MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: ప్రేమను గెలుచుకున్న ఆనందంలో వసు, రిషీ.. సాక్షి దేవయాని సరికొత్త ప్లాన్!

Guppedantha Manasu: ప్రేమను గెలుచుకున్న ఆనందంలో వసు, రిషీ.. సాక్షి దేవయాని సరికొత్త ప్లాన్!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

3 Min read
Author : Navya G
Published : Aug 27 2022, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసు, రిషి కారులో వస్తూ ఉంటారు. అప్పుడు వసు గొడవలతో మొదలైన మన పరిచయం ఇంతవరకు వచ్చింది. ఏ నిమిషం మిమ్మల్ని ప్రేమించానో తెలీదుకానీ ఆ బంధం చాలా గట్టిగా ఉన్నట్టున్నది అందుకే ఇన్ని గొడవలు వచ్చినా నిలబడగలిగింది అని అనుకుంటుంది. అప్పుడు రిషి ఏం ఆలోచిస్తున్నా వసుధార? నేను చెప్పనా నువ్వు ఏమనుకుంటున్నావో గొడవలతో మొదలైన ఒక మనిషి తో ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు తర్వాత ఆఖరికి ఒకటి అయ్యేము అని అనుకుంటున్నావు కదా అని రిషి అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 మీకు ఎలా తెలుసు సార్ అని వసు అంటుంది. ఇద్దరు మనసులు ఒకటే కదా అని అంటాడు రుషి.ఇంతట్లో ఇల్లు వస్తుంది వసు ని ఇంట్లో దింపేస్తాడు. తర్వాత రుషి తిరిగి వెళుతున్నప్పుడు దారిలో కార్ ఆపి ఆనందంతో, నీ జీవితం ఈరోజు నుంచి ఆనందంగా ఉండబోతుంది రిషి. ఇంక నుంచి వసుధర నీది నువ్వు తన ఆశయాన్ని నిలబెట్టాలి. నాకు ఇంత చేసిన కాలానికి ధన్యవాదాలు అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మహేంద్ర గౌతమ్ లు దీనంగా మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తూ అసలు రిషి మనసులో ఏముందో తెలియాలి అని అనుకుని ఇప్పుడు రిషి వస్తాడు.
 

37

మనతో కూర్చోబెట్టి అడిగేద్దాం అని అనుకుంటారు. అదే సమయంలో రిషి అక్కడికి వస్తాడు. రా రిషి అలా కూర్చుని మాట్లాడదాం అని అనగా రిషి,నాకు పని ఉన్నది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు జగతి అక్కడికి వస్తుంది అప్పుడు రిషి మనసులో ఒక తెగిపోయిన అనుబంధం వల్ల నాకు ఒక తీపి అనుభూతి మిగిలింది అని మనసులో అనుకొని,బైటకి థాంక్స్ మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. జగతికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ తర్వాత సీన్లో రాత్రి రిషి,వసు ఇద్దరు ఒకరి ఫోటోలు ఒకరు చూసుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి వసుకి మెసేజ్ చేద్దామనుకుంటాడు కానీ చదువు డిస్టర్బ్ అవుతాదని వదిలేస్తాడు.
 

47

అప్పుడు వసు కూడా రిషికి మెసేజ్ చేద్దాం అనుకుంటాది.కానీ సార్ చదవమన్నారు కదా పరీక్షలు అయ్యేంతవరకు మెసేజ్ చేస్తే బాగోదేమో అని వదిలేస్తుంది.ఆ తర్వాత సీన్లో ఉదయం సాక్షి , దేవయాని మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఒక తప్పు వల్ల రిషిని వదిలేయడం మంచిది కాదు సాక్షి అని దేవయాని  అంటుంది. అప్పుడు సాక్షి ఒక అమ్మాయికి తన భర్త పేదవాడైనా పర్లేదు తన బదులు ఇంకొక అమ్మాయి పేరుతో పిలవడం మాత్రం సహించలేదు ఆంటీ నిశ్చితార్థం వరకు వచ్చి ఆ వసుధార పేరు పలకడం ఏంటి ఆంటీ అని కోపంగా ఉంటుంది సాక్షి.
 

57

ఇంతట్లో ధరణి అక్కడికి వచ్చి వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదైనా పథకం వేస్తున్నారా అని అనుకుని లోపలికి వెళ్లి కాపీ ఇస్తుంది. అప్పుడు దేవయాని, ఏం ధరణి మా మాటలు వినడానికి వచ్చావా అని అంటుంది. అప్పుడు ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి మంచం మీద పడుకొని ఉంటాడు. గౌతమ్ మహేంద్రలు రిషికి ఇరువైపులా కూర్చొని రిషి ముఖానికి దగ్గరగా వెళ్లి ఎప్పుడు లేస్తాడా ఈ రోజైనా కనుక్కుందాం అని అనుకుంటారు. ఇంతట్లో జగతి అక్కడికి వచ్చి వద్దు మహేంద్ర పడుకున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అంటుంది.
 

67

ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి మీరు ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగా ముగ్గురు మూడు కారణాలు చెప్తారు. అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది అని దేవయాని అనుకుంటుంది. ఇంతట్లో కార్ రిపేర్ చేయాలి అని గౌతమ్ మహేంద్రలు అక్కడ నుంచి తప్పించుకుంటారు. అప్పుడు దేవయాని జగతి మాట్లాడుకుంటూ దేవయాని జగతితో, ఏమి జగతి రిసీ నిన్ను పేరు పెట్టి పిలవమన్నాడు అని సంబరపడిపోతున్నావా ఏది జరిగినా నిన్ను అమ్మా అని మాత్రం పిలవడు అని అంటుంది.
 

77

అప్పుడు జగతి, నాకు అవసరం లేదు అక్కయ్య నన్ను ఇంట్లో ఉంచుకొని రిషి అని పిలవమన్నాడు నాకు ఇంకేమీ అవసరం లేదు  నాకు మీలా పెత్తనాలు అధికారాలు మీద అసలు లేవులెండి అని నవ్వుతూ వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సీన్లో వసు కూడా నిద్రలేచి రిషి ఫోటో చూసుకొని సర్ మీరు చెప్పినట్టే చదువుతున్నాను సార్. కాకపోతే ఈరోజే కొంచెం లేటుగా లేచాను. బాగా కష్టపడుతున్నాను సార్ అని అంటుంది.ఒకవేళ మీరు నమ్మకపోతే ఇది చూడండి అని ఒక పెద్ద షీట్ మీద నీ ఆశయమే నీకు ముఖ్యం అని రిషి అన్న మాటలను గోడమీద అతికిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved