట్విస్టులు

జానకి తన ఆరోపణలకు ఆధారాలు కూడా చూపిస్తుంది. దీంతో ఈ విషయం పైఅధికారుల దృష్టికి వెళ్తుంది. పోలీస్ సూపరింటెండెంట్ (SP) నేరుగా రంగంలోకి దిగి విచారణ మొదలుపెడతారు. విచారణలోతుగా వెళ్లేకొద్దీ, ఈ హత్యల వెనుక ఒక మంత్రికి కూడా సంబంధం ఉందని తెలుస్తుంది. అసలు చనిపోయిన ఆ ఇద్దరు ఎవరు? వాళ్లకి, జానకికి సంబంధం ఏంటి? జానకి చెబుతున్నది నిజమేనా? పోలీస్ అధికారిపై చేసిన ఆరోపణలు వాస్తవమేనా? ఈ కేసులో ఒక రాజకీయ నాయకుడి పాత్ర ఏంటి? చివరికి అసలు దోషులు ఎలా దొరికారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
44
ఓటీటీలో ఎక్కడ చూడాలి?
Image Credit : youtube/ ThinkMusicIndia

ఓటీటీలో ఎక్కడ చూడాలి?

'ఆకాశం నీ హద్దురా' (సూరరై పోట్రు) సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణా బాలమురళి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. సుధీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళాభవన్ షాజోన్, హరీశ్ ఉత్తమన్, సిద్దిక్, చందునాథ్ జి. నాయర్, జాఫర్ ఇడుక్కి, సిద్ధార్థ్ మీనన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. 'ఖుషి', 'హాయ్ నాన్న' వంటి సినిమాల్లో తన మెలోడీలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయనే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్. 'ఇని ఉదరం' సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో స్ట్రీమ్ అవుతోంది. సస్పెన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ యాంగిల్, ఊహించని ట్విస్టులు ఉన్న సినిమాలను ఇష్టపడేవారు ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ను మీ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Multistarrer: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Recommended image2
Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image3
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Related Stories
Recommended image1
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved