- Home
- Entertainment
- Karthika Deepam: ప్రేమ్ కు వార్నింగ్ ఇచ్చిన జ్వాల.. శౌర్యను చెంపమీద లాగిపెట్టి కొట్టిన స్వప్న!
Karthika Deepam: ప్రేమ్ కు వార్నింగ్ ఇచ్చిన జ్వాల.. శౌర్యను చెంపమీద లాగిపెట్టి కొట్టిన స్వప్న!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

హిమ సౌర్య (Sourya) దొరికేవరకు పెళ్లి ప్రస్తావన తేవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లగా సౌందర్య.. సౌర్య ఎక్కడున్నా త్వరగా కనిపించేలా చేయి అని దేవుడిని కోరుకుంటుంది. మరోవైపు సౌర్య దేవుడి గుడికి వెళ్లి ఎలాగైనా హిమ (Hima) ను కనిపించేలా చెయ్యి అని కోరుకుంటుంది.
అంతేకాకుండా అమ్మ నాన్న ల నుంచి నన్ను దూరం చేసిన హిమ (Hima) కు సంతోషం లేకుండా చేస్తా అని అంటుంది. ఇక సౌర్య కొబ్బరికాయ కొడుతుండగా అటుగా సప్న వస్తుంది. దాంతో ఆ కొబ్బరి కాయ ముక్క సప్న (Swapna) కు తగులుతుంది. ఇక వారిద్దరి మధ్య కొంత ఘర్షణ జరుగుతుంది.
స్వప్న (Swapna) తో పాటు ప్రేమ్ కూడా గుడికి వస్తాడు. అంతే కాకుండా అక్కడ గుడిలో ఫోటోలు తీస్తు ఉంటాడు. ఇక అది గమనించిన సౌర్య ప్రేమ్ ను ఫోటోలు తీయ్యొద్దు అంటూ గొడవ పడుతుంది. ఇక అదే క్రమంలో ప్రేమ్ ను సౌర్య ఎక్సట్రా అంటుంది. దాంతో ఈలోపు అక్కడకు స్వప్న వచ్చి సౌర్య (Sourya) ను గట్టిగా చెంపమీద కొడుతుంది.
ఇక సౌర్య (Sourya) ఏ మాత్రం పట్టించుకోకుండా నువ్వు మా సత్యం సార్ పెళ్ళానివని వదిలేస్తున్నా అని లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత స్వప్న ఈ అలగా జనాలు అంటుంది. దాంతో సౌర్య ఒక్కసారిగా స్వప్నను కొట్టడానికి చేయి లేపుతుంది. ఇక ఈ లోపు అక్కడకు నిరూపమ్ (Nirupam) వచ్చి సౌర్య ను ఆపుతాడు.
ఇక నిరూపమ్ (Nirupam) తో పాటు హిమ కూడా గుడికి వస్తుంది. దాంతో స్వప్న నేను రమ్మంటే గుడికి రావు.. తను రమ్మంటే మాత్రం వచేస్తావా అని కారాలు మిరియాలు నూరుతుంది. అంతేకాకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని అంటుంది. అదే క్రమంలో నిరూపమ్ తో హిమ (Hima) ను తిరగవద్దు అని హిమకు వార్నింగ్ ఇస్తుంది.
ఇక అంతే కాకుండా అదే కోపంతో స్వప్న (Swapna) వాళ్ల తల్లిదండ్రులు దగ్గరికి వెళుతుంది. అక్కడ హిమ ను చూసి నీ మొహం చూస్తే నాకు నా తమ్ముడు చావు గుర్తుకు వస్తుందని అవమానిస్తుంది. అంతేకాకుండా నాకు మమ్మీ లేదు. డాడీ ఒక్కడే ఉన్నాడు అని ఆనందరావుకు (Anand Rao) చెబుతుంది. కాగా ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.