MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇన్ స్టా గ్రామ్ ద్వారా సమంత నెలకు ఎన్ని కోట్లు సంపాధిస్తుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు

ఇన్ స్టా గ్రామ్ ద్వారా సమంత నెలకు ఎన్ని కోట్లు సంపాధిస్తుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు

స్టార్ హీరోయిన్లకు సోషల్ మీడియా వరంగా మారింది. సినిమా సంపాదన కంటే సోషల్ మీడియా సంపాదనే ఎక్కువైపోయింది స్టార్ బ్యూటీస్ కు. ప్రస్తుతం ఇన్ స్టాలో టాప్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సామ్.. ఇన్ స్టాలో నెలకు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2022, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నాగచైతన్య తో డివోర్స్ తరువాత దూసుకుపోతోంది సమంత. పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతోంది. వరుస సినిమాలు, సోషల్ మీడియా పోస్ట్ లతో దడదడలాడిస్తోంది.  ఏమాయ చేశావే  సినిమాతో  ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సమంత... మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాయ‌ చేసింది. చాలా తక్కువ టైమ్ లోనే  స్టార్ హీరోలంద‌రితో క‌లిసి సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. 
 

27

 ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. డిమాండ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోయింది.  హీరోయిన్ గా రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా... అదే ఫిట్ నెస్ల్ తో.. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆక‌ర్షిస్తుంటుంది. 
 

37

ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత చాలా చురుకుగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు మతిపోయేలా ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అంతే కాదు బ్రాండ్‌లను కూడా ప్ర‌మోట్ చేస్తుంది. అయితే సమంత వరుసగా పోస్ట్ లకు..  బ్రాండ్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా ఎంత సంపాదిస్తుంది అనేది అందరి మదిలో మెదిలే  ప్ర‌శ్న.
 

47

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు ప్ర‌స్తుతం 24 మిలియ‌న్ల్ ఫాలోవ‌ర్స్ అంటే రెండు కోట్ల 40 లక్షల మంది అభిమానులు ఉన్నారు. కాగా స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో  ఫోటోలుపోస్ట్ చేయడంతో పాటు.. కమర్షియల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా  నెల‌కు దాదాపు ర 2 నుంచీ 3 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తుంద‌ట‌. 

57

అంతే కాదు  సామ్ ప్ర‌తి సినిమాకు 3.5కోట్ల నుంచి 4కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం స‌మంత ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాల‌ను చేస్తుంది. ఈ లెక్క‌న చూసుకుంటే సినిమాల‌తో కంటే సోష‌ల్ మీడియా ద్వారానే సామ్ ఎక్కువ‌గా సంపాదిస్తుంది.
 

67

రీసెంట్ గా  స‌మంత న‌టించిన తమిళ సినిమా క‌తు వాకుల రెండు కాద‌ల్ మంచి సక్సెస్ సాధించింది. న‌య‌న‌తార మ‌రో ప్ర‌ధాన హీరోయిన్‌గా, విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్ చేసిన ఈ సినిమాకు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
 

77

ప్ర‌స్తుతం సమంత చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగు,తమిళంతో పాటు.. బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది సామ్.. ఈమె గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం తో పాటు య‌శోదా, సినిమాలు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం  విజ‌య్‌ దేవరకొండతో ఖుషి సినిమాను చేస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: ఎయిర్‌పోర్ట్ లో సాయిపల్లవిని పట్టుకుని నిలదీసిన మహిళ.. ఆ వివాదాన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌
Recommended image2
Katrina Kaif: తన సినిమాలో కత్రినా కైఫ్ ఉంటే చాలు ఆ హీరోకి పండగే.. 7 సినిమాలు చేస్తే ఇన్ని హిట్లా?
Recommended image3
Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved