MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: చక్రపాణితో రిషి తనకు కాబోయే భర్త అని చెప్పిన వసుధార.. ఆనందంలో రిషి కుటుంబం?

Guppedantha Manasu: చక్రపాణితో రిషి తనకు కాబోయే భర్త అని చెప్పిన వసుధార.. ఆనందంలో రిషి కుటుంబం?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 29 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 29 2022, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో మహేంద్ర ఈ మధ్య నువ్వు ఎందుకు చిన్న వాటికి భయపడుతున్నావు ఎందుకు నీలో ఈ భయం ప్రవేశించింది అని అడుగుతాడు. వసుధర రిషి ఇద్దరు కలిసి పోవాలని మనం ఎంత తాపత్రయ పడ్డాము వాళ్ళు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నంత దగ్గరగా కలిసిపోయారు. చివర్లో పెళ్లి జరుగుతుంది అనుకుంటున్న సమయంలో దేవయాని అక్కయ్య ఏం చేస్తారేమో అని భయంగా ఉంది అంటుంది జగతి. అప్పుడు జగతి దేవయాని గురించి భయంతో మాట్లాడడంతో వెంటనే మహేంద్ర తాను ఎన్ని ఎత్తుగడలు వేసిన ఇదివరకు మాదిరి చూస్తూ ఊరుకోం కదా అని అంటాడు మహేంద్ర. మరొకవైపు దేవయాని, రాజీవ్ కి ఫోన్ చేసి చెప్పిన పని ఏం చేశావు ఈ దేవయాని గెలవాలి అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు వాళ్లు ఓడిపోతారు నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను మేడం అని అంటాడు. మీ అబ్బాయిగారు మా మరదలు గారు ఇందాకే కనిపించారు షికార్లు కొడుతున్నారు అనడంతో దేవయాని షాక్ అవుతుంది. కనిపిస్తే ఏం చేస్తున్నావు అనడంతో ఈ రాజీవ్ ఏం చేయాలో అది చేస్తాను చూస్తూ ఉండండి అంత తక్కువ అంచనా వేయొద్దు అని అంటాడు. ఇప్పుడు దేవయాని ఫోన్ కట్ చేసి జగతి వాళ్ళ వైపు చూస్తూ మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది నేను జరగనివ్వను అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు వసు, రిషి ఇద్దరు కలిసి ఒక చోటకి వెళ్తారు. అప్పుడు వసుధార బాధతో ఇంటికి వెళ్తుండగా రిషి పిలిచి ఇంకా కొన్ని గంటలే కదా మన మధ్య ఈ దూరం అని సంతోషంగా మాట్లాడతాడు.

37

అప్పుడు నేను కూడా అదే ఆశిస్తాను సార్ అనడంతో నువ్వు ఎందుకు ఇంత డల్ గా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు రిషి. అప్పుడు రిషి ఇదిగో ఈ ఫోన్ నీ కోసమే అని అంటాడు. ఆ తర్వాత వసుధార ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అప్పుడు రిషి వసుధార నా దగ్గర ఏమైనా దాస్తోందా అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు చక్రపాణి వసుధార కోసం ఇంటి గుమ్మం ఎదురుగా కూర్చుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు చక్రపాణి మాట్లాడే మాటలకు సుమిత్ర ఎమోషనల్ అవుతూ ఉంటుంది. రాని దాని సంగతి ఈరోజు చెప్తాను అని చక్రపాణి అంటుండగా ఇంతలోనే అక్కడికి వసుధర వస్తుంది. అప్పుడు వసుధార లోపలికి వెళ్తుండగా ఆగు ఎవడే వాడు అనడంతో నాన్న మర్యాద అని అంటుంది వసుధార.

47

 ఎవడు వాడు అని పదేపదే అడగడంతో వసుధర నాకు కాబోయే భర్త అని గట్టిగా అరిచి చెబుతుంది. దాంతో చక్రపాణి, సుమిత్ర ఇద్దరు షాక్ అవుతారు. నరికేస్తాను అని అనడంతో ఆగండి నాన్న అనవసరంగా ఆవేశ పడకండి అనడంతో వెంటనే చక్రపాణి సుమిత్ర పై సీరియస్ అవుతూ ఏం పెంపకమే నీది అని అంటాడు.  అప్పుడు వసుధార చెప్పేది మనశ్శాంతిగా వినండి వచ్చింది రిషి సార్ మేమిద్దరం ఇష్టపడ్డాము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము అనడంతో చక్రపాణి సుమిత్ర ఇద్దరు షాక్ అవుతారు. రిషి సార్ వజ్రం లాంటివాడు వాళ్ళది పెద్ద కుటుంబం వాళ్ళింట్లో కూడా ఒప్పుకున్నారు అనడంతో వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే సరిపోతుందా ఒప్పుకోవాల్సిన పనిలేదా అని అంటాడు చక్రపాణి. అప్పుడు వసుధార అమ్మ పంచాంగం చూసి మంచి సమయం చెప్తే వాళ్లు వచ్చి పద్ధతిగా మాట్లాడి వెళ్లిపోతారు అని అంటుంది.

57

మతి ఉండే మాట్లాడుతున్నావా మా అంగీకారం నీకు అవసరం లేదా అని అంటాడు చక్రపాణి. అప్పుడు వసుధార బాధ్యత అంటే కూతురితో ప్రేమగా మాట్లాడడం, బాధ వచ్చినప్పుడు దగ్గరికి తీసుకుని ఓదార్చడం అంతేకానీ అరవడం బాధ్యత కాదు నాన్న అని అంటుంది. అక్కవాళ్ళ తల వంచి తాళి కట్టించావు ప్రస్తుతం వాళ్లు ఏం చేస్తున్నారు ఒకరు చచ్చి బతుకుతుంటే మరొకరు బతుకుతూ చస్తున్నారు అని అంటుంది. కానీ నేను అలా కాదు నువ్వు చెప్పినట్టు తలవంచను తాళి కట్టించుకోను అని అంటుంది. రిషి సార్ నా జీవితం రిషి సార్ ని పెళ్లి చేసుకుంటాను అని తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మరొకవైపు బయటకు వెళ్లిన రిషి సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు.

67

 వసుధర తిరిగిన ఊరు ఇది పెరిగిన స్థలం ఇది నాతో కలిసి వసుధార జీవితాంతం నడవబోతోంది అని సంతోషపడుతూ ఉంటాడు. వసు అన్న మాటలు తలచుకొని ఏమైంది అసలు అని అనుకుంటూ ఉంటాడు రిషి. మరొకవైపు వసుధార కొత్త ఫోన్ తీసుకొని దాంట్లో రిషి ఫోటోలు చూస్తే మురిసిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి సుమిత్ర వస్తుంది. అప్పుడు సుమిత్ర మీ నాన్న పట్టుదల గురించి నీకు తెలిసిందే కదా అమ్మ అని మాట్లాడుతూ ఉండగా, నాన్నతో గట్టిగా మొండిగా మాట్లాడకపోతే అసలు ఒప్పుకోడు అని అంటుంది వసుధార. నువ్వు ఒకసారి నా కోసం గట్టిగా ప్రయత్నం చేయమ్మా నేను ఇలా ఆలోచించకపోతే నా జీవితం కూడా అక్క జీవితం లాగే అయిపోతుంది అని అనడంతో సుమిత్ర ఆలోచనలో పడుతుంది.
 

77

అప్పుడు వసుధార రిషి ఫోటో సుమిత్రకు చూపించడంతో మహారాజులా ఉన్నాడు అని పొగుడుతుంది. అప్పుడు వారిద్దరూ రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దేవయానికి రిషి ఫోన్ చేయడంతో ఏంటి రిషి ఫోన్ చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. హాల్లో ఉన్నారా అయితే అందరిని ఒకసారి పిలవండి అని అంటాడు. ఇప్పుడు ధరణి వెళ్లి అందర్నీ పిలుచుకొని వస్తుంది. అప్పుడు రిషి వసుధార ఏ క్షణంలో అయిన మనల్ని బయలుదేరమని చెప్పొచ్చు అందరు రెడీగా ఉండండి అని అంటాడు. దాంతో దేవయాని షాక్ అవుతుంది అందరూ సంతోషపడుతూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved